Sunday, December 30, 2007

దొంగ జర్నలిస్టులున్నారు జాగ్రత్త..

ఛానెళ్ళు, పత్రికలు పెరిగి పోయాక వార్తా సేకరణ కోసం తిరిగే రిపోర్టరు ఎక్కడ పడితే అక్కడ కనిపిస్తున్నారు. సమావేశాలు, ప్రెస్ మీట్లకు వచ్చే రిపోర్టర్ల సంఖ్య గతంలో కన్నా బాగా పెరిగి పోయింది. ఎవరు ఏ పత్రికలో, ఏ ఛానెళ్ళో పని పని చేస్తున్నారో అర్థం కాని గందరగోళ పరిస్థితి. కార్యక్రమ నిర్వాహకులు 'మీరు ఏ మీడియా? అని అడిగితే ఏం ఇబ్బందో అని అడగని ఇబ్బందికర పరిస్థితి. దీన్ని ఆసరాగా చేసుకొని బోగస్ రిపోర్టర్లు బయలు దేరారు. దర్జాగా వచ్చేస్తున్నారు. ఏదో ఒక పత్రిక పేరో, ఛానెల్ పేరో చెప్పేస్తున్నారు. నిర్వాహకులు పెట్టే టిఫిన్లు, టీ-కాఫీలు, భోజన తాంబూలాదులు లాగించేస్తున్నారు. ఇచ్చే గిఫ్టులు పుచ్చుకొని చెక్కేస్తున్నారు. ముఖ్యంగా మధ్యాన భోజన పథకం అమలులో ఉన్న తెలుగుదేశం పార్టీ బీట్లో ఈ బోగస్ జర్నలిస్టులు ఎక్కువ కనిపిస్తుంటారు. బోగస్ జర్నలిస్టుల తాకిడిని తట్టుకోవడానికి బిజినెస్ ప్రెస్ మీట్లు నిర్వహించే ఈవెంట్ మేనేజర్లు తెలివైన ఎత్తుగడ వేస్తున్నారట. తమకు అవసరమైన రిపోర్టర్లనే గుర్తించి వ్యక్తిగతంగా కలుసుకొని గిఫ్టులు, కవర్లు అందజేస్తున్నారట. ఈ పద్దతేదో బాగుంది కదూ? బోగస్ రిపోర్టర్లను అరికట్టాల్సిన బాధ్యత నిజమైన జర్నలిస్టులందరిది? లేకపోతే మీకూ ఇబ్బందులు తప్పవు.

టిటివి వచ్చేస్తోంది..

తెలుగులో మరో కొత్త ఛానెల్ ' టిటివి ' త్వరలో రాబోతోంది. ఇందుకోసం ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. ఇప్పటిదాకా వచ్చిన సమాచారం ప్రకారం ' టిటివి 'కి సీఇవో-కం-ఎడిటర్ గా కె.రామచంద్ర మూర్తి పేరు వినిపిస్తోంది. ఆయన ఇప్పటికే ఆంధ్రజ్యోతికి రాజీనామా ఇచ్చారని తెలుస్తోంది. ఇక టిటివి ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ పోస్టుకి ప్రస్తుతం ఖాళీగా ఉన్న భావనారాయణ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ఇంతకీ ' టిటివి ' అంటే ఏమిటి? తెలుగు టీవీయా? తెలంగాణా టీవీయా? లేక 'ట్రూత్ టీవీ'యా అన్నది స్పష్టం కాలేదు. ప్రముఖ ఫర్టిలైజర్ కంపనీ ఈ ఛానెల్ పెడుతోందిట..

Tuesday, December 25, 2007

ధనార్జనా నీదే ఛానెల్?

చందూ జనార్ధన్ మరో కొత్త కొలువు సంపాదించాడు. ఇప్పుడాయన విస్సా ఛానెల్లో చేరిపోయాడు. ధనార్జనుడిగా అపఖ్యాతి తెచ్చుకున్న ఇతడి ఘన చరిత్రను మీడియా వర్గాలు కథలు, కథలుగా చెప్పుకుంటున్నాయి. గతంలో జనార్ధనుడి లీలను ఎబౌట్ తెలుగు మీడియా చాటి చెప్పినా కుక్క తోక వంకర అన్నట్లు అతడి వైఖరిలో ఎలాంటి మార్పు రాలేదు. రాయడం చేత కాకున్నా జర్నలిస్టు ఫోజు కొట్టడం జనార్ధనుడికే చెల్లు. ఎర్రం నాయుడు రికమండేషన్ తో ' సీ-ఛానెల్ ' జనార్ధన్ ను నమ్మి బ్యూరోచీఫ్ ఉద్యోగం ఇస్తే పైరవీలు చేసుకుంటూ నెలల తరబడి అఫీసుకెల్లకుండా నరసిం హా రావు అనే నమ్మిన బంటుతో ఫోన్లపైనే మేనేజ్ చేశాడు. చివరకు సంస్థకే ఎసరు పెట్టబోయి ఉద్యోగం పోగొట్టుకున్నాడు. ఆ తర్వాత ఎన్నటికీ వచ్చే అవకాశం లేని సత్యా టీవీ పేరు చెప్పుకొని తిరిగాడు. అక్కడి నుండి అప్పటి చెన్నై జెమిని న్యూస్ ఎడిటర్కి ముడుపులు సమర్పించుకొని ఢిల్లీ రిపోర్టర్ గా ఉద్యోగం సంపాదించాడు. కానీ ఢిల్లీ నుండి ఏనాడు సరిగ్గా వార్తలు పంపకుండా పైరవీలకే పరిమితం అయ్యాడు. ఆ మధ్య పది రోజులు సెలవు పెట్టి జెమినికి రిజైన్ చేయకుండానే ఆంధ్రప్రభ హైదరాబాద్ బ్యూరోచీఫ్ ఉద్యోగం సంపాదించాదు. ఇందు కోసం కేంద్ర మంత్రి రేణుకా చౌదరితో పైరవీ చేయించుకున్నాడు. కానీ వారం రోజులు తిరక్కుండానే ఢిల్లి జెమిని ఉద్యోగంలో చేరిపోయాడు. ఈ వ్యవహారం వెనుక ఆసక్తికరమైన కథ ఉంది. ఆంధ్ర ప్రభ ఏడిటర్ ఒక ఆర్టికల్ రాయమని జనార్ధన్ కు చెప్పారు. జనార్ధన్ ఆ పని చేయలేదు. అసలాయనకు రాయటం వస్తే కదా?.. జనార్ధన్ను ఎడిటర్ గారు మందలించే సరికి చెప్పా పెట్టకుండా ప్రభ ఆఫీస్ వది వచ్చాడు. తిరిగి ఢిల్లీ చేరిన జనార్ధన్ కు సతీష్ బాబు జెమిని ఛీఫ్ ఎడిటర్ కావడం పిడుగు లాంటి వార్త అయింది. జెమినిలో ఆటలు సాగవని అర్థమైన జనార్ధన్ సైలెంట్ గా 'విస్సా'లో చేరిపోయాడు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే జనార్ధన్ ఇంకా జెమినికి రాజీనామా ఇవ్వలేదట. జెమిని వారు ఇంత గుడ్డిగా ఎలా ఉన్నారు?.. అసలు జనార్ధన్ లాంటి అవినీతి పరునికి విస్సా న్యూస్ టీం ఎలా ఉద్యోగం ఇచ్చింది?.. అసలు సాంకేతికంగా జనార్ధన్ జెమినిలో ఉన్నట్లా?.. విస్సాలో ఉన్నట్లా?.. ఇంతకీ నీదే ఛానెల్ ధనార్జనా?.. అసలు జనార్ధన్ లాంటి వ్యక్తికి ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టుల సంఘం, హౌసింగ్ సొసైటీ ఎందుకింత ప్రాధాన్యత ఇస్తాయి?..

Sunday, December 23, 2007

ప్లాట్ల కోసం జర్నలిస్టుల పాట్లు

రాజశేఖర రెడ్డి ప్రభుత్వం జర్నలిస్టులకు ఇళ్ళ స్థలాలు ఇవ్వడం ఖాయమని స్పష్టం కావడంతో మీడియా వర్గాల్లో ఎక్కడలేని హడావుడి మొదలైంది. ఇళ్ళ స్థలాల కోసం జర్నలిస్టులు వర్గాలుగా చీలిపోయి ఎవరికి వారుగా విడివిడిగా ప్రయత్నాలు మొదలు పెట్టారు. ప్రస్థుతం వున్న జర్నలిస్ట్ హౌసింగ్ సొసైటీ (జూబ్లీహిల్స్), ఎలక్ట్రానిక్ మీడియా హౌసింగ్ సొసైటీ, కెమెరామెన్స్, ఫొటోగ్రాఫర్స్ సొసైటీలకు తోడుగా ' గ్రూప్ ' పేరిట ఇళ్ళ స్థలాల ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ ' గ్రూప్ ' ఏమిటని ఆశ్చర్యపోతున్నారా? ప్రస్తుతం ఉన్న జూబ్లీహిల్స్ హౌసింగ్ సొసైటీపై ఎన్నో ఆరోపనలు కేసులు ఉండటం వల్ల, అందులో ఉంటే లేనిపోని చిక్కులు ఉంటాయని, ప్లాట్లు వచ్చే అవకాశం లేదని భావించిన వారు గ్రూప్ పేరిట ఇళ్ళ స్థలాల ప్రయత్నం మొదలు పెట్టారు. అమర్ మద్దతుతో ప్రారంభమైన ఈ గ్రూప్ కి ప్రభుత్వంలోని పెద్దల సహకారం ఉందని ప్రచారం జరుగుతోంది. మరోవైపు ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టుల హౌసింగ్ సొసైటీ కూడా తీవ్ర కసరత్తు చేస్తోంది. గతంలో జూబ్లీహిల్స్ సొసైటీ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులకు సబ్యత్వం ఇవ్వడానికి నిరాకరించడం వల్లే వారు ప్రత్యేక సొసైటీ పెట్టుకున్నారు. ఎలక్ట్రానిక్ మీడియాలోని కొందరు జర్నలిస్టులకు జూబ్లీహిల్స్ సొసైటీలో సభ్యత్వం ఉంది. ఈ ద్వంద్వ సభ్యత్వ వివాదం ఏ పరిణామాలకు దారి తీస్తుందోనని వారు భయపడుతున్నారు. జూబ్లీహిల్స్ సొసైటీ అయినా, ఎలక్ట్రానిక్ మీడియా సొసైటీ అయినా అక్రమాలకు అంతు లేకుండా పోయింది. ఎందరో సీనియర్ జర్నలిస్టులకు మొండి చేయి చూపించిన జూబ్లీహిల్స్ సొసైటీలో గతంలొ పత్రికాఫీసుల్లో పని చేసే లిఫ్ట్ బాయ్లు, ఆఫీస్ బాయ్లు, కమ్యూనిస్ట్ పార్టీ అగ్రనేతలకు సభ్యత్వం లభించడమే కాదు ఇళ్ళ స్థలాల కేటాయింపు కూడా జరిగిపోయింది. ఇప్పుడు ఏర్పడ్డ ఎలక్ట్రానిక్ మీడియా హౌసింగ్ సొసైటీలో కూడా నిబంధనలకు విరుద్దంగా ఆంకర్లకు, ప్రొడ్యూసర్లకు, టెక్నికల్ సిబ్బందికి బోగస్ సర్టిఫికెట్ల ద్వారా సభ్యత్వం లభించింది. ఎలక్ట్రానిక్ మీడియాలో, అందునా హైదరాబాద్లో మూడేళ్ళు పనిచేసి ఉండాలనే నిభందన వల్ల చాలా మొంది తప్పుడు డాక్యుమెంట్లు పెట్టి సభ్యత్వానికి అర్హత పొందారు. వీరి కారణంగా నిజమైన జర్నలిస్టులకు అన్యాయం జరిగే అవకాశం ఉంది.
కొసమెరుపు: రాజశేఖర రెడ్డి ప్రభుత్వం గనక దయతలిచి ఇళ్ళ స్థలాలు ఇస్తే చాలా మంది జర్నలిస్టులు వాటిని అమ్ముకొని కోటీశ్వరులైపోయి, పాత్రికేయ వృత్తికి గుడ్బై చెబుదామనుకుంటున్నారు. గతంలో ఇళ్ళ స్థలాలు పొంది ఖరీదైన జీవితం అనుభవిస్తున్న జర్నలిస్ట్ మిత్రులే వారికి స్పూర్తి. అఫ్ కోర్స్ గతంలో ఇళ్ళ స్థలాలు పొంది వెంటనే అమ్ముకొని, తీరా వాటికి ధర పెరగటం చూసి నష్టపోయాం బాబో అని లబో దిబో అంటున్న జర్నలిస్టులు కూడా ఉన్నారనుకోండి.

Thursday, December 13, 2007

టీవీ-5 శవాల వ్యాపారం

తెహల్కా వాళ్ళు ఒకసారి స్టింగ్ ఆపరేషన్ల కోసం వ్యభిచారిణులను వాడుకోవడంపై పెద్ద రచ్చ జరగటం అందరికీ గుర్తుండే ఉంటుంది. ఇప్పుడు టీవీ-5 ఛానెల్ అంతకన్నా నీఛానికి ఒడిగట్టింది. ఉస్మానియా ఆస్పత్రి మార్చురీలో శవాలను అమ్ముతున్నారని నిరూపించేందుకు టీవీ-5 వారు ఏకంగా శవాలను కొన్నారు. అయితే ఇక్కడే కథ అడ్డం తిరిగింది. శవాను కొన్నాక ఏమి చేసుకోవాలో తెలియక అక్కడే వదిలి వెళ్ళారు. మార్చురీ సిబ్బంది కంగారులో మూసీలోకి తోయడం, మరునాడు రచ్చ జరిగి పోవడం అందరికీ తెలిసిన విషయాలే. సంచలన వార్తల కోసం ఇంత కక్కుర్తి పడటం సరైన పనేనా? టీఆర్పీ రేటింగులు పెంచుకోవడానికి ఇంత అసహ్యమైన పనులకు దిగజారడం అవసరమా. వీరికన్నా వయభిచారిణులే నయం. వారు పొట్ట కూటికే వ్యభిచరిస్తారు తప్ప సమాజానికి అంతగా హాని చేయరు.
కొసమెరుపు: శవాల వ్యాపారం స్థాయికి దిగజారిన టీవీ-5పై పోఅలీస్ కేస్ నమోదై అరెస్ట్ వారెంట్ జారీ అయింది. ఇప్పుడు టీవీ-5 వారు మీడియా స్వేచ్చ అంటూ సిగ్గు లేకుండా జర్నలిస్ట్ సంఘాల మద్దతు కోరుతున్నారు.

మహిళా జర్నలిస్టులకు చోటు లేదా?

అన్ని రంగాల్లోనూ పురుషులతో సమానంగా దూసుకెళ్ళుతున్న మహిళలకు మీడియాలో తగిన స్థానం లభించక పోవడం ఏమిటి? మహిళా సాధికారితపై, చట్ట సభల్లో 33 శాతం రిజర్వేషన్ల కోసం పుంకాను పుంకాలుగా వార్తా కథనాలు ఇస్తున్న మీడియా యాజమాన్యాలు చేస్తున్నదేమిటి? ప్రింట్ మీడియాలో ఉన్న కొద్ది మంది మహిళలు కూడా డెస్క్ వరకే పరిమితం అవుతున్నారు. రిపోర్టింగ్లో వారికి అవకాశాలు అంతంత మాత్రమే లభిస్తున్నాయి. ఇక ఎలక్ట్రానిక్ మీడియాలో మాత్రమే మహిళా జర్నలిస్టుల సంఖ్య అంతో ఇంతో కనిపిస్తుంది. టీవీ-9లో చెప్పుకోదగ్గ స్థాయిలోనే మహిలా రిపోర్టర్లు ఉన్నారు. ఈటీవీ, ఎన్-టీవీ, టీవీ-5లలో కొద్ది మంది కనిపిస్తుంటారు. కాని జెమిని, మాటీవీ ఛానెళ్ళలొ అసలు మహిళా రిపోర్టర్లే కనిపించరు. ఏం మహిళలు రిపోర్టింగ్లో పనికిరారని ఈ ఛానెళ్ళ ఉద్దేశ్యమా?

Sunday, December 9, 2007

ఆంధ్రభూమి దినపత్రిక 09-12-2007 / 10-12-2007




మీడియా ' చిరు ' భజన

చిరంజీవి రాజకీయ ప్రవేశ వార్తలపై రాష్ట్రమంతా ఉత్కంఠత నేలకొంది. ఈ వార్త విషయంలో మీడియా పడుతున్నా పోటీ అంతా ఇంతా కాదు. చిరంజీవి రాజకీయాలకు రావాలా? వద్దా? వస్తే ప్రజాదరణ ఎలా ఉంటుంది? పార్టీ పెడితే ఎవరికి నష్టం? అనే అంశాలపై ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలు పోటీలు పడి వార్తలు ఇస్తున్నాయి. సర్వేలు చేస్తున్నాయి. ఇదే అవకాశంగా మీడియాలో వీలైనంత ప్రచారం పొందేందుకు చిరు రాజకీయ ప్రవేశంపై రాజకీయ పార్టీలు, కుల సంఘాలు, అభిమాన సంఘాలు తమ వంతుగా ప్రకటణలు చేస్తున్నాయి. ఇదంతా చూస్తుంటే 1982లో ఎన్.టీ.రామారావు తెలుగుదేశం పార్టీ పెట్టినప్పుడు ఈనాడు ఇచ్చిన పబ్లిసిటీ గుర్తుకు వస్తోంది. తేడా ఒక్కటే.. అనాడు రామారావుకు ఈనాడు ఒక్కటే ఉంటే, ఈరోజున ఎన్నో పత్రికలు, ఛానెళ్ళు ' చిరు 'కి తమవంతు సహకారాన్ని అందిస్తున్నాయి. ఎన్.టీ.ఆర్. రాజకీయాల్లోకి వచ్చినప్పుడు ఈనాడుతో పాటు అన్ని పత్రికల సర్క్యులేషన్ ఇబ్బడి ముబ్బడిగా పెరిగింది. అందుకే చిరంజీవికి ఉన్న ప్రజాభిమానాన్ని మీడియా పోటీలు పడి సొమ్ము చేసుకో ప్రయత్నిస్తోంది. wish you all the best CHIRU..

ఆంధ్రభూమి దినపత్రిక 08-12-2007 నుండి


అమ్మకానికి ఛానెళ్ళు

మీరో న్యూస్ ఛానెల్ పెట్టాలనుకుంటున్నారా.. ఒక్కసారి ఆలోచించండి.. ఇది గిట్టుబాటు వ్యాపారమేనా అని. ఇటీవలే ప్రారంభమైన రెండు ఛానెళ్ళు అంతంత మాత్రంగానే నడుస్తున్నాయి. భారీ పెట్టుబడులతో, అట్టహాసపు జీతాలతో ప్రారంభించిన ఈ ఛానెళ్ళు ఎంతగా పోటీపడి నడిపిస్తున్నా ప్రేక్షకాదరణ అంతగా లేక, ప్రకటణలు రాక యజమానులకు చేతి చమురు వదులుతోందిట. యజమానుల చివాట్లు, వత్తిడులు భరించలేక జర్నలిస్టులు కూడా ఉద్యోగాలు వదులుకుంటున్నారు. మరోవైపు ఈ ఛానెళ్ళలో పెట్టుబడులు పెట్టిన పెద్ద తలకాయలు ఇదేమి గిట్టుబాటు వ్యవహారం కాదని వాటాలు తీసేసుకోవడానికి ప్రయత్నిసున్నారు. ఈ పరిస్థితుల్లోంచి గట్టెక్కాలంటే ఛానెళ్ళను అమ్ముకోవడమే మంచిదని యజమానులు భావిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే ఒక ఛానెల్ని కొనుగోలు చేసేందుకు బీజేపీ జాతీయ అగ్రనేత ఒకరు బేరసారాలు సాగిస్తున్నట్లు తెలుస్తోంది. అసలు తెలుగులో ఇన్ని 24 గంటల వార్తా ఛానెళ్ళు అవసరమా? ఒక్కసారి ఆలోచించండి.. అసలీ ఛానెళ్ళు ఎందుకు నడుపుతున్నారు.. ఎవరు చూస్తున్నారు.. ఫీల్డులో వార్తలకోసం, స్క్రోలింగులు, ఫ్లాషులు, లైవులు, పీటూసీల కోసం జర్నలిస్టు సోదరులంతా ఎందుకింత పోటీలు పడుతున్నారు.. అఫ్కోర్స్ మన ఉద్యోగ ధర్మం నెరవేరుస్తున్నాం అనుకోండి.. న్యూస్ ఛానెళ్ళ రేటింగులే తక్కువ.. పైగా కొద్ది మార్కెట్ మెతుకుల కోసం ఎందుకింత హైరానా?..

Tuesday, November 27, 2007

ఆంధ్రభూమి దినపత్రిక 27-11-2007


జెమినిలో ఇక సతీష్ బాబు మార్క్

జెమిని న్యూస్ చీఫ్ ఎడిటర్ బాధ్యతలను చేపట్టిన సతీష్ బాబు ఛానెల్ ప్రక్షాళన ఆరంభించారు. జెమిని న్యూస్ ను సమూలంగా మార్చే దిశగా కొత్త యాంకర్లు, వాయిస్ ఓవర్ ఆర్టిస్టులు, సబ్ ఎడిటర్లు, రిపోర్టర్లను కొత్తగా తీసుకుంటున్నారు . తనదైన కార్యక్రమాలతో ఛానెల్ కు కొత్త రూపం తేవాలన్నదే ఆయన తాపత్రయం. నాలుగు ఓబీ వ్యాన్లను కూడా తెప్పిస్తున్నారట. అయితే మార్పుల్లో భాగంగా సతీష్ బాబు తీసుకుంటున్న కొన్ని నిర్ణయాలు వివాదాస్పదంగా మారాయి. జెమిని న్యూస్ లో తన వర్గానికి ఉపాధి కల్పించేందుకు ఆయన ప్రయత్నిస్తున్నారని తెలుస్తోంది. ఇందులో భాగంగా యాజులును తప్పించి రామకృష్ణ అనే తన పాత కాపును తెచ్చి డెస్క్ ఇంఛార్జ్ గా నియమించారు. ఆయన వింత చేష్టలు డెస్క్ సిబ్బందికి ఇబ్బందికరంగా మారాయట. అలాగే సబ్జెక్ట్ లేకుండానే అపర మేధావిగా చెలామణి అవుతున్న గమిడి శ్రీనివాస్ ను కో ఆర్డినేటర్ గా నియమించారు.
' బ్లాగులున్నాయి జాగ్రత్త.. '
సతీష్ బాబు ఛీఫ్ ఎడిటర్ గా చేరగానే జెమిని న్యూస్ సిబ్బందితో సమావేషమై ' మనం చర్చించుకునే విషయాలు బయటకు చెప్పకండి. బ్లాగుల్లో పెడతారు ' అని హెచ్చరించారట. తాను జెమిని ఎడిటర్ గా వస్తున్న విషయం బ్లాగ్ల ద్వారా ముందుగానే ప్రచారం కావటం పై ఆయన ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ' ఎబౌట్ తెలుగు మీడియా ' అకారణంగా ఎవరిపైనా బురద చల్లదని, సతీష్ బాబుపై అపార గౌరవం ఉందని.. ఆయన చేస్తున్న మంచి పనులకు తోడ్పాటు అందిస్తుందని సవినయంగా మనవి చేసుకుంటున్నాం.

Friday, November 23, 2007

ఈనాడూ.. ఇదేం ధోరణి?

ఇటీవలే 'ఎబౌట్ తెలుగు మీడియా' వార్తా పత్రికలు యాడ్స్ విషయంలో అవలంభిస్తున్న అతి ధోరణులను సమీక్షించటం గమనించే ఉంటారు. ఒక్క ' వార్త ' దిన పత్రికే కాదు అన్ని పత్రికలు ఇదే విధంగా తయారయ్యాయని ఒక కామెంటర్ స్పందించాడు. నిజమే.. చివరకు ' ఈనాడు ' దిన పత్రిక సైతం కట్టుబాట్లను గాలికి వదిలింది అనే సత్యాన్ని 23-11-2007 నాటి సంచిక తొలి పేజీ చూసిన తర్వాత నిర్ధారించుకున్నాం. ఇటీవల వరికి మద్దతు ధర విషయంలో అసెంబ్లీలోనే రాత్రి నిద్ర చేసి వినూత్న నిరసన తెలిపిన ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు మరునాటి ఈనాడు దిన పత్రిక చూసి నివ్వెర పోయాడట. ఈనాడు మొదటి పేజీలో రావల్సిన తన వార్త స్థానంలో ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి చిరునవ్వులు చిందిస్తున్న పొడువాటి ప్రకటన మనస్థాపం కలిగించిందట.

ఆర్తి విషయంలో మీడియా అతి

'శుభం పలకరా చిన్నోడా అంటే పెళ్ళి కూతురు.. అన్నాడట' అనే సామెత మన మీడియాకు చక్కగా అతుకుతుంది. ప్రముఖ హీరోయిన్ ఆర్తీ అగర్వాల్ వివాహ విషయంలో మీడియా ప్రతినిధులు చాలా అసహ్యంగా ప్రవర్తించారు. ఒక సెలబ్రిటీ వివాహ వార్తను కవర్ చేయడాన్ని ఎవరికి వారు తమదైన ధోరణిలో సమర్ధించుకోవచ్చుగాక. అయితే ఈ స్వేచ్చ అనేది (పత్రికా స్వేచ్చ అందమా) మన ముక్కు చివర అవతలి వారి ముక్కును తగలనంత వరకే అని గమనించాలి. 'సెలబ్రిటీ' పేరిట అర్తీ అగర్వాల్ వివాహ వరతను కవర్చేయటానికి వెళ్ళిన విలేఖరులు తమ ఫ్లాష్ లు, స్క్రోలింగులతో జనాలను సంఘటనా స్థలానికి రప్పించటమే గాక క్రమశిక్షణ తప్పి తోపులాట సృష్టించారు. అగ్రహించిన ఆర్తి అగర్వాల్ సోదరుడు అందరిపైనా చేయి చేసుకోగా ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధికి కూడా గాయమైంది. ఇందుకు ఆగ్రహించిన మీడియా సోదరులంతా పెళ్ళి చేసుకొని వెళ్ళుతున్న అర్తి కారుకు అడ్డు పడగా వారు క్షమాపణ చెప్పుకోక తప్పలేదు. ఈ విషయాని మీడియా మిత్రులు ఇంతటితో వదిలేయకుండా పోలీస్ కంప్లైంట్ ఇచ్చి అర్తి అగర్వల్ సోదరున్ని, సోదరిని, తండ్రిని అరెస్ట్ చేయించి పైశాచిక ఆనందాన్ని పొందారు. చివరకు వివాదం సద్గుమనిగిందనుకోండి. ఇంట్లో శుభకార్యం జరిగిన రోజునే పోలీస్ స్టేషన్ గడప తొక్కించిన కీర్తిని మన మీడియా సోదరులు మూట కట్టుకున్నారు. పైగా కొన్ని ఛానెళ్ళ వారు ఆర్తి గత ప్రేమ వ్యవహారం, ఆత్మహత్య ప్రయత్న తాలూకు వార్తల్ని పెళ్ళి భోజనంలా ప్రేక్షకుల కోసం వండి వార్చారు. ప్రియమైన మీడియా ప్రతినిధులారా.. ఆర్తీ అగర్వాల్ లాంటి సెలబ్రిటీల స్థానంలో మీరు లేదా మీ కుటుంబ సభ్యులు ఉంటే ఎలా ఉండేది ఒక్కసారి ఆలోచించుకోండి. .

Friday, November 16, 2007

' సత్య ' వస్తుందా? రాదా?

' సత్య ' ఛానెల్ అసలు వస్తుందా? అనే టాక్ హైదరాబాద్ మీడియా వర్గాల్లో వినిపిస్తోంది. గత ఐదేళ్ళుగా బహుషా 2004 ఎన్నికలకన్నా ముందు నుండే సత్య ఛానెల్ 'అదిగో.. ఇదిగో.. అప్పుడు వస్తుంది.. ఇప్పుడు వస్తుంది..' అని ప్రచారమైతే జరుగుతోంది. కానీ ఎందుకో జాప్యం జరుగుతోంది. ఛానెల్ కు అనుమతి రావాలని కొన్ని రోజులు, శాటిలైట్ దొరకలేదని కొన్ని రోజులు చెప్పుకొచ్చారు. క్యాలెండర్లో తేదీలు, నెలలు, సంవత్సరాలే దొర్లుతున్నాయి తప్ప ' సత్య ' వస్తున్న జాడ కనిపించటంలేదు. ఫీల్డ్ లో తిరిగే సత్య రిపొర్టర్లు, కెమెరామెన్లను మీచనెల్ ఎప్పుడొస్తుందబ్బా? అని అడిగితే పాపం తెగ ఇబ్బంది పడిపోతున్నారు. అసలు ' సత్య ' ప్రమోటర్ కాసానికి అసలు ఛానెల్ తెచ్చే ఉద్దేశ్యమే లేదని వినిపిస్తోంది. తన రాజకీయ, వ్యాపార ప్రయోజనాలను కాపాడుకోవడానికే కాసాని తరచూ ఛానెల్ తెస్తున్నానని చెప్పుకుంటున్నారని భావించవచ్చు. ఛానెల్ తెచ్చే పనిమీదే ఉన్నట్లు కొందరు జర్నలిస్టులనైతే నియమించుకున్నారు. ఛానెల్ తెచ్చే ఉద్దేశ్యమే ఉంటే నియామకాలు ఎప్పుడో ప్రారంభమయ్యేవి. ' సత్య ' న్యూస్ హెడ్ గా ఈనాడు-ఈ టీవీ ఫేం 'గడ్డం నరసిం హా రావు 'ను నియమించి దాదాపు సంవత్సరన్నర అవుతుందేమో. అయ్యా.. నరసిం హా రావు గారు.. ఎందుకు మీ కెరీర్ ను పణంగా పెట్టి సమయం వృధా చేసుకుంటారు? అసలు వసుందో,రాదో తెలియని ఛానెల్ కోసం ఎంత కాలం పని చేస్తారు? మీకోసం బయట ఎన్నో అవకాశాలు ఎదురు చూస్తున్నాయి ప్రయత్నిస్తే తప్పేమీ లేదు కదా?..

'వార్త 'లా? ప్రకటనలా?

దినపత్రికను నడపడం కత్తి మీద సాము లాంటిదే. ఆర్థికంగా ఎన్నో వనరులు ఉంటే తప్ప దిన పత్రికను నడపలేం. ముఖ్యంగా ఇందుకోసం ప్రకటనలపై ఆధార పదక తప్పదు. ప్రకటన ఇచ్చేవాడు పత్రిక సర్క్యులేషన్ కూడా పరిగనణలోకి తీసుకుంటాడనుకోండి. ఇటీవల కొన్ని పత్రికలను గమనిస్తే ప్రకటనలకోసమే నడుపుతున్నట్లు కనిపిస్తోంది. మనం ఇక్కడ ప్రధానంగా చెప్పుకుంటోంది 'వార్త ' దిన పత్రిక గురించి ఈ పత్రిక మొదటి పేజీలో పరిమితికి మించిన ప్రకటనలు పాఠకులకు విసుగు తెప్పిస్తున్నాయి. అసలు ఇది వార్తా పత్రికా? ప్రకటనల పత్రికా? అర్థం కావడం లేదు. ఉదాహరణకు దీపావళి నాటి వార్త దిన పత్రికను (09-11-2007) గమనించండి. మొదటి పేజీలో ఇయర్ పానెల్స్ మినహాయిస్తే మొత్తం 322 సెం.మీ.ల స్థలంలో 222 సెం.మీ.లు ప్రకటనల కేటాయిస్తే వార్తలు కేవలం 100 సెం.మీలకే పరిమితం అయ్యాయి. వార్త దిన పత్రికలోని వార్తలు ప్రకటనల మద్య ద్వీపంలా కనిపిస్తుంటాయి. పత్రికలకు ప్రకటనలు ఆక్సిజన్ లాంటి కాదనలేం.. కానీ ఆక్సిజన్ను పంపుసెట్ తో ఎక్కిస్తే ఎలా ఉంటుంది ఆలోచించండి. కొద్ది సంవత్సరాల క్రితం దిన పత్రికలు ప్రకటలు స్వీకరించటంలో హద్దులు నిర్ణయించుకునేవి. ఇప్పుడు 'ఈనాడు 'తో సహా అన్ని పరికలు హద్దులు సడలించుకున్నుట్టున్నాయి. గతంలో మొదటి పేజీలో బ్యానర్ వార్త ఇచ్చే స్థలంలో ప్రకటనలు ఇచ్చే సాంప్రదాయం ఉండేది కాదు. కానీ ఇప్పుడు దాదాపు అన్ని దిన పత్రికల్లోనూ బ్యానర్ యాడ్స్ సర్వ సాధారణం అయిపోయింది. కొన్ని సందర్భాల్లో మొదటి పేజీ మొత్తం ప్రకటనతోనే వచ్చిన ఉదంతాలూ ఉన్నాయి. మన దేశంలో బహుషా ఈ సాంప్రదాయానికి 'టైంస్ ఆఫ్ ఇండియా' శ్రీకారం చుట్టిందేమో?

Tuesday, November 13, 2007

జర్నలిస్టుల అనైఖ్యత బట్టబయలు

జర్నలిస్టుల మధ్య ఐఖ్యత అనేది కప్పల తక్కెడ అంటే ఎవరూ కోపగించుకోవాల్సిన అవసరం లేదు. చీలికలు పేలికలుగా ఉన్న జర్నలిస్టు సంఘాల్లో ఒకరు ఎడ్డం అంటే మరొకరు తెడ్డం అంటారు. ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టుల్లో ఇటీవల ఐకమత్యం కనిపించినా, ప్రింట్ మిత్రులు ఎవరికి వారే వేరు దుఖానాలు తెరుచుకున్నారు. ఇళ్ళ స్థలాలు, జర్నలిస్టులపై దాడులు, మరేదైనా సమస్య వచ్చినప్పుడు కలిసికట్టుగా కాకుండా ఎవరికి వారే పోరాడుతున్నారు. ఫలితంగా జర్నలిస్టులు ప్రభుత్వం వద్ద ముఖ్యమంత్రి ఎదుట చులకన అవుతున్నారు. కర్నూలు జిల్లా జర్నలిస్టులు శ్రీరాములు, ఉరుకుందప్పలపై కేసులు, అరెస్టుల విషయంలో ఈ అంశం మరింత స్పష్టమైంది. ఇద్దరు జర్నలిస్టులను అన్యాయంగా అరెస్టు చేసి జైలుకు పంపిన సంఘటనపై జరుగుతున్న ఉద్యమానికి మెజారిటీ జర్నలిస్టులు ఎందుకు దూరం ఉన్నట్లు. ముఖ్యంగా సీయం-కాంగ్రెస్ బీట్ చూసే రిపోర్టర్లలో కొందరు ఇది తమ సమస్య కాదు అన్నట్లు వ్యవహరించటం సప్ష్టంగా కనిపించింది. అలాగే జర్నలిస్టు సంఘాలకు నేతలుగా చెలామని అవుతున్న వారు ప్రభుత్వంపై గట్టిగా వత్తిడి తేలేక పోవటం కూడా అనుమానాలకు తావిస్తోంది. బాధిత విలేఖరులకు సంబందించిన పత్రికలు తప్ప ఇతర దిన పత్రికలు పెద్దగా జర్నలిస్టుల ఉద్యమ వార్తలకు ప్రాధాన్యత ఇవ్వటం లేదు. రేపు తమ దిన పత్రిక జర్నలిస్టుకు కూడా ఇలాంటి కష్టం వస్తే అవతలి పత్రిక ఎలాంటి సహకారం అందిస్తుందనే స్పృహ కూడా వారికి లేదేమో. సోమవారం నాడు అసెంబ్లీ చరిత్రలోనే తొలిసారిగా 'ఎపి ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్ట్ అసోసియేషన్ ' కర్నూలు రిపోర్టర్ల అరెస్ట్ అంశంపై ముఖ్యమంత్రి ఛాంబర్ సమీపంలో ధర్నా జరిపి సంచలనం సృష్టించింది. అయితే జర్నలిస్టు సంఘాలకు హోల్ అండ్ సోల్ నేతలుగా చెలామని అయ్యే 'ప్రింట్' నాయకులు ఈ ధర్నాపై సన్నాయి నొక్కులు నొక్కారు. టి.ఆర్.ఎస్., సి.పి.ఎం., సి.పి.ఐ., బి.జె.పి. శాసన సభ పక్షాలు మద్దతు పలికిన ఈ మెరుపు ధర్నాకు హోం మంత్రి, సమాచార శాఖ మంత్రి దిగి వచ్చి ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ ఇప్పించినట్లు ప్రకటించారు. తీరా ఆ సాయంత్రం క్యాంప్ ఆఫీస్లో రాజశేఖర రెడ్డి అపాయింట్మెంట్ దక్కింది ఎలక్ట్రానిక్ మీడియా అసోసియేషన్ కు కాదు సోకాల్డ్ 'ప్రింట్' నేతాశ్రీలకు. అసెంబ్లీలో ధర్నా చేపట్టి అపాయింట్మెంట్ హామీ పొందిన 'ఎపి ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్ట్స్ అసోసియేషన్ ' మిత్రులు సీఎం ను కలవకుండానే అవమానభారంతో తిరిగి వచ్చారు.

Monday, November 5, 2007

అసెంబ్లీ నడవాలంటే ప్రత్యక్ష ప్రసారాలు రద్దు చేయాలి

ఆంధ్రప్రదేశ్ శాసనసభ సమావేశాలు చూసిన వారికి ఎంతో విచారం కలగక మానదు. అధికార, ప్రతిపక్షాలు తమ తమ ప్రతి రోజూ ప్రజా సమస్యలనే సాకు చూపి ఏదో ఒక గలాట సృష్టించడం.. వాయిదాలపై వాయిదాలు.. గంటల తరబడి సభ స్థంబించడం.. వ్యక్తిగత విమర్షలు.. ఎంతకీ తెగని పోటా పోటీ ప్రసంగాలు.. సరైన సమాధానాలు లేని చర్చలు.. వాకౌట్లు.. సస్పెన్షన్లు.. ఇవన్నీ చూస్తే వెగటు కలగుతోంది. టీవీ ఛానెళ్ళలో, పత్రికల్లో పతాక స్థానాన్ని ఎలా ఆక్రమించాలనే అంశం పైనే అన్ని పార్టీలు ప్రధాన దృష్టి పెట్టడం వల్ల అర్ధవంతమనైన చర్చ జరగటం లేదు. ఎదుటి పక్షాన్ని ఎలా దెబ్బ తీయాలన్నదే పార్టీల ఎత్తుగడ. అసెంబ్లీ కవరేజీ చూసే సీనియర్ జర్నలిస్టులు, చాలా కాలంగా కొనసాగుతున్న ఎమ్మెల్యేలు, పాత తరం నేతల్ని కదిలిస్తే చెప్పే సమాధానం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. 'ఈ అనర్ధానికి ప్రధాన కారణం టీవీ ఛానెళ్ళలో సమావేశాల ప్రత్యక్ష ప్రసారాలే..' జాగ్రత్తగా అలోచిస్తే ఇది నిజమే అనిపిస్తోంది. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా, యనమల రామకృష్ణుడు శాసన సభాపతిగా ఉన్న ఉన్న కాలంలో ఆరంభమైన ప్రత్యక్ష ప్రసారాలు కొత్త ఒరవడిని సృష్టించిన మాట వాస్తవం. అసెంబ్లీలో చర్చలు ఎలా జరుగుతాయి? తాము ఎన్నుకున్న ప్రతినిధులు ఎలా మెలుగుతున్నారు? తమ సమస్యల్ని సభలో ప్రస్థావిస్తున్నారా? ముఖ్యమైన ప్రజా సమస్యలకు ప్రభుత్వ పరిష్కారం ఎలా ఉండబోతుంది?.. అనే అంశాలు ప్రత్యక్ష ప్రసారాల ద్వారా ప్రజలు తెలుసుకునే అవకాశం కలిగింది.కాగా రానురాను ప్రత్యక్ష ప్రసారాల వల్ల అసలు సమస్యలు ఆరంభమైనాయి. ప్రజలు నేరుగా సమావేశాలను చూస్తుండటం వల్ల నేతాశ్రీలు సమస్యలకు పరిష్కారం చూపడం కన్నా తమలోని ఉపన్యాస కేసరులను బయట పెట్టు కోవడం ప్రారంభించారు. గంటల తరబడి, రోజుల తరబడి చర్చలు కొనసాగిస్తూ.. కొత్త కొత్త తిట్లతో పరస్పరం సత్కరించుకుంటూ.. ఆరోపనలు ప్రత్యారోపణలతో, ఎదురు దాడులతో విలువైన సమయాన్ని వృధా చేస్తూ ప్రజలకు వెగటు కలిగిస్తున్నారు. గతంలో అసెంబ్లీలో సభ్యులెవరైనా అన్-పార్లమెంటరీ పదాలు వాడితే స్పీకర్ రికార్డుల్లోంచి తొలగించే వారు. అంటే దాన్ని పత్రికల్లో కూడా ప్రచురించరాదని అర్ధం. కానీ ప్రత్యక్ష ప్రసారాల పుణ్యమా అని నేరుగా ప్రజల్లోకి ఆ పదాలు వెల్లిపోయి 'రికార్డుల్లొంచి తొలగించడం'కి అర్ధం లేకుండా పోయింది. ఒకప్పుడు అసెంబ్లీలో ఎలాంటి చర్చ అయినా కొద్ది నిమిషాల్లో, కొద్ది గంటల్లో ముగిసేది. ఇప్పుడు ప్రత్యక్ష ప్రసారాల పుణ్యమా అని ఉపన్యాస కేసరులు గంటలు, రోజుల తరబడి సాగదీస్తున్నారు. సభలో ఏ ప్రసంగమైనా సభాపతిని, తోటి సభ్యులను ఉద్దేషించి కాకుండా 'రాష్ట్ర ప్రజలను గమనిస్తున్నారు..' అంటూ సాగిస్తున్నారు. మరో ఆసక్తి కరమైన విషయం ఏమిటంటే, ఇటీవలే పునర్ ప్రారంభమైన రాష్ట్ర శాసన మండలిలో ఎలాఒటి చర్చలైనా నిమిషాల్లో ముగుస్తున్నాయి. కారణం వెరీ సింపుల్.. శాసన మండలిలో ప్రత్యక్ష ప్రసారాలు లేక పోవడమే.. 'రాష్ట్ర ప్రజల శ్రేయస్సు దృష్ట్యా' ఇప్పుడు చెప్పండి అసెంబ్లీ ప్రత్యక్ష ప్రసారాలు అవసరమా?..

Saturday, November 3, 2007

జెమిని న్యూస్ ఎడిటర్ గా సతీష్ బాబు..

కష్టాల కడలిలో కొట్టు మిట్టడుతున్న జెమిని న్యూస్ ఎడిటర్ గా సతీష్ బాబు నియమితులయ్యారు. ఇది ఆ సంస్థకు ఆరోగ్యకర పరిణామం, అక్కడి దుష్ట శక్తులకు శరాఘాతం. మా టీవీ న్యూస్ ఎడిటర్ గా, గతంలో జెమినిలోనే న్యూస్ బేస్డ్ ప్రోగ్రాం జర్నలిస్ట్ డైరీ నడిపిన సతీష్ బాబు కు మొచి పాపులారిటీ ఉంది. సతీష్ బాబు పడిపోయిన జెమిని న్యూస్ ఇమేజీని తిరిగి ప్రతిష్టించే ప్రయత్నం చేస్తారని చెప్పవచ్చు. ఎటొచ్చి ఆయన నోటి దురదే అక్కడి ఉద్యోగులకు ఆందోళన కలిగిస్తోంది. సతీష్ బాబు రాకతో జెమిని న్యూస్ ఎడిటర్ కార్య స్థానం చెన్నై నుండి హైదరాబాద్ కు మారుతోంది.
రఘు కుమార్ ఔట్..

అవినీతి పరునిగా అపఖ్యాతి పాలైన రఘు కుమార్ జెమిని న్యూస్ ఎడిటర్ పదవికి రాజీనామా చేశారు(?) తొలగింపబడ్డారని కూడా ప్రచారం జరుగుతోంది. ఒక న్యూస్ చానెల్ కు సహజంగా కార్యస్థానంలో ఎడిటర్ ఉండాలి. కాని రఘుకుమార్ హైదరాబాద్లో కాక చెన్నైలో ఉండి పనిచేసే వారు. నిజానికి హైదరాబాద్ నుండి ఎడిటై వచ్చే వార్తలను పెట్టుకోవడం తప్ప ఆయన చేసిన పనేంటో? రఘుకుమార్ జిల్లా రిపోర్టర్ పోస్టులను అమ్ముకున్నారని, ప్రతి నెలా జిల్లాల నుండి మామూళ్ళు దండుకునేవారని, ఇందుకోసం ఆయన ప్రత్యేకంగా మునిరాజు నాయకత్వంలో కొందరు రిపోర్టర్లతో కోటరీ ఏర్పాటు చెసుకున్నారనేది ప్రచారంలో ఉంది. రఘుకుమార్ వెళ్ళిపోతాడని ముందే తెలిసిన మునిరాజు మెల్లగా జెమిని నుండి జారుకున్నాడు. రఘుకుమార్ రాజీనామా తర్వాత ఈయన నియమించిన 'కరెప్ట్ నెట్ వర్క్' తమ భవిష్యత్తుపై ఆందోళనగా ఉంది.

వారానికి ఐదు రోజులే..

మంచి జీతం, పనికి గుర్తింపు, స్నేహ పూరిత - స్వేచ్చా వాతావరణం.. ఏ ఉద్యోగైనా ప్రధానంగా కోరుకునేవి ఇవే. ఇవన్నీ దాదాపుగా 'జీ తెలుగు ' ఛానెల్లో ఉన్నాయని చెబితే అతిశయోక్తి లేదు. అందుకే జీ తెలుగు జర్నలిస్టులు ఎలాంటి టెన్షన్ లేకుండా పని చేస్తారు. (ఈ ఛానెల్ కు అంతగా ప్రజాదరణ లేక పోవడం ఇక్కడ అప్రస్తుత అంశం అనుకోండి) ఇక నుంచి జీ తెలుగులో వారానికి ఐదు రోజుల పని విధానం అమలు చేస్తున్నారనేది తాజా వార్త. అంటే అక్కడి జర్నలిస్టులకు వారానికి రెండు సెలవు లభిస్తాయన్న మాట. వారాని ఒక్క వీక్లీ ఆఫ్ ఇవ్వడానికే తెగ ఇబ్బంది పడుతున్న ఛానెళ్ళలో పని చేసే జర్నలిస్టులకు ఒకింత ఈర్ష వస్తే తప్పు పట్ట లేం .. కొత్త న్యూస్ ఛానెళ్ళు 'ఎన్-టీవీ', 'టీవీ-ఐదు ' లలో ఇంకా వీక్లీ ఆఫ్ ఇవ్వడం లేదని అక్కడి జర్నలిస్టులు గగ్గోలు పెడుతున్నారు. జర్నలిస్టుకు తగిన విరామం ఇస్తేనే టెన్షన్ లేకుండా, ఉత్సాహంగా పనిచేస్తాడు.

Wednesday, October 24, 2007

జెమిని నుండి ఎన్-టీవీలో చేరిన ' హింసించే బూతురాజు '

'జెమిని న్యూస్ ' కో-ఆర్డినేటర్ గా పని చేస్తున్న మునిరాజు ఈరోజు ఉదయమే ఎన్-టీవీలో చేరిపోయి అందరినీ ఆశ్చర్యపరిచాడు. చెన్నై రఘుకుమార్ ప్రియ శిష్యుడైన మునిరాజు కొద్ది రోజులుగా అభద్రతాభావంతో జెమినిలో కొనసాగాడని అక్కడి వారు చెబుతున్నారు. అంతకు ముందు కో-ఆర్డినేటర్ గా ఉన్న మాధవ్ ని సాగనంపి మునిరాజ్ ను నియమించున్న జెమిని చెన్నై-హైదరాబాద్ యాజమాన్యాలు తాజా పరిణామానికి బిత్తరబోయాయి. రఘుకుమార్ ఏజంట్ గా హైదరాబాద్ కో-ఆర్డినేటర్ గా వచ్చిన మునిరాజు వచ్చిన రోజు నుండి తనకు గిట్టని వారిని వేదించటమే పనిగా పెట్టుకున్నాడు. తనకు పడని జిల్లా రిపోర్టర్ల వార్తల్ని తొక్కిపెట్టే వాడని ఆరోపణలు ఉన్నాయి. మునిరాజు ప్రవర్తనకు విసిపోయిన పలువురు జిల్లా, హైదరాబాద్ బ్యూరో రిపోర్టర్లు జెమినికి గుడ్ బై చెప్పేశారు. మునిరాజు గయ్యాలితనానికి ఎందరో రిపోర్టర్లు, డెస్క్ సిబ్బంది హడలిపోయేవారు . (ఎంతైనా రఘుకుమార్ మనిషి కదా) నోరు తెరిస్తే అలవోకగా బూతులు మాట్లాడే మునిరాజుకు 'పులకేశి ', 'హింసించే బూతురాజు ' అనే ముద్దు పేర్లు ప్రచారంలో ఉన్నాయి. జిల్లా రిపోర్టర్, స్ట్రింగర్ పోస్టులను అమ్ముకునే వాడనేది బహిరంగ రహస్యం. రంగారెడ్డి జిల్లా కీసర స్ట్రింగర్ పైన ఎన్నో అవినీతి ఆరోపణలు ఉన్నా మునిరాజు నిర్లజ్జాగా డబ్బు తీసుకొని కొనసాగించాడని అంటారు. హైదరాబాద్ ఎల్లలైనా తెలియని మునిరాజును చెన్నై రఘుకుమార్ కో-ఆర్డినేటర్ గా పంపడమే ఒక వింత. మియాపూర్-బాలాపూర్ పక్కపక్కనే ఉంటాయనే అమాయకత్వంతో ఈ రెండు చోట్ల ఒకే రిపోర్టర్ని స్వల్ప వ్యవధితొ అసైన్మెంట్లు ఇచ్చి పంపే ఘనత ఆయనది. తన లీలలు బయటపడుతున్న కొద్దీ ఆందోళన పడ్డ మునిరాజు, కొద్ది రోజులుగా చెన్నై-హైదరాబాద్ మేనేజిమెంట్ల మద్య పోక చెక్కగా నలిగిపోయాడట. (మునిరాజు పై చాలా రోజులుగా 'ఎబౌట్ తెలుగు మీడియా'కు పిర్యాదులు వచ్చినా నిర్ధా రించుకోవడానికే ప్రచురించ లేకపోయాము. ఈ విషయంలో కొందరు మమ్మల్ని అపార్ధం చేసుకున్నారు, మేము ఎవరికి లొంగమని మరొకసారి వారికి తెలియజేస్తున్నాం)

నిరాశ పరచిన ' సూర్య '

తెలుగులో ఇప్పటికే ఉన్న దిన పత్రికలకు గట్టి పోటీ ఇస్తునందనుకున్నవారికి 'సూర్య ' నిరాశను మిగిల్చింది. సూర్య పత్రిక తొలి మూడు సంచికలు చూసిన వారు ఈ పత్రిక 'ఈనాడు 'కు కాదు కదా ఆంధ్రజ్యోతి, వార్త దిన పత్రికలకు కూడా పోటీ ఇవ్వలేదు అని అంటున్నారు. 'సూర్య ' మాస్ట్ హెడ్ మూసేసి చూస్తే అచ్చం 'ఆంధ్రజ్యోతి ' లానే కనిపిస్తుంది అని మరి కొందరంటున్నారు. సూర్య పేజీలన్నీ జ్యోతిలాగే కనిస్తున్నయి. నిజానికి ముద్రణలో జ్యోతే అందంగా కనిపిస్తోంది. తనదైన పాంట్స్ రూపొందించుకోవటంలో 'సూర్య ' విఫలమైందనే చెప్పవచ్చు. విజయదశమి తర్వాతి రోజున మార్కెట్ లోకి వచ్చిన 'సూర్య ' పట్ల ఏజంట్లు, హాకర్లు కూడా ఆగ్రహంగా ఉన్నారు. పత్రికను ఆలస్యంగా ఇచ్చారని కొందరు, అడిగినన్ని కాపీలు ఇవ్వలేదని మరి కొందరు ఆరోపిస్తున్నారు. తొలి రోజున తమకు గిప్ట్స్ ఇస్తామని చెప్పిన సూర్య మార్కెటింగ్ సిబ్బంది పత్తా లేకుండా పోయారని వారు విమర్శిస్తున్నారు. అన్నింటికన్నా పెద్ద జోక్ ఏమిటంటే 'సూర్య ' వెబ్ సైట్ అడ్రస్ పని చేయక పోవడం. http://www.suryatelugudaily.com/ లాగిన్ అయి చూస్తే ASTER WE INTEGRATED COMMUNICATIONS అనే సైట్ కనెక్ట్ అవుతోంది.

Saturday, October 20, 2007

జర్నలిస్టు మిత్రులకు, శ్రేయోభిలాషులకు
విజయదశమి శుభాకాంక్షలు
-ఎబౌట్ తెలుగు మీడియా

ఆంధ్రభూమి దినపత్రిక, 20-10-2007న ప్రచురితం


Thursday, October 18, 2007

మూడు ఛానెళ్ళ పెళ్ళి

మెగాస్టార్ చిరంజీవి రెండో కూతురు ప్రేమ వివాహం అభిమానుల్లో, రాష్ట్ర ప్రజల్లో ఉత్కంఠను, సంచలనాన్ని సృష్టంచింది. అయితే ఈ వివాహ దృశ్యాలు టీవీ-9, ఈటీవీ, ఎన్-టీవీలకే పరిమితం ఎందుకయ్యాయి? దీని వెనుక ఆసక్తికరమైన కథనం ఉంది. బోయిన్ పల్లి ఆర్యసమాజ్ లో రహస్యంగా పెళ్ళి చేసుకున్న శ్రీజ, శిరిష్ భరద్వాజ్ తమని తాము కాపాడు కోవడం కోసం ఒక పథకం ప్రకారం వ్యవహరించారు. సాంప్రదాయబద్దంగా తాము వివాహం చేసుకున్న వార్తను టీవీ ఛానెల్ ద్వారా వెల్లడిస్తే తమకు ఎలాంటి ముప్పు ఉండదని కొత్త దంపతులు భావించారు. ఇందుకోసం వారు ముందుగా ఈటీవీని ఎంచుకున్నారు. అయితే వివాహ దృశ్యాలను తీసుకున్న ఈటీవీ సిబ్బంది రామోజీ రావు అనుమతి కోసం నిరీక్షిస్తూ ప్రసారం చేయకుండా ఆలస్యం చేయటంతో శ్రీజ, భరద్వాజ్ల స్నేహితులు వెంటనే టీవీ-9కు కబురందించారట. టీవీ-9 ఈ వార్తను పదే పదే ప్రసారం చేయటంతో ప్రేక్షకులు క్రికెట్ మ్యాచి సైతం మరచి పోయి ఆ ఛానెల్ కు అతుక్కు పోయారు . పొరపాటును గ్రహించిన ఈటీవీ కూడా ఈ వార్తను ప్రసారం చేయక తప్పలేదు. అయితే శ్రీజ, భరద్వాజ్ లు జెమిని, టీవీ-ఐదు, జీ తెలుగు ఛానెళ్ళకు అందకుండా చాలా జాగ్రత్త పడ్డారు. ఈ ఛానెళ్ళ హెడ్లు చిరంజీవికి సన్నిహితులు కావడమే ఇందుకు కారణమని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.
కొసమెరుపు: శ్రీజ ఎంతో ఇష్టపడి తండ్రికి చిక్కకుండా పెళ్ళి చేసుకున్న శిరిష్ భరద్వాజ్ పై సంజీవరెడ్డి నగర్ పోలీస్ స్టేషన్లో కిడ్నాప్ కేసు వెలుగు చూడటం దురదృష్టకరం. 2002లో భరద్వాజ్ ఒక అమ్మాయిని కిడ్నాప్ చేసినట్లు కేసు నమోదైంది.

మాటీవీ న్యూస్ ఎడిటర్ గా హరిప్రసాద్

మాటీవీ న్యూస్ ఎడిటర్ గా హరిప్రసాద్ బుధవారం నాడు బాధ్యతలు స్వీకరించారు. భావనారాయణ రాజీనామా తర్వాత చాలా కాలం మాటీవీ న్యూస్ ఎడిటర్ పోస్ట్ ఖాళీగా ఉంది. కొత్తగా ఎడిటర్ గా వచ్చిన హరిప్రసాద్ గతంలో ఈనాడు, ఈటీవీ, మన తెలుగు టీవీల్లో పని చేశారు. ప్రింట్ - ఎలక్ట్రానిక్ మీడియాల్లో హరిప్రసాద్ కు అపార అనుభవం ఉంది.

'సత్య 'లో కరీం

టీవీ-9 ఫేం రిపొర్టర్ కం యాంకర్ కరీం 'టీవీ-ఐదూకు గుడ్ బై చెప్పి 'సత్య ' టీవీలో చేరినట్లు సమాచారం. టీవీ-ఐదులో తనకు నిర్దుష్టంగా ఎలాంటి బాధ్యత అప్పగొచకపోవటంపై కరీం అసంత్రుప్తితో ఉన్నట్లు చెబుకుంటున్నారు. ఓవరాక్షంకు మారుపేరైన కరీంపై ఇప్పటికే టీవీ-ఐదు సీనియర్లు గుర్రుగా ఉన్నారు. ఎన్నో అవినీతి ఆరోపణలు, పోలీస్ కేసులు ఎదుర్కొంటున్న కరీంకు చంద్రబాబు నాయుడు ఆశీస్సుల కారణంగానే టీవీ-ఐదులో ఉద్యోగం వచ్చిందంటారు. అసలు ఆరంభం అవుతుందో లేదో తెలియని 'సత్య 'కు కరీం ఎలా ఉపయోగపడతాడో చూడాలి.
కేబుల్ ఇండస్ట్రీకి 'డిటిహెచ్ ' నుండి ఎదురు కానున్న ముప్పుపై కొద్దిరోజుల క్రితం మేము 'కేబుల్ 'తో సన్ 'డిష్ 'యూం.. అనే వార్తను అందించడం తెలిసిందే. ఆంధ్రజ్యోతి ఆదివారం అనుబంధం (14-10-2007)లో 'కేబుల్ తో డిష్షుం.. డిష్షుం!' పేరిట ఇదే అంశంపై సీనియర్ పాత్రికేయులు తోట భావనారాయణ కవర్ స్టోరీ ఇచ్చారు. డిటిహెచ్ గురించి సమగ్రంగా తెలుసుకునేందుకు ఈ కథనం ఉపయోగపడుతుంది.

Thursday, October 11, 2007

మళ్ళీ మీడియా వ్యాపారంలోకి దాసరి

శతాధిక చిత్ర దర్శకుడు, విలక్షణ నటుడిగా తెలుగు ప్రజలకు సుపరిచితుడైన కేంద్ర మంత్రి దాసరి నారాయణ రావు ముచ్చటగా మూడోసారి మీడియా వ్యాపారంలోకి వస్తున్నట్లు వినికిడి. 'ఉదయం' దినపత్రికను తిరిగి అరంభించటంతో పాటు 'డి ' పేరిట టీవీ ఛానెల్ తేవడానికి దాసరి సన్నాహాలు చేస్తున్నారు. విజయదశమి నుండి పనులు ఆరంభమవుతున్నాయి. పలువురు సీనియర్ జర్నలిస్టులు, ప్రొడ్యూసర్లతో దాసరి నారాయణ రావు చర్చలు జరుపుతున్నారని తెలుస్తోంది. దాసరి వద్ద ఇప్పటికే 150 చిత్రాల రైట్స్ వున్నాయని వినికిడి. గతంలో ఈనాడుకి ధీటుగా ఉదయం దినపత్రికను తెచ్చి తెలుగు జర్నలిజంలో నూతన వరవడులకు శ్రీకారం చుట్టిన దాసరి పలు కారణాల వల్ల తన పత్రికను మాగుంట సుబ్బరామిరెడ్డికి అప్పగించాల్సి వచ్చింది. అయితే మాగుంట కుటుంబం 'ఉదయం 'ను సక్రమంగా నడపలేక పోవటంతో లాకౌట్ కు గురైంది. దాసరి ప్రారంభించిన 'శివరంజని 'సినీ పత్రిక అత్యధిక సర్క్యులేషన్ సాధించినా అది కూడా మూత పడింది. ఆ తర్వాత దాసరి 'బొబ్బిలిపులి ' పేరిట రాజకీయ వార పత్రికను, 'మేఘసందేశం' సినీ పత్రికను తెచ్చినా అవీ సరిగ్గా నడవక మూత పడ్డాయి. ఈ పత్రిక స్థాపన తరువాత సొంతంగా రాజకీయ పార్టీ పెట్టాలనుకున్నా దాసరి నారాయణ రావు ఎందుకో తన ప్రయత్నాలను విరమించుకొని కాంగ్రెస్లో చేరారు. రాజ్యసభ సభ్యుడిగా, ఆ తర్వాత కేంద్ర మంత్రిగా రాజకీయాల్లో బిజీ అయిన దాసరి మీడియా వ్యాపారంలోకి తిరిగి రావడం శుభ పరిణామమే. గతంలో జరిగిన పొరపాట్లు పునరావృత్తం కాకుండా జాగ్రత్త పడుతున్న దాసరి తన పత్రిక, ఛానెల్ కోసం పలువురు పారిశ్రామికవేత్తల సహకారం తీసుకుంటున్నట్లు వినికిడి.

ఎవరిని ఎవరు ఎందుకు అనుకరిస్తున్నారు?

ఎన్నికలు ముంచుకొస్తున్నాయనే తొందరలో ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి తెలుగుదేశం ప్రభుత్వ పథకంగా పాపులరైన రెండు రూపాయలకు కిలో బియ్యం పథకాన్ని పునరుద్దరిస్తామని ప్రకటిస్తే, చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్లుగా తామూ తొమ్మిది గంటల ఉచిత విద్యుత్తు ఇస్తామని ప్రకటించటం గమనించాం. ఆ తర్వాత టీడీపీ, కాంగ్రెస్ పార్టీలు పోటా పోటీగా ఒకరి పథకాలను మరొకరు కాపీ కొడుతూ వాగ్దానాలు చేస్తున్నాయి. ఇంచుమించు ఇదే పరిస్థితి మన తెలుగు టీవీ ఛానెళ్ళలో ఇదే తరహా అనుకరణ కనిపిస్తోంది. ఇటీవలే ఆరంభమైన 'టీవీ-ఐదు ','ఎన్-టీవీ ' ఛానెళ్ళు 'టీవీ-9 'ను అనుకరిస్తున్నాయనేది సుస్పష్టం. లోగోలు లేకుండా చూస్తే టీవీ-ఐదు, ఎన్-టీవీ యాంకర్ల డ్రెస్, కట్టూ బొట్టు, గ్రాఫిక్స్, ప్రోమో, క్రొమోలను గమనిస్తే టీవీ-9కు ఈ ఛానెళ్ళకు పెద్దగా తేడా కనిపించదు. అయితే కొద్ది రోజులుగా విచిత్రంగా 'టీవీ-9' రివర్స్ గేర్లో 'టీవీ-ఐదు ','ఎన్-టీవీ'లకు చెక్ పెట్టేందుకా అన్నట్లు ఆ ఛానెళ్ళను అనుకరిస్తున్నట్లు కనిపిస్తోంది. మంచి ఎక్కడున్నా స్వీకరించడంలో తప్పు లేదు. అయితే అదే సమయంలో ప్రతి ఛానెల్ తన సొంత ముద్రను అర్పాటు చేసుకోవడం మంచిది. ప్రస్తుతం తెలుగు 24 గంటల ఛానెళ్ళలో 'ఈటీవీ-2', 'జెమిని న్యూస్ 'లు తప్పిస్తే 'టీవీ-9','టీవీ-ఐదు ','ఎన్-టీవీ'లను చూస్తే తెలుగుదనం మచ్చుకైనా కనిపించదు. ఎవరైనా కొత్తవారు సౌండ్ తగ్గించి చూస్తే ఏదో విదేశీ ఛానెళ్ళు చూస్తున్నట్లే ఉంటుంది తప్ప తెలుగు ఛానెళ్ళలా అనిపించవు.

Tuesday, October 9, 2007

'కల నెరవేరెనులే.. ఇంటి జాగా దొరుకునులే..'

ఇళ్ళ స్థలాలకు సంభందించి హైకోర్ట్ ఇచ్చిన తీర్పుపై ప్రింట్-ఎలక్ట్రానిక్ మీడియాల జర్నలిస్టులంతా హర్షం వ్యక్తం చేస్తున్నారు. సొసైటీల ద్వారా ఇళ్ళ స్థలాలు ఇవ్వాలని హైకోర్ట్ స్పష్టంగా ఆదేశించటంతో I&PR పాత్ర తగ్గి జర్నలిస్టు సంఘాల హవా నడిచే అవకాశం ఉంది. అయితే ఇళ్ళ స్థలాలు ఆశిస్తున్న వారిలో సహజంగా ఎలక్ట్రానిక్ కన్నా ప్రింట్ మీడియా జర్నలిస్టులే అధికంగా ఉన్నారు. ప్రభుత్వం గతంలో ప్రింట్ వారికి పలుమార్లు ఇళ్ళ స్థలాలు ఇచ్చినందున ఈసారి తమకు ప్రాధాన్యత ఇవ్వాలని ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులు ముఖ్యమంత్రిని కోరుతున్నట్లు సమాచారం. 'ప్రింట్ ' ఆధిపత్యం లోని జూబ్లీహిల్స్ జర్నలిస్ట్ హౌసింగ్ సొసైటీ గతంలో ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులకు సభ్యత్వం ఇవ్వక పోవటంతో వారు ప్రత్యేకంగా హౌసింగ్ సొసైటీ ఏర్పాటు చేసుకున్నారు. ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులంతా తమ వర్గ పోరాటాలను పక్కన పెట్టి ఇళ్ళ స్థలాల విషయంలో ఏకం కావటం శుభ పరిణామం. తాము కట్టుకోబోయే కలల సౌధాలని ఊహించుకుంటూ తన్మయత్మంలో మునిగి తేలుతున్న జర్నలిస్టు మిత్రులు ఔటర్ రింగ్ రోడ్డు లోపలే ఇళ్ళ స్థలాలు కావాలని కోరుకుంటున్నారు. చాలా సంవత్సరాల తర్వాత ప్రభుత్వం జర్నలిస్టులకు ఇళ్ళ స్థలాలు ఇస్తున్న నేపధ్యంలో ప్రింట్-ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులంతా తమ పట్టింపులను సడలించుకొని సామరస్యంగా వ్యవహరించాలని 'ఎబౌట్ తెలుగు మీడియా' కోరుకుంటోంది.

రామానుజం రాజీనామా.. ఎన్-టీవీలో మరో సంక్షోభం..

కొమ్మినేని రాజీనామాతో విలవిలలాడుతున్న ఎన్-టీవీకి మరో ఎదురు దెబ్బ తగిలింది. ఎన్-టీవీ న్యూస్ చీఫ్ ఎస్.రామానుజం రాజీనామా చేశారు. ఎన్నో ఆశలతో ప్రారంభించిన ఛానెల్ ఫ్లాప్ షోగా మిగలటంపై ఎంతో అసంతృప్తితో ఉన్న ఎన్-టీవీ యజమాని నరేంద్ర చౌదరి తన ఆగ్రహాన్ని నేరుగా తెలియజేయడాన్ని తట్టుకోలేక రామానుజం రాజీనామా ఇచ్చారని ఎన్-టీవీ వర్గాలు చెబుతున్నాయి. కేవలం లైవ్ లనే నమ్ముకొన్న ఎన్-టీవీ నాసిరకం కార్యక్రమాలతో ప్రేక్షకుల ఆధరణ పొందలేక పోతోంది. ఎన్-టీవీ కన్నా టీవీ-ఐదు చాలా బాగుందని మార్కెట్ నిపుణులు అంటున్నారు. ఎన్-టీవీ ప్రారంభం కాకముందు నుండే సీనియర్ల మధ్య ఆధిపత్య పోరు ఆరంభమైంది. ఛానెల్ వచ్చిన కొద్ది రోజులకే సహాయ నిరాకరణకు కినుక వహించిన కొమ్మినేని శ్రీనివాస రావు రాజీనామా చేసిన విషయం అందరికీ తెలుసు. రామానుజం రాజీనామాతో ఖాళీ అయిన సీఈవో పోస్ట్ కోసం పలువురు సీనియర్ జర్నలిస్టులు పోటీ పడుతున్నట్లు సమాచారం.

Saturday, October 6, 2007

'సూర్య ' ప్రకాశిస్తుందా?..

తెలుగులో మరో దిన పత్రికగా 'సూర్య ' రాబోతోంది. విజయదశమి పర్వదినాన సూర్య ప్ర్రారంభమౌతోంది. మొత్తం 16 ఎడిషన్లతో ప్రారంభమౌతున్న సూర్య సర్వత్రా చర్చనీయ అంశంగా మారింది. తెలుగులో తొలి మూడు స్థానాల్ని ఆక్రమించుకున్న ఈనాడు, ఆంధ్రజ్యోతి, వార్త దినపత్రికలకు సూర్య ఏ విధమైన పోటీ ఇవ్వనుందో చూడాలి. ఇప్పటికే ప్రచురితమౌతున్న సూర్య డమ్మీ కాపీని చూసిన వారు ప్రింట్ క్వాలిటీ చాలా ఉన్నత ప్రమాణాలతో (హిందు దినపత్రిక మాదిరి) ఉందంటున్నారు. ప్రముఖ రియల్ ఎస్టేట్ వ్యాపారి, కాంగ్రెస్ నేత నూకారపు సూర్యప్రకాశ్ రావు తెస్తున్న 'సూర్య ' దిన పత్రిక ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి కోరుకున్నట్లుగా 'ఆ' రెండు దినపత్రికలకు పోటీగా, కాంగ్రెస్ ప్రభుత్వ విధానాల్ని సమర్ధించే వాణిగా మారుతుందని భావిస్తున్నారు. నిజానికి సూర్య దినపత్రిక ఉగాది రోజునే ప్రారంభించాలని భావించారు. కానీ ఈలోగా నాదర్ గుల్ భూకుంభకోణం వెలుగు చూడటంతో సూర్య ప్రకాశ్ రావుకు ఆర్ధిక కష్టాలు మొదలై పత్రిక పనులు ఆలస్యం అయ్యాయి. ఈ మధ్య కాలంలోనే 'సూర్య ' ముఖ్యమంత్రి తనయుడు జగన్మోహన్ రెడ్డి తెస్తున్న 'సాక్షి 'లో విలీనం అవుతోందనే పుకార్లు వినిపించాయి. 'సూర్య ' దినపత్రికకు సత్యమూర్తి ఎడిటర్. ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ గా వై.ఎస్.ఆర్.శర్మ, న్యూస్ ఎడిటర్ గా రమణ, స్టేట్ నెట్ వర్క్ ఇంఛార్జిగా అంకం రవి పని చేస్తున్నారు.

Friday, October 5, 2007

టీవీ-5.. 'టీవీ-ఐదు ' గా ఎందుకు మారింది?..

అక్టోబర్ 2న ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి, ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు, ప్రముఖ నటుడు చిరంజీవిల సమక్షంలో అట్టహాసంగా ప్రారంభమైన టీవీ-5 ప్రసారాలు కొద్ది నిమిషాలకే ఆగిపోవటం మిస్టరీగా మారింది. శాటిలైట్ సంబందిత సాంకేతిక అంశాలను టీవీ-5 యాజమాన్యం, సిబ్బంది కారణాలుగా చెబుతున్నా వాస్తవాలు వేరుగా ఉన్నాయి. అసలు సమస్య 'టీవీ-5' పేరులోనే ఉందని తెలుస్తోంది. సమాజానికి అన్నం, బట్టలు, గృహవసతి, వైద్యం, విద్య సక్రమంగా అందించటమే తమ లక్ష్యంగా ప్రకటించుకుంటూ టీవీ-5 ఆరంభమైంది. అయితే టీవీ-5 పేరిట ఇతర దేశాల్లో (అమెరికా, ఫ్రాన్స్, కెనడా, మంగోలియా, కాంబోడియా, థాయిలాండ్, ఇరాన్, ఆస్ట్రేలియా) పలు ఛానెళ్ళు ఇప్పటికే నడుస్తున్నాయి. టీవీ-5గా ప్రఖ్యాతి పొందిన ఫ్రెంచ్ సంస్థ ఒకటి తెలుగులో స్నేహా బ్రాడ్ కాస్టింగ్ సంస్థ 'టీవీ-5' టైటిల్ తో ఛానెల్ ప్రారంభించటంపై అభ్యంతరం వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఫలితంగా ప్రారంభమైన కొద్ది నిమిషాలకే తెలుగు 'టీవీ-5' సిగ్నల్ స్థంబించిపోయింది. ఈ భాగోతం వెనుక ఇద్దరు తెలుగు టీవీ ఛానళ్ళ యజమానుల హస్తం కూడా ఉందని ఊహాగానాలు ఉన్నాయి. టీవీ-5 పేరిట ఇతర దేశాల్లో కూడా ఛానెళ్ళు ఉన్నాయనే విషయాన్ని 'ఎబౌట్ తెలుగు మీడియా' గతంలోనే ప్రస్థావించింది. 'తెలుగు టీవీ-5' ఇప్పుడు 'టీవీ-ఐదు ' గా పేరు మార్చుకుంది.. తెలుగు మీడియాలో ఇప్పటి వరకూ ఎవరి వద్దా లేనటువంటి అత్యాధునిక టెక్నాలజీతో టీవీ-5 వస్తోందని కొద్ది రోజుగా వస్తున్న టెస్ట్ సిగ్నల్ ప్రసారాలు చెప్పకనే చెప్పాయి. టీవీ-9, ఈటీవీ-2లకు 'టీవీ-ఐదు ' గట్టి పోటీ ఇవ్వగలదని ఆశిద్దాం... ఈ వార్తా కథనంలో ఉపయోగించిన చిత్రంలో ఇతర దేశాల టీవీ-5 లోగోలు (ఎడమ) తెలుగు టీవీ-5 (కుడి) చూడవచ్చు.

Wednesday, September 26, 2007

'కేబుల్' తో సన్ 'డిష్'యూం..

ఏకపక్ష నిర్ణయాలతో తరచూ కేబుల్ ఆపరేటర్లు, ఎం.ఎస్.ఓ.లతో గిల్లి కజ్జాలకు దిగే సన్ టీవీ నెట్ వర్క్ రాష్ట్రంలో మరో యుద్దానికి తెరలేపుతోంది. సన్ వారి ఈ తాజా ఎత్తుగడ కేబుల్ రంగాన్నే దెబ్బ తీయబోతోంది. సన్ డీటీహెచ్ వచ్చే నెలలో ప్రారంభం అవుతోంది. ఇప్పటికే ఈ రంగంలో ఉన్న టాటా స్కై, డిష్ టీవీ డిటిహెచ్లకన్నా తక్కువ ధరకే సన్ డిటిహెచ్ అందుబాటులోకి రానుంది. బహుషా కేవలం రు.75/-కే అన్ని తెలుగు ఛానెళ్ళు సన్ డీటీహెచ్ ప్యాకేజీలో అభిస్తున్నాయని వినికిడి. సన్ డిటిహెచ్ ఎత్తుగడ కేబుల్ రంగం పునాదులనే కదిలిస్తుందని భావిస్తున్నారు. గతంలో ఫే ఛానెళ్ళ విషయంలో సన్ నెట్ వర్క్ ఏక పక్ష నిర్ణయాల విషయంలో కేబుల్ ఆపరేటర్లు సమ్మెకు దిగిన సంగతి అందరికీ గుర్తుండే వుంటుంది. తాజా 'డీటిహెచ్ వార్ ' ఎక్కడికి దారి తీస్తుందో చూడాలి.

Thursday, September 20, 2007

అక్టోబర్ 2న 'టీవీ-5' ప్రారంభం

తెలుగులో మరో శాటిలైట్ ఛానెల్ 'టీవీ-5' అక్టోబర్ 2న ప్రారంభం అవుతోంది. ఇప్పటి వరకూ తెలుగులో ఏ ఛానెల్ దగ్గరా లేనంత ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని టీవీ-5 ఉపయోగించ బోతోందని సమాచారం. టెక్నాలజీ + మీడియా పేరిట హైదరాబాద్ లోని పలు కూడళ్ళలో టీవీ-5 ప్రచారం కూడా ప్రారంభమైంది. ఇప్పటికే టీవీ-5 టెస్ట్ సిగ్నల్ ఆరంభమైంది. ఫీల్డ్ పైన్ టీవీ-5 రిపోర్టర్లు గత 5-6 నెలలుగా ఉరుకులు పరుగులు తీస్తున్నారు. టీవీ-5లో ఎందరో హేమాహేమీ జర్నలిస్టులు కనిపిస్తున్నారు. బి.ఆర్. నాయుడు ఛైర్మన్ గా, శివరామ ప్రసాద్ ఎం.డి.గా ఇటీవలే అక్కడ చేరిన కొమ్మినేని శ్రీనివాస్ రావు, కరీం మొదలు బ్రహ్మానంద రెడ్డి, కందుల రమేష్, ఐ.సత్యనారాయణ, భాస్కర్, కన్నెగంటి.. టీవీ-5ను లీడ్ చేయబోతున్నారు. అయితే రిపోర్టర్లలో పేరున్న తలకాయలు అంతగా కనిపించడం లేదన్నది 100 శాతం సత్యం. అందరూ పల్లకి ఎక్కిన వాల్లే (బాస్) కనిపిస్తున్న టీవీ-5 తెలుగు ఎలక్ట్రానిక్ మీడియాలో ఎలాంటి అద్భుతాలు సృష్టిస్తుందో ప్రారంభమైతే కానీ తెలియదు. టీవీ-5 యాజమాన్యం ఇటీవలే చేరిన కరీం ఏదో చేస్తాడని గట్టిగా నమ్ముకుంటోందట. ఈ మాజీ రవిప్రకాశ్ శిష్యున్ని చంద్రబాబు నాయుడు టీవీ-5కు రికమండ్ చేశారని ప్రచారం జరుగుతోంది.. టీవీ-5 కూడా 'ఎన్-టీవీ'లా నిరుత్సాహ పరచదని ఆశిద్దాం.. Best of Luck TV5

Wednesday, September 19, 2007

'జీ తెలుగు 'లో మా 'కర్మ '.. 'రాజ్ 24'కి రమణ..

'జీ తెలుగు ' లో అనూహ్య మార్పులు చోటు చేసుకున్నాయి. 'మా టీవీ'కి రాజీనామా చేసిన రాజేశ్వర్ శర్మ 'జీ'లో చేరి పోయాడు. ఇంత కాలం జీ తెలుగులో కో ఆర్డినేటర్ గా పని చేస్తున్న ఎంవి రమణ 'త్వరలో రాబోతున్న 'రాజ్ 24' ఛానెల్ కి ఇన్ పుట్ ఎడిటర్ గా వెళ్ళి పోయాడు. సాలరీ ఏకంగా రూ.40 వేలని వినికిడి. ఇక జెమిని టీవీ క్రైం రిపోర్టర్ గౌసుద్దీన్ 'జీ'లో చేరి పోయాడు. 'జీ'లోనే సీనియర్ రిపోర్టర్ గా పని చేస్తున్న సతీశ్ కమాల్ ను డెస్క్ కు బదిలీ చేశారు. ఇదిలా ఉంచితే మాటీవీలో అందరితో గొడవ పెట్టుకొని వెలివేతకు గురై 'మా కర్మ ' గా పేరొందిన రాజేశ్వర్ శర్మకు 'జీ తెలుగు 'హెడ్ శైలేశ్ రెడ్డి ఎలా అవకాశం ఇచ్చారో? శర్మ అక్కడైనా బుద్దిగా పని చేస్తాడని ఆశిద్దాం...

'జెమిని ' లో రిపోర్టర్ల వలసలు ఆరంభం

ఇప్పటికే కెమరామెన్ల వలసలతో సతమతం అవుతున్న 'జెమిని న్యుస్ 'లో రిపోర్టర్ల రాజీనామాలు ఆరంభమయ్యాయి. సీనియర్ రిపోర్టర్ గౌసుద్దీన్ 'జీ తెలుగు 'లో చేరిపోయాడు. ఈయనను అకారణంగా డెస్క్ కు బదిలీ చేయడంతో ఈ నిర్ణయం తీసుకోక తప్పలేదు. జెమినిలో ఏకైక లేడీ రిపోర్టర్ అజిత కూడా 'టీవీ 5' చేరిపోయింది. మరో ముగ్గురు రిపోర్టర్లు కూడా ఇతర ఛానెళ్ళలో చేరటానికి అగ్రిమెంట్లు కుదిర్చుకున్నారని వినికిడి. అత్తెసరు జీతాలకు తోడు యాజమాన్య వేధింపులే ఈ రాజీనామాల పర్వానికి కారణమని చెబుతున్నారు. కొత్త ఛానెళ్ళలో మంచి జీతాలతో ఆఫర్లు వచ్చి పడుతుంటే ఇంకా ఫ్యూడల్ మెంటాలిటీ 'జెమిని 'లో పని చేయడం అర్ధం లేని పని అని రాజీనామా చేసిన ఒక రిపోర్టర్ అంటున్నారు. ఈ పరిస్థితికి కారకుడైన కో ఆర్డినేటర్ మునిరాజు సెలవుపై వెల్లిపోయాడు. ఆయనా కొత్త ఉద్యోగం వెతుక్కుంటున్నాడని వినికిడి. ఇంత జరుగుతున్నా సన్-జెమిని యాజమాన్యంలో చలనం లేదు. 'వెల్లే వారు వెల్లిపోనీ ఇంతకన్నా తక్కువ జీతాలకు పని చేయడానికి చాలా మంది వస్తారు ' అని యాజమాన్యం బాహాటంగా చెప్పుకుంటోందిట. 'వినాశ కాలే విపరీత బుద్ది ' అంటే ఇదేనేమో...

Thursday, September 13, 2007

ఎన్-టీవీకి కొమ్మినేని గుడ్ బై.. టీవీ-5లో చేరిక..

సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాస్ రావు (కె.ఎస్.ఆర్) బుడ్ బై చెప్పారు. నరేంద్ర చౌదరి, రామానుజంలతో సరిపడక ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. భారీ వ్యయంతో అట్టహాసంగా ప్రారంభమైన ఎన్-టీవీ ఆశించిన రీతిలో క్లిక్ కాకపోయేసరికి కొమ్మినేనిపై నరేంద్ర చౌదరి గుర్రుగా ఉన్నారని ఎన్-టీవీ వర్గాలు తెలిపాయి. ఇందుకు పూర్తిగా కొమ్మినేనినే బాధ్యున్ని చేయటంతో ఆయన మనస్థాపం చెందిని రాజీనామా చేశారని అంటున్నారు. మరో వాదన ప్రకారం కొమ్మినేని తెలుగుదేశం పక్షపాతి అయినందువల్లే కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉన్న ఎన్-టీవీ ఆయన్ని వదిలించుకుందని అంటున్నారు. ఎన్-టీవీలో మంత్రి షబ్బీర్ అలీ కూడా భాగస్వామి అని వస్తున్న వార్తలు ఈ వాదనకు బలం చేకూరుస్తున్నాయి. ఏది ఏమైనా కొమ్మినేని విషయంలో ఎన్-టీవీ యాజమాన్యం తొందర పడిందేమో? (లేక కొమ్మినేనే తొందర పడ్డారా?) 'న్యూస్ టైం' పత్రికను నడపడంలో విఫలమైన రామానుజం ఇక ఎన్-టీవీని ఎలా గట్టెక్కిస్తాడో చూడాలి. ఎన్-టీవీ నుండి బయటకు వచ్చిన కొమ్మినేని శ్రీనివాస రావు టీవీ-5లో చేరబోతున్నారు. ఎవరికి వారే బాసులుగా ఫీలయ్యే టీవీ-5లో కొమ్మినేని ఎలా నెట్టుకొస్తారో చూడాల్సిందే. అసలు ప్రింట్ మీడియాలో సుధీర్ఘ అనుభవం ఉన్న కొమ్మినేని ఎలక్ట్రానిక్ మీడియాలోకి వచ్చి తప్పు చేశారేమో?.. జర్నలిజంలో తలపండిన మేధవిగా, రాజకీయ విశ్లేషకునిగా పేరొందిన కొమ్మినేని శ్రీనివాస రావు టీవీ-9, జెమిని న్యూస్ చర్చా వేదికల్లో పాల్గొని తన వాదనలతో అందరినీ మెప్పించారు. ఈ అనుభవంతో ఆయన తొందరపడి ఎలక్ట్రానిక్ మీడియాలో సెకండ్ ఇన్నింగ్ ప్రారంభించాలని ఆశపడి ఉంటారు. కాని 'గ్లామర్ ' ప్రపంచం ఆయన్ని గుర్తిస్తే కదా?.. చూద్దాం కొమ్మినేని టీవీ-5లో ఏ అద్భుతాలు సృష్టిస్తారో..

Saturday, September 8, 2007

' స్టింగ్ ' పరేషాన్..

రేటింగ్లు పెంచుకోవడంలో భాగంగా కొన్ని ఛానెళ్ళు ఆడే డ్రామాలకు అమాయకులు బలవుతున్నారు. ఢిల్లీ లో 'లైవ్ ఇండియా' ఛానెల్ ఒక పాఠశాల ఉపాధ్యాయురాలు అమాయక యువతులను వ్యభిచార ఊబిలోకి దింపుతోదని ప్రసారం చేసిన వార్తకు ఎంత అల్లరి జరిగిందో అందరికీ తెలుసు. ఈ ఛానెల్ రిపోర్టర్ ప్రకాశ్ సింగ్ ఇందుకోసం నిర్వహించిన స్టింగ్ ఆపరేషన్ కు కిరాయి యువతిని ఉపయోగించాడని నిరూపితమైంది. పోలీసులు ఈ రిపోర్టర్ను అరెస్ట్ చేశారు. ఇక మన రాష్ట్రంలో కొత్తగా ప్రారంభం అయిన ఎన్-టీవీ ఉస్మానియా యూనివర్సిటీ స్టింగ్ ఆపరేషంపై కూడా ఎన్నో అనుమానాలు ఉన్నాయి. ఈ స్టింగ్ ఆపరేషన్ నిర్వహించిన రిపొర్టర్ రెహనా సరైన హోం వర్క్ చేయక పోవడమో లేదా ఉద్దేశ్య పూర్వకంగా సదరు ప్రొఫెసర్ ను ఇరికించే ప్రయత్నమో తెలియదు కానీ, విధ్యార్థులంతా ఏకమై ఎన్-టీవీ ప్రతినిధులు క్యాంపస్ లోకి వస్తే తంతామని, ఓబీ వ్యాన్ తగల బెడతామని హెచ్చరించారట. కొద్ది నెలల క్రితం ఇండియా టీవీ రిపొర్టర్లు సెక్స్ వర్కర్లతో కలిసి కొందరు బిహార్ ప్రజాప్రతినిధులను అల్లరి పెట్టి, ఆ విజువల్స్ రోజంతా ప్రసారం చేసి జిగుస్స కలిగించారు. ఛానెళ్ళ రేటింగ్లను పెంచుకోవడానికి చేసే ఇలాంటి అనైతిక స్టింగ్ ఆపరేషన్లు సమాజానికి పరేషాన్లుగా మారుతున్నాయి. ఈ విషయంలో జర్నలిస్టులంతా ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన అవసరం ఉంది. తమ స్టింగ్ ఆపరేషన్ ద్వారా సమాజానికి ఏమైనా మేలు జరిగితే సంతోషమే, కానీ ఛానెల్ పబ్లిసిటీ కోసం దిగజారిపోతే జర్నలిస్టులకు, వ్యభిచారిణులకు తేడా ఏముంటుంది.

జెమినిలో కక్ష సాధింపు బదిలీలు?

జెమిని న్యూస్ లో కొందరు సీనియర్లను బదిలీ చేయడం చర్చనీయాంశంగా మారింది. సీనియర్ రిపోర్టర్లు బ్రహ్మం, మహ్మద్ గౌస్ లను డెస్కుకు పంపారు. డెస్క్ ఇంచార్జ్ యాజులు, సీనియర్ సబ్ ఎడిటర్ బొల్లం రాజు లను చెన్నైకి బదిలీ చేస్తున్నారు. వీరిని బదిలీ చేయడానికి సరైన కారణాలేవీ యాజమాన్యం చూపించలేదు. త్వరలో మరి కొన్ని బదిలీలు తప్పవని తెలుస్తోంది. బదిలీ అయిన వారిలో ఒకరిద్దరు రాజీనామా చేసే అవకాశం ఉంది. ఈ పరిణామాలతో మిగతా ఉద్యోగులంతా ఆందోళన చెందుతున్నారు. కో ఆర్డినేటర్లు మునిరాజులు, నగేష్, రిపోర్టర్ గమ్మిడి శ్రీనివాస్ యాజమాన్యానికి చెప్పిన తప్పుడు చాడీలే బదిలీలకు కారణం అని తెలుస్తోంది. ఇప్పటికే జెమిని న్యూస్ లో కెమెరామెన్లంతా ఇతర ఛానెళ్ళలో చేరి పోయారు. పని తెలియని పెళ్ళి వీడియోగ్రాఫర్లను చేర్చుకొని నానా తంటాలు పడుతున్న జెమిని న్యూస్ కు త్వరలో వలస పోనున్న రిపోర్టర్లు మరో షాక్ ఇవ్వబోతున్నారు. జెమినిలో ముష్టి జీతాలకు తోడు మూలిగే నక్కపై తాటికాయ పడ్డట్లు అకారణ వేధింపులు అక్కడి సిబ్బందికి ఆందోళన కలిగిస్తున్నాయి.

Wednesday, September 5, 2007

కళానిధి మారన్ జీతం రూ. 23,26,00,000/- .. సరే మరి జెమిని ఉద్యోగుల జీతాల మాటేమిటి?..

తమిళ, తెలుగు, కన్నడ, మలయాళ భాషల్లో డజనుదాకా ఛానెళ్ళు నడుపుతున్న సన్ నెట్ వర్క్ సీఎండి కళానిధి మారన్ సంవత్సర జీతం అక్షరాలా ఇరవై మూడు కోట్ల ఇరవై ఆరు లక్షలు (రూ.23,26,00,000/-) మాత్రమేనట. అనగా నెలకు రూ.1,93,83,333 +.. ఇండియాలో అత్యధిక వార్షిక వేతనం తీసుకుంటున్న వారిలో కళానిధి మారన్ రెండో స్థానంలో ఉన్నారు. మూడో స్థానంలో ఇదే సంస్థకు చెందిన జె ఎండి కావేరి మారన్ ఉన్నారు. ఈ విషయం 03/09/2007 నాటి దిన పత్రికల్లో ప్రముఖంగా వచ్చింది. సంతోషం ఒక మీడియా ప్రముఖుడు టాప్ టెన్లో రెండో స్థానం పొందాడనుకుందామా? మరి సన్ గ్రూప్ లోని జెమిని, జెమిని న్యూస్, తేజ, ఆదిత్య ఛానెళ్ళ ఉద్యోగుల జీతాల విషయానికి వస్తే.. చెప్పుకుంటే సిగ్గు చేటు. అందరి జీతాల సగటు నెలకు రూ. 4-8 వేలు దాటదు. జెమిని ఛానెల్లన్నింటిని పే ఛానెళ్ళుగా మార్చి కోట్లాది రూపాయల్ని తమిళనాడుకు కొల్లగొట్టుకు పోతున్న మారన్ గారికి ఇక్కడి ఉద్యోగుల అర్ధకలి కేకలు పట్టవా? తాను మాత్రమే కోట్లాది రూపాయలు తీసుకుంటే చాలా? ఇతర తెలుగు ఛానెళ్ళతో పోలిస్తే జెమిని ఉద్యోగుల జీతాలు చాలా దారుణంగా ఉన్నాయి. అసలు ఈ విషయం మారన్ దృష్టికి వచ్చిందా? జీతాలు పెంచుతామంటూ నెలల తరబడి ఊరించిన యాజమాన్యం సముద్రంలో కాకి రెట్టంతే పెంచి చేతులు దులుపుకుంది. మారన్ గారు తన జీతంలో కనీసం ఒక శాతం తగ్గించుకొని జెమిని ఉద్యోగుల ఇచ్చినా వారు సమాజంలో గౌరవంగా బతుకుతారు.
జెమిని నుండి వలసలు
జెమిని నుండి ఇతర ఛానెళ్ళకు వలసలు ఉదృతం అయ్యాయి. జీతాలు చాలక వెళ్ళి పోతున్న వారి విషయంలో లోకల్ మేనేజిమెంట్ చేతులెత్తేసినట్లు తెలిసింది. మరికొద్ది రోజుల్లో ఉద్యోగుల సంఖ్య సగానికి పడిపోనుంది. కొత్త వారిని చేర్చుకునే విషయంలో సన్ యాజమాన్యం మీన మేషాలు లెక్కించడం ఆశ్చర్యకరం. ఇక్కడి దరిద్రపు జీతాలకు ఎవరొస్తారు?

Sunday, September 2, 2007

టీవీ-5లో కరీం

ఎట్టకేలకు టీవీ-9 మాజీ ఫేం కరీం టీవీ-5లో చేరిపోయాడు. కరీంకు ఔట్ పుట్ ఎడిటర్ బాధతలు ఇచ్చారని తెలిసింది. తేజా టీవీ, టీవీ-9లలో రవిప్రకాశ్ నీడలో ఎదిగిన కరీం కొంత కాలంగా వ్యక్తిగ జీవితంలో ఒడిదుడుకులు, చీటింగ్, పోలీస్ కేసులతో సతమతం అవుతూ మీడియాకు దూరంగా ఉన్నాడు. టీవీ-5 జాబ్ తో కరీంకు మళ్ళీ మీడియాలో పునర్జన్మ అభించిందని చెప్పవచ్చు. ఎలక్ట్రానిక్ మీడియాలో అంతగా ఫేస్ వ్యాల్యూలేని వారిని చేర్చుకొని సతమతం అవుతున్న టీవీ-5ను కరీం ఆదుకుంటాడని యాజమాన్యం ఆశ పెట్టుకుంది. చూడాలి మరి కరీం ఏం మాయ చేయబోతున్నడో..

ఆధ్యాత్మిక ఛానెళ్ళ అవసరం ఉందా?

ఆంధ్ర దేశాన భక్తి రసం వరదలై ప్రవహిస్తుందా అన్నట్లు ఆధ్యాత్మిక ఛానెళ్ళు ప్రారంభం అయ్యాయి. టీవీ-9వారి 'సంస్కృతి ' ఎన్-టీవీ వారి 'భక్తి ' ఇప్పటికే ఆరంభం కాగా, తిరుమల తిరుపతి దేవస్థానం త్వరలో 'శ్రీ వేంకటేశ్వర ' ఛానెల్ ను ప్ర్రారంభిస్తోంది. ఈటీవీ, మాటీవీ, జెమిని యాజమాన్యాలు కూడా ఇలాంటి ఆధ్యాత్మిక ఛానెళ్ళు ప్రారంభిస్తాయని వినిపిస్తోంది. సమాజంలో హింస, స్వార్ధం, అవినీతి విచ్చలవిడిగా పెరిగి పోతున్న ప్రస్తుత తరుణంలో ఆధ్యాత్మిక ఛానెళ్ళ ఆగమాన్ని స్వాగతించాల్సిందే.. అయితే ఈ ఛానెళ్ళు ఆయా యాజమాన్యాలకు ఆర్ఠికంగా గిట్టుబాటు అవుతాయా అన్నదే ప్రశ్న. జాతీయ స్థాయిలో (హిందీలో) ఇప్పటికే కొన్ని ఆధ్యాత్మిక ఛానెళ్ళు విజయవంతంగా నడుస్తున్నాయి. పలువురు స్వామీజీలు, యోగా గురువులు తమ ప్రసంగాలు,ఆసనాలతో ప్రేక్షకులను అలరిస్తున్నారు. ఇవి దేశ వ్యాప్తంగా చూసే ఛానెళ్ళు కాబట్టి ప్రేక్షకుల ఆధరణకు తగ్గట్టు యాడ్ రెవెన్యూతో నెట్టుకు వస్తున్నాయి. తెలుగులో ఇప్పటికే రెగ్యులర్ ఛానెళ్ళు ఉదయం పూట ఇస్తున్న ఆధ్యాత్మిక కార్యక్రమాలు సీనియర్ సిటిజన్ల వీక్షణానికే పరిమితం అవుతున్నాయి. వీరు కూడా పొద్దున ఆధ్యాత్మిక ప్రసంగాలు వింటున్నా, రోజంతా కుటుంబ నేపధ్య సేరియళ్ళు చూడటానికి ఆసక్తి చూపిస్తారు. ఈ పరిస్థితిలో ఆధ్యాత్మిక ఛానెళ్ళు ఆర్ధికంగా లాభదాయకం కాకున్నా, నిర్వహణ ఖర్చులైనా తిరిగి వస్తాయా?.. తిరుమల తిరుపతి దేవస్థానం వెంకన్నకు భక్తులు ఇచ్చే కానుకలతో 'శ్రీ వేంకటేశ్వర ' ఛానెల్ ను నడుపుతుంది. మరి మిగతా ఛానెళ్ళ యాజమాన్యాలు ఈ సబ్సిడీని భరించగలవా? క్రైస్తవ మత ప్రచార సంస్థలు ఇచ్చే ప్రకటణలు, స్వామీజీల ప్రసంగాల లైవ్ల ఆదాయంపై ఆశతోనే ఆధ్యాత్మిక ఛానెళ్ళు పెడుతున్నారనే ప్రచారం ఉంది.ఇది ఎంత వరకు నిజమో తెలియదు.

ఎన్-టీవీది మూడో స్థానమేనా?..

తెలుగు ఎలక్ట్రానిక్ మీడియాలో సంచలనాలు సృష్టిస్తామంటూ ఆరంభమైన ఎన్-టీవీ సాధారణ ఛానెల్ మాత్రమే అని తేలిపోయింది. ఈ ఛానెల్ చూసిన వారు టీవీ-9కి తక్కువ - జెమినిన్యూస్ కు ఎక్కువ అంటున్నారు. ఎన్-టీవీని గమనిస్తే టీవీ-9ని కాపీ కొడుతున్నట్లు కనిపించినా న్యూస్ బులెటిన్లు నాసిరకంగా కనిపిస్తున్నాయి. గ్రాఫిక్స్ మాత్రం బాగున్నాయి. ఎక్కువగా లైవ్లను నమ్ముకున్నట్లు కనిపిస్తోంది. బులటిన్-బులటిన్ మధ్య తేడా కనిపించడం లేదు. యాంకర్లు తక్కువైనట్లున్నారు. పొద్దంతా అవే ముఖాలు కనిపిస్తున్నాయి. న్యూస్ బేస్డ్ కార్యక్రమాలు పెద్దగా లేవు. ఎన్-టీవీని చూస్తే ఈటీవీ, టీవీ-9లకు ఇప్పట్లో ఢోకా లేనట్లే అనిపిస్తోంది. అయితే ఎన్-టీవీని ఇంత తొందరగా జడ్జ్ చేయడం న్యాయం కాదేమో.. ఇవన్నీ బాలారిష్ట కష్టాలుగా భావించి మరికొద్ది రోజులు వేచి చూద్దాం..

Wednesday, August 29, 2007

అనైతికం అనవచ్చా?..

ప్రజా జీవితంలో ఉన్నవారి వార్తలపై ఎవరికైనా ప్రత్యేక ఆసక్తి ఉండటం సహజం. వారు తుమ్మినా, దగ్గినా వార్తే అంటే అతిశయోక్తి కాదేమో.. ప్రస్తుత చర్చంతా తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు తనయుడు లొకేశ్, సినీనటుడు బాలకృష్ణ కూతురు బ్రాహ్మణి వివాహం గురించే. ఈ వివాహానికి మీడియాను పిలవలేదు. అయినా అత్యుత్సాహంతో ఈ వివాహ కవరేజీ కోసం మీడియా అంతా హైటెక్స్ ప్రాంగణానికి వెళ్ళింది. ఆహుతులంతా పెళ్ళి మంటపంలోకి వెళ్ళి, వధూవరుల్ని ఆశీర్వదించి భోజన తాంబూలాలు ఆరగించారు. కాని పిలవని పేరంటానికి వెళ్ళిన మీడియా వారిని పలకరించే నాధుడు లేడు. రోజంతా ఆకలితో మాడారట. ఇక్కడ ఈ విషయం అప్రస్తుతమే అనుకోండి. వివాహ దృశ్యాలను చిత్రీకరించేందుకు మీడియాను అనుమతించలేదు. కానీ టీవీ-9 వాళ్ళు 'తాళి కట్టు శుభవేళ ' అంటూ ఎలాగో పెళ్ళి వీడియో వారిని లోబరచుకొని పెళ్ళి దృశ్యాలను సంపాదించారు. వీటిని 'మాకే ఎక్స్ క్లూజివ్' అంటూ రోజంతా ప్రసారం చేశారు. పనిలో పనిగా రెండు రోజుల ముందు చంద్రబాబు తన కుటుంబ సభ్యులతో కలిసి వేసిన స్టెప్పులను ప్రముఖంగా చూపించారు. దీనిపై చంద్రబాబు సీరియస్ అయ్యారు. టీవీ-9ది అనైతిక ధోరణి అని తప్పు పట్టారు. హైదరాబాద్ బాంబ్ బ్లాస్ట్ విషాద సమయంలో ఇలాంటి ప్రసారానికి అర్థం ఏమిటని ప్రశ్నించారు. నిజానికి చంద్రబాబు వివాహ కార్యక్రమం ముగియకుండానే బాంబు పేలుడు బాధితులను పరామర్శించడానికి బయలు దేరారు. కాబట్టి ఆయన ఆ మాత్రం బాధను వ్యక్తం చేయటం సహజం. నిజానికి టీవీ-9 చేసిన పని తప్పా అని ప్రశ్నిస్తే అవునని చెప్పలేం.. కాదనీ అనలేం.. విలువల సంగతి పక్కన పెట్టి జర్నలిస్ట్ దృష్టితో ఆలోచించి ఈ విషయాన్ని సమర్ధించుకో వచ్చేమో.. ఎవరి దృష్టి కోణం వారికి ఉంటుంది. అయితే అన్ని విషయాల్లో అతి పనికి రాదు. ఇదే ధోరణి కొనసాగితే.. డయానా విషయంలో బ్రిటన్ టాబ్లాయిడ్లు, పాపరాజీలను జనం ఈసడించుకోవడాన్ని గుర్తు తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది.

గొట్టాల కొట్లాట

తెలుగు నాట టీవీ ఛానళ్ళు పెరిగి పోతున్నాయి. దీనికి తగ్గట్లు రాజకీయ, వ్యాపార, సాంస్కృతిక, చలనచిత్ర కార్యక్రమాల కవరేజీకి వచ్చే ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు పెరిగిపోతున్నారు. ఇక్కడే అసలు సమస్య తయారవుతోంది. మైకులతో బైట్లు తీసుకోవడానికి పోటీ పడుతున్న ఛానెల్ వాలాలు పరస్పరం తోసుకుంటూ, తిట్టుకుంటూ అటు నేతాశ్రీలను, ఇటు ప్రింట్ మీడియా వారిని ఇబ్బంది పెడుతున్నారు. గొట్టలవారితో చచ్చిపోతున్నామండి బాబు అని వీఐపీల సెక్యూరిటీ సిబ్బంది వాపోతున్నారు. 'ఏం చేయమంటారు.. తెరపై మా గొట్టం లోగో కనిపించకపోతే మా బాస్ ఊరుకోరు..' అంటూ ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళు సంజాయిషీ ఇస్తారు. నిజమే పీత కష్టాలు పీతవి.. ఈ ఎపిసోడ్ కి అంతం లేదా?.. కచ్చితంగా ఉంది. మీడియా తాకిడి ఎక్కువగా ఉండే చోటా అన్ని మైకులు పెట్టుకోవడానికి అనువైన స్టాండ్స్ ఏర్పాటు చేయాలి. దేశ రాజధాని ఢిల్లీలో పార్లమెంట్, ఇతర ముఖ్యమైన ప్రాంతాల్లో ఈ ఏర్పాటు ఇప్పటికే ఉంది. మన రాష్ట్రంలో ముఖ్యమంత్రి కార్యాలయంలో మాత్రమే ఎలాంటి స్టాండ్ కనిపిస్తుంది. అన్నీ I&PR వాళ్ళే ఏర్పాటు చేస్తారు అని భావిస్తే కష్టం. ఛానళ్ళ యాజమాన్యాలే వీటిని స్పాన్సర్ చేస్తే బాగుంటుంది. అవి ఉపయోగ పడేది వారికే అని గ్రహించాలి. గతంలో NDTV ఢిల్లీలో ఇలాగే స్పాన్సర్ చేసింది.
కొత్త పదాలు : గొట్టంగాళ్ళు = ఎలక్ట్రానిక్ మీడియా, పోటుగాళ్ళు = ప్రింట్ మీడియా

Sunday, August 26, 2007

టీవీ-9లో మాధవ్.. అవాక్కయ్యారా?..

తెలుగు ఎలక్ట్రానిక్ మీడియాలో రవిప్రకాశ్ ను అందరికన్నా ఎక్కువగా వ్యతిరేకించే వ్యక్తి మాధవ్. మాధవ్ ఈ శనివారం హఠాత్తుగా రవిప్రకాశ్ ను కలుసుకొని టీవీ-9లో చేరిపోయాడు. ఈ పరిణామంతో చాలా మంది జర్నలిస్టులు ఆశ్చర్యపోయారు. మాధవ్ ఒకప్పుడు రవిప్రకాశ్ కు ఎంతో సన్నిహితుడు. సిటీకేబుల్ కు రవిప్రకాశ్ రాజీనామా చేయగానే అప్పటి దాకా అక్కడే రిపోర్టర్ గా ఉన్న మాధవ్ కూడా ఆయన్నే అనుసరించి జెమినిలో చేరాడు. కాలక్రమంలో కరీం చేరువ కావడం రవిప్రకాశ్ అక్కడక్కడా సూటిపోటి మాటలు అనడం, అవి మాధవ్ కు తెలిసి బాధ పడటం వీరిద్దరితో పరిచయం ఉన్న సన్నిహితులకు బహిరంగ రహస్యమే. నమ్మకంగా పనిచేసే మాధవ్ ను రవిప్రకాశ్ నిర్లక్షం చేశాడని అంతా అనుకుంటుంటారు. రవిప్రకాశ్ జెమినిని వీడి టీవీ-9ని స్థాపించాక మాధవ్ కు కష్టాలు ఆరంభం అయ్యాయి. జెమిని యాజమాన్యం మాధవ్ ను రవిప్రకాశ్ ఏజెంట్ గా అనుమానించటంతో ఆ సంస్ఠకు రిజైన్ చేయక తప్పలేదు. కొంత కాలం జీ-తెలుగులో పనిచేసిన మాధవ్ ను జెమిని యాజమాన్యం మళ్ళీ పిలిపించి కో-ఆర్డినేటర్ జాబ్ ఇచ్చినంది. తిరిగి కొద్ది నెలల్లోనే మాధవ్ యాజమాన్యంతో పడక జెమినికి రాజీనామా ఇచ్చాడు. తాజాగా రవిప్రకాశ్ తో రాజీపడ్డ మాధవ్ ను విజయవాడ కో-ఆర్డినేటర్ గా నియమించారని టీవీ-9 వర్గాలు చెబుతున్నాయి. ఇటీవలి వరకు రవిప్రకాశ్ ని వ్యతిరేకించే జర్నలిస్టులకు అప్రకటిత నాయకుడిగా ఉన్న మాధవ్ తీసుకున్న తాజా నిర్ణయం వారందరిని ఖంగు తినిపించింది. పొట్ట తిప్పల కోసం తనకు నచ్చిని చోట రాజేపడి పని చేసే హక్కు ప్రతి జర్నలిస్టుకు ఉంటుంది.. కాదనలేం. కొత్త జాబ్ లో ఐనా మాధవ్ నిలకడగా పని చేస్తాడని ఆశిద్దాం. ఎందుకంటే మాధవ్ ఎక్కడ పని చేసినా ఎక్కువ రోజులు ఉండడని ఆయన స్వభావం తిలిసిన రిపోర్టర్లు చెబుతుంటారు. ఎ అమాటకు ఆ మాటే చెప్పలి మాధవ్ చాలా సిన్సియర్ జర్నలిస్ట్..
కొసమెరుపు: మాధవ్ టీవీ-9లో చేరటం వల్ల రవిప్రకాశ్ క్రెడిబిలిటీ పెరిగినట్టే కదా..

Wednesday, August 22, 2007

జెమిని న్యూస్ బ్యురొచీఫ్ కానున్న 'అవినీతి సామ్రట్'


'జెమిని న్యూస్' బ్యూరో చీఫ్ గా ఎవరు వస్తారా అని ఆసక్తిగా ఎదురు చూస్తున్న వారంతా ప్రచారంలో ఉన్న ఒక వార్త విని షాక్ తిన్నారు. ఈ వార్త లేదా వదంతి జెమిని వర్గాలను కూడా కలవర పరుస్తోంది. 'జెమిని న్యూస్' బ్యూరో చీఫ్ గా ఆ చానెల్లోనే బిజినెస్ రిపోర్టర్ గా పని చేస్తున్న స్టెర్జీ రాజన్ ని నియమించాలని సన్ యాజమాన్యం నిర్ణయించిందట(?) బిజినెస్ రిపోర్టింగ్ ముసుగులో స్టెర్జీ పాల్పడే అవినీతిని మీడియా వర్గాలు కథలు, కథలుగా చెబుకుంటాయి. ఒక్కో వార్తకు ఆయన 2-5 వేల దాకా తీసుకుంటాడు. వార్తా క్లిప్పింగ్లపై వచ్చే ఆదాయం అధనం. ఈ ఆదాయం అంతా ఆయన వ్యక్తిగత, రహస్య ఖాతాలో జమ అవుతుంది. స్టెర్జీ జెమిని నుండి వచ్చే జీతం అంతగా ఖర్చు పెట్టడు. ఈ విషయం ఆయన సాలరీ అకౌంట్ గమనించి నిర్ధారించు కోవచ్చు. బిజినెస్ న్యూస్ ద్వారా జెమిని సంస్థకు దమ్మిడి ఆదాయం ఉండదు. కానీ స్టెర్జీ రాజన్ వ్యక్తిగత ఆస్తులు మాత్రం ఇబ్బడి ముబ్బడిగా పెరుగు తున్నాయి. జెమిని సంస్థకు ఒక్క యాడ్ రికమెండ్ చేయక పోగా వ్యాపార, కార్పోరేట్ సంస్థలకు జెమినిలో ఉచిత ప్రచారం కల్పిస్తాడీయన (తన జేబుకు గిట్టు బాటైతే చాలు). బిజినెస్ న్యూస్ తో పాటు స్టెర్జీ అధనపు బాధ్యతలు చూస్తున్న సిటిలైట్ ప్రోగ్రాంలో తరచూ ఆయన కుటుంబ సభ్యులు కనిపిస్తుంటారు. బిజినెస్ ప్రెస్ మీట్లకు కూడా కుటుంబ సభ్యులను తీసుకెలతాడని వినికిడి. ఇలాంటి కళాకారున్ని సన్ యాజమాన్యం ఏకంగా 'జెమిని న్యూస్' బ్యూరో చీఫ్ గా నియమిస్తే ఎంత 'ఛీప్'గా ఉంటుందో ఆలోచించండి. దొంగ చేతికి తాలం ఇచ్చినట్లే.. బ్రహ్మాండంగా చానెల్ను మార్కెట్ చేసి పడేస్తాడు (అమ్ముకుంటాడు) కదూ..

సంచలనాలకు కేంద్రం కానున్న ఎన్-టీవీ


తెలుగు నాట నరేంద్ర చౌదరి ఆరంభిస్తున్న ఎన్-టీవీ మీడియా వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ నెలాఖరున ప్రారంభం కానున్న ఎన్-టీవీ ఎలక్ట్రానిక్ మీడియాలో సరికొత్త ప్రయోగం కానుంది. అత్యున్నత ప్రమాణాలతో వస్తున్న ఈ చానెల్ ఈటీవీ, టీవీ-9లకు గట్టి పోటీ ఇవ్వగలదని చెప్పవచ్చు. వార్తా సేకరణ కోసం విస్తృతంగా ఓబీ వాన్లను రంగంలోకి దింపుతున్న ఎన్-టీవీ, జిల్లా రిపోర్టర్లకు 'లాప్ టాప్'లను ఇస్తోంది. వీటి ద్వారా స్పాట్ నుండే 3ఎంబి లైన్లో ఎప్పటికప్పుడు తాజా వార్తల్ని లైవ్ గా ఇస్తారట. ఎన్-టీవీ వేగాన్ని తట్టుకునేందుకు ఈటీవీ, టీవీ-9 ఇదే మార్గంలో వెల్లక తప్పదు. ఆగస్ట్ 30 తేదీన ఎన్-టీవీ, భక్తి టీవీ చానెళ్ళు లాంచ్ అవుతున్నాయి.

Wish you all the best NTV team..

Monday, August 20, 2007

జర్నలిస్టులకు ఇళ్ళ స్థలాలు ఇక లేనట్లేనా?..


ఇళ్ళ స్థలాల కోసం ఆశగా చూస్తున్న జర్నలిస్టుల ఆశలపై నీరు పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. కోర్టు కేసు సాకుతో ప్రభుత్వం ఇన్ని రోజులుగా పెండింగ్ పెడుతూ వచ్చిన ఈ సమస్యను ఇక పట్టించుకోక పోవచ్చు. కేంద్రంలోని పరిణామాలను గమనిస్తే ఎప్పుడైనా మధ్యంతర ఎన్నికలు వచ్చేలా ఉన్నాయి. అప్పుడు ఎన్నికల కోడ్ సాకుగా చూపి మరి కొన్ని నెలలు ఇళ్ళ స్థలాల సమస్యను పెండింగ్ పెడతారు. ఎన్నికల తర్వాత కాంగ్రెస్ పార్టీ సంస్థాగత విషయాల్లో, ప్రభుత్వం పాలనా విధుల్లో బిజీగా ఉంటుంది. ఆలోగా మళ్ళీ అసెంబ్లీ ఎన్నికలు వచ్చి పడతాయి. ఇక జర్నలిస్టులకు ఇంటి జాగాలు ఇచ్చేదెపుడు? ఏ ప్రభుత్వానికైనా జర్నలిస్టు కరివేపాకు లాంటి వాడే. తెలుగు దేశమైనా, కాంగ్రెసైనా జర్నలిస్టులను అవసరం ఉన్నంత వరకే వాడు కుంటారు. ప్రభుత్వంలో పైరవీలు చేసుకొనే వారికే బినామీగా ఇళ్ళూ, భూములు వచ్చి పడతాయనేది బహిరంగ రహస్యం. వైఎస్ ప్రభుత్వం కొంత నయం కనీసం జర్నలిస్టులకు ఇళ్ళ స్థలాలు ఇవ్వాలని ఆలోచించింది. కానీ చంద్రబాబు మళ్ళీ అధికారంలోకి వస్తే జర్నలిస్టులు ఇంటి జాగాలపై ఆశలు వదులు కోవలసిందే. టిడిపి ప్రభుత్వం మీడియా యాజమాన్యాలకు తప్ప జర్నలిస్టులకు చేసిందేమి లేదు (కొద్ది మందికి మినహా). పత్రికా స్వాతంత్రం అంటే మీడియా యజమానుల వ్యాపారాలకు ఇబ్బంది కలగ రాదేది వారి ఉద్దేశ్యం. వైఎస్ ప్రభుత్వం ఇంకా జర్నలిస్టులకు ఇళ్ళ స్థలాలు ఇవ్వక ముందే ఇచ్చేసినట్లు గవర్నర్ కు ఇచ్చిన ఒక ఫిర్యాదులో టిడిపి ప్రచారం చేసింది.
జర్నలిస్టులూ, నేతలు ఇకనైనా తొందర పడకపోతే ఇంటి జాగాలు ఒక జీవిత కాలం లేటనే వాస్థవాన్ని గ్రహించాలి..

Saturday, August 18, 2007

ఆశ బారెడు.. పీక సన్నం.. 'టీవీ-5'

ప్రారంభం అయితే ఎలా ఉంటుందో చెప్పలేం కానీ, ఫీల్డ్ లో 'టీవీ-5' చేస్తున్న హడావుడి అంతా ఇంతా కాదు. మారుతీ ఓమ్నీకి డమ్మీ డిష్ పెట్టుకొని నగర వీధుల్లో పరుగులు తీస్తున్న టీవీ-5 బృందం ఇప్పటికే నడుస్తున్న చానళ్ళ కన్నా ఎక్కువ హడావుడి చేస్తున్నారు. వారి నిబద్దతను తప్పు పట్టలేం కానీ ఈ చానెల్ ఫీల్డ్ లో ఎంత వరకు తట్టుకొని నిలబడగలదన్నదే ప్రశ్న. టీవీ-5లో అంతగా పేరున్న జర్నలిస్టులు కనిపించడం లేదు. అంతగా అనుభవం లేని వారినే రిపోర్టర్లుగా తీసుకున్నట్లు కనిపిస్తోంది. ఈ లోపాన్ని పూరించడానికా అన్నట్లు టీవీ-5 యాజమాన్యం టీవీ-9 మాజీలు కరీం, రాజశేఖర్ లను తీసుకుంటున్నట్లు వినికిడి. వీరిద్దరూ ఎలాంటి స్కామ్‌లలో ఇరుక్కొని టీవీ-9నుండి తొలగించబడ్డారో మీడియా మిత్రులందరికీ తెలుసు. అసలు టీవీ-5 అనే పేరు చానెల్ కు ఎంత వరకూ నప్పుతుందంటారు? వారేదో 'తిండి, బట్టా, గూడూ..' అనే సిద్దాంత చెబుతున్నా.. టీవీ-9కి కాపీ లాగే కనిపిస్తోంది. ఇలాంటి ఆశయాల సాధన కోసం స్వచ్చంద సంస్థ నడుపుకోవచ్చు కదా? చానెల్ ఎందుకు? టీవీ-5 పేరిట ఇప్పటికే ప్రపంచంలో పలు భాషల్లో చానెళ్ళు ఉన్నాయి. ఇక జీతాల సంగతికొస్తే జెమిని సిబ్బంది కన్నా బెటరే.. జర్నలిస్టుల ఉపాధి కోసమైనా ఇలాంటి చానెళ్ళు ఉండటం అవసరం.

Friday, August 17, 2007

జెమిని ఢిల్లీ రిపోర్టర్ 'ధనార్జన్ '

అందరూ ఊహించినట్లే జెమిని ఢిల్లీ రిపోర్టర్ గా చందు జనార్ధన్ చేరిపోయాడు. ఈ పోస్ట్ కోసం జనార్ధన్ ఎడిటర్ రఘుకుమార్ కు బాగానే చెల్లించుకున్నాడని మీడియా వర్గాలు కోడై కూస్తున్నాయి. పైరవీలకు పేరుగాంచిన జనార్ధన్ వసూళ్ళలో ఘనాపాటి. ఎలక్ట్రానిక్ మీడియాకు సోకాల్డ్ ప్రసిడెంట్ గా చెలామని అవుతున్న జనార్ధన్ కు ఈ పోస్ట్ ఇప్పించడంలో రఘుకుమార్ ప్రియ శిష్యుడు హైదరాబాద్ కో ఆర్డినేటర్ మునిరాజు మధ్యవర్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇక రఘుకుమార్ కు డిల్లీ నుండి కూడా గిట్టుబాటు అవుతుందన్న మాట. తొలగించ బడ్డట్టే ప్రచారం జరిగి ఏ మాయతోనో తిరిగి ఎడిటర్ గా సిఫార్స్ చేయించుకున్న రఘుకుమార్ బుద్ది ఇంకా మార లేదని జెమిని వర్గాలు చెబుతున్నాయి.
దేవుడా జెమిని న్యూస్ ను రక్షించ లేవా?..

Wednesday, August 15, 2007

మీడియా మిత్రులకు, శ్రేయోభిలాషులకు 60వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు..

ఖబడ్దార్ హాకర్స్..

తెలుగు మీడియాకు సంబందించిన సమాచారాన్ని తోటి జర్నలిస్టులతో పంచుకోవడానికి వేదికైన 'ఎబౌట్ తెలుగు మీడియా'ను హాక్ చేయడానికి కొన్ని దుష్ట శక్తులు ప్రయత్నించినట్లు పసిగట్టాం. సదరు హాకర్లు ఈ బ్లాగ్ లోని కొన్ని తాజా వార్తల్ని తొలగించారు. వారెవరో మాకు తెలిసిపోయింది. వారి ఆటలు ఇకపై సాగవని గ్రహిస్తే మంచిది.
ఖబడ్దార్ హాకర్స్..

Tuesday, August 7, 2007

ఎలక్టానిక్ మీడియా జర్నలిస్టుల సంఘం దౌర్భాగ్యం..

ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులకు ప్రస్తుతం ఒక సంఘమనేది ఉందా? ఉంటే ఏంచేస్తోంది? శైలేశ్ రెడ్డి పై అసంతృప్తితో పోటీ సంఘాన్ని పెట్టి దానికి జనార్ధన్ అనే సీ చానెల్ బ్యూరోచీఫ్(ఇప్పుడు మాజీ) ను ప్రసిడెంట్ గా పెట్టిన పెద్ద మనుషులు ఇప్పుడేం చేస్తున్నారు? ఎలక్టానిక్ మీడియా జర్నలిస్టుల సంఘంగా చెప్పుకునే నాయకులు ముఖ్యమంత్రి కార్యాలయంలో పైరవీలు చేసుకోవడం తప్ప జర్నలిస్టుల సంక్షేమం కోసం చేస్తున్నదేమీలేదు. ఇళ్ళ స్థలాల పేరిట తరచూ మభ్యపెడుతుండే ఈ సంఘం జర్నలిస్టుల కోసం ఒక్క శిక్షణా శిభిరమైనా నిర్వహించిన పాపాన పోలేదు. సదరు అధ్యక్షుల వారు సీ చానల్ నుండి తొలగింపబడి కొత్త చానళ్ళలో అవకాశాల కోసం తిరుగుతున్నారు. జెమిని బ్యూరో చీఫ్ గా వెల్లుతున్నానని బయట చెప్పుకుంటున్నాడట(?) జనార్ధన్ అధ్యక్షతన ఏర్పడ్డ ఈ పోటీ సంఘానికి రెండున్నర ఏళ్ళవుతున్నా ఎన్నికలు జరపలేదు. అంటే జనార్ధన్ జీవిత కాల అధ్యక్షుడుగా ఉండాలని సోకాల్డ్ పెద్దలు కోరుకుంటున్నారా?

మరోవైపు చక్కని కార్యక్రమాలతో ముందుకు సాగుతున్న కెమెరామెన్ల సంఘం ఇటీవలే ఎన్నికలు జరుపుకుంది. వీరిని చూసైనా జర్నలిస్టుల సంఘం బుద్ది తెచ్చుకోవడం మంచిది.

ఎన్ టీవీలో సం'కుల ' సమరం

ఇంకా ప్రారంభమైనాకాలేదు అప్పుడే ఎన్ టీవీలో వర్గ పోరాటాలు ప్రారంభమైనాయి. రామానుజం-కొమ్మినేని-మూర్తి త్రయంల అంతర్గత పోరాటం వెగటు పుట్టిస్తోంది. బ్రాహ్మణ-కమ్మ రాజకీయాల నడుమ సిన్సియర్ జర్నలిస్టులు నలిగి పోతున్నారు. తాజాగా మూర్తి(మాజీ ఈటీవీ) కొమ్మినేని వర్గంతో తగాదా పెట్టుకొని సస్పెన్షన్ వేటుకు గురయ్యాడు. బహుషా మూర్తి రాజీనామా చేసే అవకాశాలు ఉన్నాయని ఎన్ టీవీ వర్గాలు చెబుతున్నాయి. మరో వైపు అటు కొమ్మినేని ఇటు రామానుజం 'ఇతర ' అవకాశాలు వెతుక్కుంటున్నారనే వదంతులున్నాయి.

Saturday, August 4, 2007

జెమిని చీఫ్ న్యూస్ ఎడిటర్ రఘుకుమార్ తొలగింపు..

జెమిని చీఫ్ న్యూస్ ఎడిటర్ రఘుకుమార్ కు సన్ యాజమాన్యం ఉద్వాసన పలికింది. రఘుకుమార్ పై అవినీతి ఆరోపనల నేపధ్యంలో తొలగించక తప్పలేదు. అయితే రఘుకుమార్ తానే రాజీనామా చేశానని చెప్పుకుంటున్నారు. జెమిని వార్తా విభాగం దుస్తితికి రఘుకుమార్ చేయాల్సినంత కృషి చేశారు. జిల్లా రిపొర్టర్ల నుండి ఈయన బాగానే దండుకున్నారనే ఆరోపనలు ఉన్నాయి. రిపోర్టర్ పోస్టుల్ని రఘుకుమార్ అమ్ముకునేవారని జెమిని వర్గాలు చెవులు కొరుక్కుంటాయి. రఘుకుమార్ తన ఇంట్లో పెళ్ళికి జిల్లా రిపోర్టర్ల నుండి భారీగా వసూలు చేశాడంటారు. ఈయన చీఫ్ ఎడిటర్ కాగానే పలు జిల్లా రిపోర్టర్లను తొలగించి తన అనుయాయుల్ని, డబ్బు దండిగా ఇచ్చిన వారిని పెట్టుకున్నారని ఆరోపనలు ఉన్నాయి. తాగిచ్చే రిపోర్టర్లంటే బాగా ఇష్టపడతాడు. చెన్నై కేంద్రంగా పని చేసే రఘుకుమార్ కు హైదరాబాద్ బ్యూరోతో పెద్దగా పరిచయం లేకపొవడం ఆశ్చర్యకరమైన విశయం. హైదరాబాద్ కు వచ్చినప్పుడల్ల హొటల్లో విడిది చేసి తన వర్గం రిపోర్టర్లతో విందు వినోదాలతో గడిపి వీలుంటే చుట్టపు చూపుగా జెమిని న్యూస్ ఆఫీస్ కి వెలతాడు. రఘుకుమార్ తొలగింపుతో 'జెమిని'కి పట్టిన గ్రహణం కొద్దిగా తొలగిందనే చెప్పవచ్చు.
రఘుకుమార్ ఉధ్వాసన వాసన ముందుగానే పసిగట్టిన ఆయన విశ్వసనీయ చీఫ్ సబ్ ఎడిటర్ వాసుదేవన్ చాలా రోజుల ముందే లాంగ్ లీవ్ పెట్టి కొత్త ఉద్యోగ వేటలో పడ్డాడని జెమిని వర్గాల కథనం. ఈ పాటికే ఆయనకు కొత్త ఉద్యోగం వచ్చి ఉండవచ్చు. పాపం రఘుకుమార్ ప్రియతముడైన హైదరాబాద్ న్యూస్ కోఆర్డినేటర్ మునిరాజు భవిశ్యత్తు కాలమే తేలుస్తుంది. ('మీడియా అబ్జర్వర్ 'కు ప్రత్యేక ధన్యవాదాలు)
మరికొన్ని జెమిని వార్తా విశేషాల కోసం చూస్తూనే ఉండండి "ఎబౌట్ తెలుగు మీడియా"

Sunday, July 29, 2007

బురద చల్లం కానీ ఉతికేస్తాం..

అతి కొద్ది సమయంలోనే 'ఎబౌట్ తెలుగు మీడియా' పాపులర్ కావడం మాకు సంతోశాన్నిస్తోంది. ఈ సందర్భంగా మా బ్లాగ్ వీక్షకులకు ఒక విశయాన్ని మనవి చేయదలచుకున్నాం.. మీడియాలో మాకు గిట్టని వర్గాలను టార్గెట్ చేసుకొని బురద చల్లడం మా అభిమతం కాదు.. అలాగని జరుగుతున్న అన్యాయాన్ని చూస్తూ ఊరుకోం.. మీడియాలో చోటు చేసుకునే పరినామాలను, మంచీ-చెడులను నలుగురితో పంచుకునేందుకే ఈ బ్లాగ్ ఏర్పాటు చేశాం.. జర్నలిస్టులకు జరుగుతున్న అన్యాయాలను (తోటి జర్నలిస్టులతో కూడా) ఎదిరించడం మా ప్రధాన లక్ష్యం. వ్యక్తిగత నిందలకు మేం దూరం.. అయితే జర్నలిస్టులకు ద్రోహం చేస్తున్నవారిని చూస్తూ ఊరుకోం.. రాతలతో తగిన విధంగా వాతలు పెడతాం.. ఈ పోరాటం మా ఒక్కరిదే కాదు.. జర్నలిస్టులందరిది.. మాకు ఆశీసుల్లందించండి.
మీ వద్ద ఉన్న సమాచారాన్ని మాకు రెండు మార్గాల ద్వారా అందించ వచ్చు. ప్రతి వార్త కింద ఉండే comments ని క్లిక్ చేసి పంపవచ్చు. లేదా atmap@rediffmail.com కి మెయిల్ చేయండి.

శర్మకు శత్రువులెందుకు?

తెలుగు మీడియా బ్లాగులాలో మంచికో, చెడుకో అందరికన్నా ఎక్కువగా కనిపించే పేరు శర్మదే అంటే అతిశయోక్తి కాదు. ఆయన వ్యవహారశైలే అందుకు కారణం. జర్నలిస్టుల్లో అవినీతిపరులకు కొదవలేదు. అయితే అందరూ శర్మ వెంట ఎందుకు పడుతున్నారు? మీడియాలో శర్మకు మిత్రులు చాలా తక్కువ. ఉన్నా బయట పడరు. ఏ జర్నలిస్టుకు లేనంతగా ఆయనకు శత్రువులున్నారు. ప్రతి ఒక్కరితో తగాదాలు పెట్టుకోవడం, అందరినీ అనుమాన దృష్టితో చూడటమే ఇందుకు కారణం. అందుకే మీడియా బ్లాగులకు ఆయన టార్గెట్ అయ్యాడు. శర్మ ఇకనైనా తన పద్దతులు మార్చుకుంటే సమాజానికి, ముఖ్యంగా మీడియాకు మంచిది..
కొసమెరుపు: అందరు అనుకుంటున్నట్లుగా శర్మ మాటీవీకి ఇంకా రాజీనామా చేయలేదు. స్పెషల్ కరస్పాండెంట్ హోదాలో ఆఫీస్లోనే ఒక మూల కూర్చొని కాలక్షేపం చేస్తున్నడని మాటీవీ వర్గాల భోగట్టా. జెమినిలో ఢిల్లీ రిపొర్టర్ పోస్టు కోసం ప్రయత్నాలు మాత్రం జోరుగా జరుపుతున్నాడని తెలిసింది.

Thursday, July 26, 2007

మాటీవీ జీతాలు పెరిగాయి.. బ్యూరోచీఫ్..సత్యనారాయణ

ఎట్టకేలకు మాటీవీ న్యూస్ సిబ్బంది జీతాలు పెరిగాయి. 50 నుండి 100 శాతం దాకా పెరిగిన వేతనాలు 'మా' జర్నలిస్టులకు ఆనందాన్ని కలిగించాయి. పెరుగుదల ఈ స్థాయిలో ఉంటుందని ఎవరూ ఊహించి ఉండరు. మాటీవీలో ఇతర డిపార్ట్ మెంట్ల సిబ్బందికి గతంలోనే వేతనాలు పెంచారు. న్యూస్ వారికి జీతాల పెరుగుదలో జాప్యం వల్ల ఎన్నో అపోహలు, వదంతులు వినిపించాయి. ఈ కారణంగానే భావనారాయణ రాజీనామా ఇచ్చిన విశయం అందరికి తెలిసినదే..
మాటీవీ బ్యూరోచీఫ్ గా ఎవరు రానున్నరనే ఊహాగానాలకు తెరదించుతూ మాటీవీ డెస్క్ సీనియర్ సబ్ ఎడిటర్ సత్యనారాయణకు ఆ బాధ్యతలు అప్పగించారు.
మాటేవీ జర్నలిస్టుల జీతాలు భారీగా పెరగటం జెమిని ఉద్యోగులకు ఇబ్బందిని కలిగించింది. పాపం వారు ఇంతకన్నా చేయగలిగేది ఏం ఉంటుంది. మతిలేని యాజమాన్యాన్ని నిందించుకోవడం తప్ప..

Saturday, July 21, 2007

గొర్రెతోక బెత్తెడు..జెమిని జీతం..

ఎలక్ట్రానిక్ మీడియాలో అత్యంత నికృష్ట జీతాలు ఇచ్చే సంస్థగా 'జెమిని ' పేరు తెచ్చుకుంది. లోకల్ కేబుల్ చానళ్ళలో కూడా అంత తక్కువ వేతనాలు ఉండవేమో. విలసాల కోసం డబ్బును మంచినీరులా ఖర్చు చేసే సన్-జెమిని యాజమాన్యం జర్నలిస్టులకు మంచి జీతాలు ఇచ్చే విషయంలో కక్కుర్తి పడుతోంది. వార్తా సేకరణ కోసం ప్రత్యేకంగా విమానాన్నే కొన్నట్లు చెప్పుకునే సన్ యాజమాన్యం తన గ్రూప్ లో అత్యంత ప్రధానమైన జెమిని న్యూస్ ఉద్యోగులకు కడుపు నిండా తిండి పెట్టే జీతాలు మాత్రం ఇవ్వదు. ఒకవైపు కొత్తగా వస్తున్న చానళ్ళు మంచి జీతాలు అఫర్ చేస్తుంటే సిబ్బందిని కాపాడుకునే ప్రయత్నం కూడా చేయడంలేదు. ఇప్పటికే 75 శాతం ఉద్యోగులు సంస్థను వదిలిపోయినా సన్-జెమిని యాజమాన్యంలో చలనం లేదు. కెమెరామెన్ల జీతాలయితే మరీ ధారుణంగా ఉన్నాయి. హైదరాబాద్ స్ట్రింగర్లకు చేరి మూడేళ్ళయినా ఇంత వరకు రెమ్యునరేషన్ ఇవ్వక పోవడంతో పైరవీలు చేసుకొని పొట్టనింపుకుంటున్నారు. కొత్తగా తీసుకుంటున్న సిబ్బందికి పాతవారికన్నా ఎక్కువ జీతాలు నిర్నయించడంతో సీనియర్లు కొత్త ఉద్యోగాలు వెతుక్కోవడంలో నిమగ్నమైనారు. పే-ఛానల్స్ రూపంలో రాష్ట్రం నుండి కోట్లాది రూపాయలు కొల్లగొడుతున్న తమిళ సన్ యాజమాన్యం తమ తెలుగు ఛానల్ జెమిని ఉద్యోగులకు సరైన వేతనాలు ఇవ్వకపోవడం ధారుణం. ఏడాది కాలంగా ఊరిస్తూ ఇటీవలే పెంచిన్ జీతాలపై ఉద్యోగులంతా అసంత్రుప్తితో ఉన్నారు. పెరిగింది గొర్రెతోకంతే.. గ్రేటర్ హైదరాబాద్ ఏర్పడ్డాక నగరంలో, శివారు ప్రాంతంలో అద్దెలు రెండింతలైనాయి. ఈ పరిస్తుతుల్లో జెమిని ఉద్యోగులు నగరంలో బతకలేని పరిస్తితులు ఏర్పడ్డాయి.
( జెమిని జీతంతో బతకలేక కొత్తగా రానున్న ఛానల్లో చేరిన జర్నలిస్ట్ ఇచ్చిన సమాచారం ఆధారంగా )

Thursday, July 19, 2007

కొత్త పత్రికల భవిశ్యత్తు ఏమిటి?

సాక్షి, సూర్య పత్రికలపై మీడియా వర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది. 'ఆ' రెండు పత్రికలకు పోటీగా వస్తున్న ఈ పత్రికలు జర్నలిస్టులకు జీతాలు పెద్ద మొత్తంలో ఎర వేస్తున్నాయి.. ఈ విశయంలో జర్నలిస్టులంతా హాపీగానీ ఉన్నారు, కానీ కాంగ్రెస్ పార్టీ అండ దండలతో వస్తున్న ఈ పత్రికల భవిశ్యత్తు ఏమిటి అని కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. రాష్ట్రంలో రెండేళ్ళ తర్వాత కర్మగాలి కాంగ్రెస్ అధికారాన్ని కోల్పోతే పరిస్తితి ఏమిటి?. వై.ఎస్. సర్కారు ఇప్పుడు ఈనాడును ముప్పుతిప్పలు పెడుతున్నట్లే తెలుగుదేశం ప్రభుత్వం సాక్షి, సూర్యల పని పట్టదా?. ఆమెన్ పాపము శమించు గాక.. జర్నలిస్టు ఎక్కడ పని చేస్తున్నా క్షేమంగా ఉండాలనే కోరుకుందాం.. కాని అధిక జీతాలకు ఆశ పడి తొందర పాటు నిర్నయాలు తీసుకోవద్దనే మా సలహా..

Wednesday, July 18, 2007

'మా' శర్మ ఔట్.. 'జెమిని 'లో పైరవీలు..

మాటీవీ బ్యూరో చీఫ్ రాజేశ్వర్ శర్మ ఆ సంస్థకు గుడ్ బై చెప్పినట్లు తెలుస్తోంది. 'మా' కర్మగా పేరు తెచ్చుకున్న శర్మ అవమానకర పరిస్తితుల్లో విధులకు డుమ్మ కొట్టాల్సివచ్చింది. ప్రతి ఒక్కరిని అనుమాన దృష్టితో చూసే శర్మ శాడిజానికి విసుగెత్తిన రిపోర్టర్లంతా యాజమాన్యానికి ఫిర్యాదు చేశారు. శర్మ అవినీతి వ్యవహారాలను తెలుసుకున్న 'మా' యాజమాన్యం ఆయన్ని స్పెషల్ కరెస్పాండెంట్ గా రివర్ట్ చేసింది. దీన్ని ఎంతో అవమానంగా భావించిన శర్మ ఆ 'మా' నుండి వైదొలగాలని నిర్నయించుకున్నట్లు తెలుస్తోంది. వెలుతూ వెలుతూ శర్మ అందరికి మిఠాయిలు పంచాడట. శర్మను సాగనంపటంలో 'విస్సా శ్రీధర్ ' పాత్ర ఉందని తెలుస్తోంది. తాజా సమాచారం ప్రకారం రాజేశ్వర్ శర్మ తన మాతృ సంస్థ 'జెమిని ' కి బ్యూరోచీఫ్ గా వెల్లేందుకు చెన్నై వెళ్ళి పైరవీలు చేస్తున్నాడు. ఇక జెమినిన్యూస్ సిబ్బందిని ఆ దేవుడే కాపాడాలి. పూర్వాశ్రమంలో జెమిని రిపోర్టర్లు కూడా కర్మ బాధితులే..

Saturday, July 7, 2007

మరిన్ని సంచలన మీడియా వార్తలు, విశేషాలతో మీ ముందుకు వస్తోంది 'ఎబౌట్ తెలుగు మీడియా'.. మీకు తెలిసిన సమాచారాన్ని పోస్ట్ చేయండి. ఈ బ్లాగ్ లో ప్రచురిస్తాం..