Friday, January 29, 2010

ఎన్-టీవీలో స్టింగు రంగడి వేధింపులు..

ఐ-న్యూస్ వదిలిపెట్టి ఎన్-టీవీలో చేరిన రాజశేఖర్ తన వెంట సొంత పటాలాన్ని తీసుకెళ్ళాడు. అప్పటికే అక్కడ కీలక స్థానాల్లో ఉన్న జర్నలిస్టులను ప్రాధాన్యత లేని స్థానాలకు బదిలీ చేసి తన వారినందరినీ నింపేశాడు. కొంత మంది పాత జర్నలిస్టులను నోటీసు కూడా ఇవ్వకుండా తొలగించేశారు. ఈ పరిణామాలు కొమ్మినేని శ్రీనివాస రావు లాంటి సీనియర్ జర్నలిస్టులకు మింగుడు పడకున్నా జాయమాన్య నిర్ణయాన్ని ఎదిరించలేక మౌనంగా తిలకిస్తున్నారు. స్టింగు రంగడి వేధింపుల నుండి తమను రక్షించాలని ఎన్-టీవీ జర్నలిస్టులు వేడుకుంటున్నారు.

జెమినిన్యూస్ చీఫ్ ఎడిటర్ గోవింద రెడ్డి

చుక్కాని లేని నావలా పయనిస్తున్న జెమిని న్యూస్ చానెల్ కు ఎడిటర్ గా సాక్షి టీవీ ఔట్ పుట్ ఎడిటర్ గా పని చేసున్న బి.టి.గోవింద రెడ్డి పేరు ఖాయమైందని తెలుస్తోంది. ఈ పోస్ట్ కోసం జెమిని పాత కాపులైన భావ నారాయణ, సతీష్ బాబు పేర్లు కుడ వినిపించాయి. సన్ నెట్ వర్క్ యాజమాన్యం మాత్రం జెమిని సీఈవో సంజయ్ రెడ్డి ప్రతిపాదనల మేరకు గోవింద రెడ్డి పేరు మాత్రమే పరిగణనలోకి తీసుకుంది. సంజయ్ ' రెడ్డి 'తో గోవింద ' రెడ్డి 'కి ఉన్న సన్నిహిత సంబంధాలే ఇందుకు కారణమని మీడియా వర్గాల సమాచారం. వీరికి 'జీ' టీవీలో పని చేస్తున్నప్పటి నుండి స్నేహ సంబంధాలు కొన సాగుతున్నాయి. గోవింద రెడ్డి వెంట జీ 24 క్రైం రిపోర్టర్ గౌసుద్దీన్ కూడా జెమినికి వస్తున్నాడు. గోవింద రెడ్డి వెంట జీ 24 క్రైం రిపోర్టర్ గౌసుద్దీన్ కూడా జెమినికి వస్తున్నాడు. ప్రస్తుతం గోవింద రెడ్డికి సాక్షిలో, గౌసుద్దీన్ కు జీ24లో కష్టకాలం మొదలైంది. అందుకే జీటీవీలో ఉన్నప్పుడు తనకు గన్ లైసెన్స్ ఇప్పించడంతో పాటు వ్యక్తిగత పనులు చేసిపెట్టిన కృతజ్ఞతతో సంజయ్ రెడ్డి వీరిద్దరికి జెమినిలో పునరావాసం కల్పిస్తున్నారని తెలుస్తోంది. ఆడవారంటే చొంగ కార్చుకునే గోవింద రెడ్డి, గౌసుద్దీన్ ల లీలలు మీడియా లోకంలో ఇప్పటికే ప్రసిద్దికెక్కాయి. గోవిందుడి లీలలపై జీ24 వైజాగ్ రిపోర్టర్ ఒక బహిరంగ లేఖనే రాశాడు. వీరిద్దరు తమ వెంట పెద్ద పటాలాన్నే జెమినికి తీసుకెళుతున్నట్లు సమాచారం. వీరి రాక సమాచారం తెలిసి జెమిని ఉద్యోగులు బిక్కు బిక్కుమంటున్నారు. ముఖ్యంగా మహిళలు...

జర్నలిస్టులకు గుణపాఠం

పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్లుగా ఎలాంటి పరిశోధన లేకుండా ఒక చానెల్ మరో చానెల్ను చూసి గుడ్డిగా వార్తలు ప్రసారం చేయడం అందరికీ తెలిసిందే. ఎక్కడో రష్యాలో ఉన్న ఒక నిషేధిత పత్రికకు చెందిన పొర్టల్ రాజశేఖర రెడ్డి మరణంపై అల్లిన కల్పిత వార్తను గుడ్డిగా ప్రసారం చేయడం ద్వారా రాష్ట్రంలొ విధ్వంసానికి కారణమైన మన టీవీ చానెళ్ళను చూసి ప్రజలు అసహ్యించుకున్నారు. ఇందులో తప్పెవరిదైనా జర్నలిస్టులను అరెస్ట్ చేయడం ఖండించాల్సిందే. ఈ సంఘటనలో అసలు కారకులను గుర్తించకుండా కేవలం జర్నలిస్టులపైనే కేసులు పెట్టడం అన్యాయమే.

జర్నలిస్టులకు ప్లాట్లు ఇక లేనట్లేనా?

అందరూ ఊహించినట్లే జర్నలిస్టుల ఇళ్ళ స్థలాల సమస్య త్రిశంకు స్వర్గంలో ఇరుక్కుంది. హైకోర్టు తీర్పుతో జర్నలిస్టుల ఇళ్ళ స్థలాల సమస్య మళ్ళీ మొదటికొచ్చింది. ఇంతకాలం ఇళ్ళ స్థలాలు వస్తాయని గంపెడాశలు పెట్టుకున్న జర్నలిస్టులకు నిరాశే మిగిలింది. ఈ తీర్పుపై సుప్రీం కోర్టుకు వెళ్ళే అవకాశం ఉన్నా తీర్పు ఎన్నేళ్ళకు వస్తుందో తెలియని పరిస్థితి ఉండటంతో జవహర్లాల్ నెహ్రూ జర్నలిస్ట్ హౌసింగ్ సొసైటీ ఇతర మార్గ్ల్లో పొరాటం మేయాలని నిర్ణయించింది. అయితే ఇంత కాలం లక్ష రూపాయలు ఇరుక్కున్నాయని భయ పడ్డ జర్నలిస్టులకు సొసైటీ వడ్డీతో సహా తిరిగి ఇచ్చేయటం ఊరట కలిగించే విషయం. ఆలస్యంగా అయినా సొసైటీ పాలక వర్గం సభ్యులందరితో సమాచేశం నిరవహించి అపొహలు దురం చేయడం మంచిదైంది. లేకపోతే సొసైటీ సొమ్మునంతా దివాళా తీసిన రాజస్థానీ కంపనీలో పెట్టి నిండా ముంచిందని మీడియా టైంస్ రాసిన తప్పుడు రాతల్ని నమ్మల్సి వ్చ్చేది. ఈ సమయంలో రాజశేఖర రెడ్డే ఉన్నుంటే వెంటనే ప్రత్యమ్నాయ మార్గల్లో జర్నలిస్టులకు ఇళ్ళ స్థలాలు ఇప్పించి ఉండేవారని జర్నలిస్టు మిత్రులు అంటున్నారు. తెలంగాణా ఉద్యమ నేపధ్యంలో ప్రస్తుత ముఖ్యమంత్రి ఈ విషయంలో ఇప్పట్లో విధాన పరమైన నిర్ణయం తీసుకునే అవకాశం కనిపించటం లేదు.

Sunday, January 24, 2010

తివారి సంగతి సరే.. మన కతేంటి?

ఎ.బి.ఎన్.ఆంధ్రజ్యోతి రాష్ట్ర గవర్నర్ ఎన్.డి.తివారి రాసలీలపై సాహసోపేతమైన వార్తను ప్రచారం చేసి ఆయన్ని సాగనంపడంలో సక్సెస్ అయింది. నిజంగా వారి పరిశోధన అద్భుతం. అయితే మన రాష్ట్ర మీడియాలో కూడా ఇలాంటి శృంగార పురుషులు ఉన్నారనేది అందరికీ తెలిసిన నగ్న సత్యం. మరి వారి లీలలు లోకానికి తెలియాల్సిన అవసరం లేదా?.. మీడియాలో మహిళ శీలాలతో ఆడుకుంటున్న నీచులు చాలా మందే ఉన్నారు. మీడియలో ఉద్యోగాలు ఇప్పిస్తామనో, మంచి బీట్లు ఇస్తామనో మహిళలను లోబరుచుకుంటున్న కొందరు ఘరానాల ఘన కార్యాలను వెలికి తీసే ' ఎబౌట్ తెలుగు మీడియా ' కృషికి సహకరించాల్సిందిగా మనవి.

సొమ్ము చేసుకున్న మీడియా

ఇళ్ళు కాలి ఒకడు ఏడుస్తుంటే చుట్టకు నిప్పు కోసం మరొకడు ప్రయత్నించాడట. తెలుగు మీడియాకు ఈ సామెత సరిగ్గా అతుకుతుంది. రాష్ట్రంలో తెలంగాణా, సమైక్యాంధ్ర ఉద్యమాల ంధ్య మీడియాలో చీలిక చాలా స్పష్టం. టీవీ చానళ్ళు, పత్రికలు రెండు ఉద్యమాలకు వెనుక నుండి చక్కని సహకారాని అందిస్తున్నాయి. ఇందులో ఎవరి స్వార్ధం వారికి ఉంది మరి. తెలంగాణా వస్తుందో, సమైక్యంధ్రే నిలుస్తుందో తెలియదు కానీ ప్రజల మధ్య విభేదాలు శాశ్వతంగా నిలవడానికి మీడియా దోహద పడుతోంది. సమైక్యాంద్ర ఉద్యమానికి మద్దతుగా లగడపాటి రాజగోపాల్ దగ్గర లక్షలాది రూపాయల యాడ్స్ రాబట్టిన టీవీ చానళ్ళు అంతకు ఎక్కువే ప్రచారం చేసి పెట్టి సమైక్య నేతలకు సహకారాన్ని అందించాయి. మరో వైపు మేచినేని శ్రీనివాస రావు కూ టీవీ ప్రకటనలతో చక్కని ప్రచారం లభించింది.

విడిపోయిన మీడియా..

తెలంగాణా ఉద్యమం తెలుగు మీడియాలో అంతులేని విభేదాలను సృష్టించింది. రాష్ట్ర జర్నలిస్టులు ప్రాంతాల వారిగా విడిపోయారు. హైదరాబాద్ జర్నలిస్టులో సాధారణంగా తెలంగాణా జర్నలిస్టులే అధికం సహజంగా వీరంతా ప్రాంతీయ మమకారంతో తెలంగాణా ఉద్యమానికి బాహటంగా మద్దతు ఇస్తారు. ఈ విషయం ఆంధ్రా, రాయలసీమ జర్నలిస్టులకు మింగుడు పడనిదిగా మారింది. తెలంగాణా జర్నలిస్టులు ప్రెస్ మీట్లలో సీమాంద్ర నాయకులను క్రాస్ క్వషన్లతో ఇబ్బంది పెడుతున్నారు. తమన్ అంటరానివారిగా చూస్తున్నారని సీమాంద్ర జర్నలిస్టులు వాపోతున్నారు. నిన్నటి దాకా మీదు మా ప్రాంతాన్ని, భాషను గేలి చేయలేదా, ఇప్పుడు కూడా మాపై ఆధిక్యత ప్రదర్షిస్తే ఎలా సహిస్తామని తెలంగాణా జర్నలిస్టులు ప్రష్నిస్తున్నారు. తెలంగాణా జర్నలిస్టులు తెలంగాణా జర్నలిస్టుల ఫోరం ఏర్పాటు చేసుకుంటే ప్రతిగా సీమాంధ్ర జర్నలిస్టులు సమైక్యంధ్ర జర్నలిస్టుల వేదికను పెట్టుకొని పని చేస్తున్నారు. తెలుగు జర్నలిస్టుల మద్య వచ్చిన చీలికను చూసి నేషనల్ మీడియా నవ్వుకుంటోంది. ఢిల్లీలో తెలుగు జర్నలిస్టులు కొందరు తమ తమ ప్రాంతాలకు అనుకూలంగా తమ వంతు లేబీయింగ్ నడుపుతూ కాంగ్రెస్ అధిస్టానానికి సమాచారాన్ని అందిస్తున్నారు. తెలుగు జర్నలిస్టుల మధ్య వచ్చిన ఈ చీలిక చాలా దురదృష్టకరం. జర్నలిస్టులు కుల, మత, వర్గ, ప్రాంత దృక్పదాలకు అతీతంగా వ్యవహరిసే సగం సమస్య పరిష్కారం అయినట్లే..