Sunday, January 24, 2010
విడిపోయిన మీడియా..
తెలంగాణా ఉద్యమం తెలుగు మీడియాలో అంతులేని విభేదాలను సృష్టించింది. రాష్ట్ర జర్నలిస్టులు ప్రాంతాల వారిగా విడిపోయారు. హైదరాబాద్ జర్నలిస్టులో సాధారణంగా తెలంగాణా జర్నలిస్టులే అధికం సహజంగా వీరంతా ప్రాంతీయ మమకారంతో తెలంగాణా ఉద్యమానికి బాహటంగా మద్దతు ఇస్తారు. ఈ విషయం ఆంధ్రా, రాయలసీమ జర్నలిస్టులకు మింగుడు పడనిదిగా మారింది. తెలంగాణా జర్నలిస్టులు ప్రెస్ మీట్లలో సీమాంద్ర నాయకులను క్రాస్ క్వషన్లతో ఇబ్బంది పెడుతున్నారు. తమన్ అంటరానివారిగా చూస్తున్నారని సీమాంద్ర జర్నలిస్టులు వాపోతున్నారు. నిన్నటి దాకా మీదు మా ప్రాంతాన్ని, భాషను గేలి చేయలేదా, ఇప్పుడు కూడా మాపై ఆధిక్యత ప్రదర్షిస్తే ఎలా సహిస్తామని తెలంగాణా జర్నలిస్టులు ప్రష్నిస్తున్నారు. తెలంగాణా జర్నలిస్టులు తెలంగాణా జర్నలిస్టుల ఫోరం ఏర్పాటు చేసుకుంటే ప్రతిగా సీమాంధ్ర జర్నలిస్టులు సమైక్యంధ్ర జర్నలిస్టుల వేదికను పెట్టుకొని పని చేస్తున్నారు. తెలుగు జర్నలిస్టుల మద్య వచ్చిన చీలికను చూసి నేషనల్ మీడియా నవ్వుకుంటోంది. ఢిల్లీలో తెలుగు జర్నలిస్టులు కొందరు తమ తమ ప్రాంతాలకు అనుకూలంగా తమ వంతు లేబీయింగ్ నడుపుతూ కాంగ్రెస్ అధిస్టానానికి సమాచారాన్ని అందిస్తున్నారు. తెలుగు జర్నలిస్టుల మధ్య వచ్చిన ఈ చీలిక చాలా దురదృష్టకరం. జర్నలిస్టులు కుల, మత, వర్గ, ప్రాంత దృక్పదాలకు అతీతంగా వ్యవహరిసే సగం సమస్య పరిష్కారం అయినట్లే..