Sunday, January 24, 2010
సొమ్ము చేసుకున్న మీడియా
ఇళ్ళు కాలి ఒకడు ఏడుస్తుంటే చుట్టకు నిప్పు కోసం మరొకడు ప్రయత్నించాడట. తెలుగు మీడియాకు ఈ సామెత సరిగ్గా అతుకుతుంది. రాష్ట్రంలో తెలంగాణా, సమైక్యాంధ్ర ఉద్యమాల ంధ్య మీడియాలో చీలిక చాలా స్పష్టం. టీవీ చానళ్ళు, పత్రికలు రెండు ఉద్యమాలకు వెనుక నుండి చక్కని సహకారాని అందిస్తున్నాయి. ఇందులో ఎవరి స్వార్ధం వారికి ఉంది మరి. తెలంగాణా వస్తుందో, సమైక్యంధ్రే నిలుస్తుందో తెలియదు కానీ ప్రజల మధ్య విభేదాలు శాశ్వతంగా నిలవడానికి మీడియా దోహద పడుతోంది. సమైక్యాంద్ర ఉద్యమానికి మద్దతుగా లగడపాటి రాజగోపాల్ దగ్గర లక్షలాది రూపాయల యాడ్స్ రాబట్టిన టీవీ చానళ్ళు అంతకు ఎక్కువే ప్రచారం చేసి పెట్టి సమైక్య నేతలకు సహకారాన్ని అందించాయి. మరో వైపు మేచినేని శ్రీనివాస రావు కూ టీవీ ప్రకటనలతో చక్కని ప్రచారం లభించింది.