Friday, January 29, 2010

జర్నలిస్టులకు ప్లాట్లు ఇక లేనట్లేనా?

అందరూ ఊహించినట్లే జర్నలిస్టుల ఇళ్ళ స్థలాల సమస్య త్రిశంకు స్వర్గంలో ఇరుక్కుంది. హైకోర్టు తీర్పుతో జర్నలిస్టుల ఇళ్ళ స్థలాల సమస్య మళ్ళీ మొదటికొచ్చింది. ఇంతకాలం ఇళ్ళ స్థలాలు వస్తాయని గంపెడాశలు పెట్టుకున్న జర్నలిస్టులకు నిరాశే మిగిలింది. ఈ తీర్పుపై సుప్రీం కోర్టుకు వెళ్ళే అవకాశం ఉన్నా తీర్పు ఎన్నేళ్ళకు వస్తుందో తెలియని పరిస్థితి ఉండటంతో జవహర్లాల్ నెహ్రూ జర్నలిస్ట్ హౌసింగ్ సొసైటీ ఇతర మార్గ్ల్లో పొరాటం మేయాలని నిర్ణయించింది. అయితే ఇంత కాలం లక్ష రూపాయలు ఇరుక్కున్నాయని భయ పడ్డ జర్నలిస్టులకు సొసైటీ వడ్డీతో సహా తిరిగి ఇచ్చేయటం ఊరట కలిగించే విషయం. ఆలస్యంగా అయినా సొసైటీ పాలక వర్గం సభ్యులందరితో సమాచేశం నిరవహించి అపొహలు దురం చేయడం మంచిదైంది. లేకపోతే సొసైటీ సొమ్మునంతా దివాళా తీసిన రాజస్థానీ కంపనీలో పెట్టి నిండా ముంచిందని మీడియా టైంస్ రాసిన తప్పుడు రాతల్ని నమ్మల్సి వ్చ్చేది. ఈ సమయంలో రాజశేఖర రెడ్డే ఉన్నుంటే వెంటనే ప్రత్యమ్నాయ మార్గల్లో జర్నలిస్టులకు ఇళ్ళ స్థలాలు ఇప్పించి ఉండేవారని జర్నలిస్టు మిత్రులు అంటున్నారు. తెలంగాణా ఉద్యమ నేపధ్యంలో ప్రస్తుత ముఖ్యమంత్రి ఈ విషయంలో ఇప్పట్లో విధాన పరమైన నిర్ణయం తీసుకునే అవకాశం కనిపించటం లేదు.