టీవీ-5 యాజమాన్య వైఖరికి విసిగిపోయిన శివ రామ ప్రసాద్ ఆ చానెల్ కు రాజీనామా చేశారు. గత కొద్ది నెలలుగా బి.ఆర్.నాయుడు, శివ రామ ప్రసాద్ ల నడుమ కోల్డ్ వార్ నడుస్తోంది. నాయుడు కొద్ది రోజులుగా శివ రామ ప్రసాద్ మాటకు విలువ ఇవ్వక పోగా క్రమశిక్షణ ఉల్లంఘనకు పాల్పడ్డ ఉద్యోగులను వెనుకేసుకు రావడం, ఎడిటోరియల్ విషయాల్లో అతిగా జోక్యం చేసుకోవడం శివ రామ ప్రసాద్ కు ఇబ్బందిగా మారిందని టీవీ-5 వర్గాలు చెబుతున్నాయి. బిజినెస్ బ్యూరో చీఫ్ వసంత్ విషయంలో తాజాగా జరిగిన గొడవే శివ రామ ప్రసాద్ రాజీనామాకు దారి తీసింది. నాయుడు పెత్తందారి ధోరణి పట్ల టీవీ-5లోని చాలా మంది జర్నలిస్టులు ఆగ్రహంతో ఉన్నారట. వారంతా ఇతర చానెల్లలో ఉద్యోగా కోసం ప్రయత్నిస్తున్నారని తెలిసింది. ఏ చానెల్ అయినా సింగిల్ స్టీరింగ్ తో నడవటం మంచిదని ఇందుమూలంగా తెలిసిన నీతి..
Friday, May 23, 2008
శివ రామ ప్రసాద్ రాజీనామా.. టీవీ-5లో సంక్షొభం..

'సీటీవీ'లో ఆకలి కేకలు
హైదరాబాద్ లో కేబుల్ టీవీ ప్రసారాలు అందించే ప్రముఖ చానెల్ సీటీవీ (గతంలో ఇన్ కేబుల్) గత మూడు నెలలుగా తమ జర్నలిస్టులకు జీతాలు ఇవ్వడంలేదు. రెండు నెలలకో సారి జీతాలు.. అదీ అర కొరా ఇవ్వడం సీటీవీలో మామూలే. కానీ ఏకంగా మూడు నెలల నుండి జీతాలు ఇవ్వకపోవడం సీటీవీ జర్నలిస్టులకు ఇబ్బంది కరంగా మారింది. జీతాలు ఇవ్వకపోవడంతో ఇంటి అద్దెలు చెల్లించలేక, ఇంట్లోకి అవసరమైన వెచ్చాలు కొనలేక నానా ఇబ్బందులు పడుతున్నామని సీటీవీ సిబ్బంది వాపోతున్నారు. అసలు ఈ దుస్థితి ఏమిటి? సీటీవీ యజమాని చౌదరి ఏమైనా నష్టాల్లో ఉన్నడా? నమ్మడం కష్టమే.. సీటీవీ సంస్థ మంచి లాభల్లోనే ఉంది. పైగా రాష్ట్రంలో ఏ ప్రభుత్వం ఉన్న పనులు చేసుకోవడంలో చౌదరి దిట్ట. తమ ఉద్యోగుల కష్ట సుఖాల్లో భూరి విరాళాలు ఇచ్చి ఆదుకుంటారని చౌదరి గారికి మంచి పేరుంది. చౌదరి గారు వెంటనే జీతాలు చెల్లించాలని, ఆకలి కేకల నుండి తమని రక్షించాలని సీటీవీ జర్నలిస్టులు కోరుతున్నారు.
Wednesday, May 14, 2008
Monday, May 12, 2008
జెమినిలో సమ్మె?
వేతనాల పెంపు విషయంలో తీవ్రంగా భంగపడ్డ జెమిని సిబ్బంది సమ్మెకు సిద్దమవుతున్నారు. జీతలు పెరుగుతాయని ఎంతగానో ఆశ పడ్డ జెమిని సిబ్బందికి సన్ యాజమాన్యం మొండి చేయి చూపింది. 100 శాతం.. కాదు 50 శాతం.. కాదు కాదు 30 శాతం అని వదంతులు సృష్టించి సిబ్బంది బయటకు వెళ్ళకుండా చేసిన జెమిని-సన్ యాజమాన్యం చివరకు 5 శాతమే జీతం పెంచాలని ప్రయత్నించగా ప్రతిఘటన ప్రారంభమైంది. దీనికి భయపడ్డ యాజమాన్యం జీతాల పెంపును తాత్కాలికంగా వాయిదా వేసుకుంది. సన్ గ్రూపులోని అన్ని ఛానెళ్ళదీ ఇదే సమస్యట. ఇక జీతాలు పెరగవు.. పెరిగినా పెద్ద మార్పు ఉండదని గ్రహించిన సన్ గ్రూపులోని అన్ని ఛానెళ్ల సిబ్బంది సమ్మెకు దిగే ప్రయత్నం చేస్తున్నారు. మన రాష్ట్రానికి చెందిన జెమిని, జెమిని న్యూస్, తేజ సిబ్బంది కూడా సమ్మెకు సిద్ద మవుతున్నారు. సిబ్బంది మూకుమ్మడి సెలవు పెట్టడమో, లేదా ధర్నాకు దిగడమో, నల్ల బ్యడ్జీలు ధరించి విధులకు హాజరు కావడమో.. ఏ రూపంలో అయినా ఈ సమ్మె జరిగే అవకాశం ఉంది. అవసరమైతే కార్మిక సంఘాల మద్దతు తీసుకొని లేబర్ కోర్టును ఆశ్రయించాలని కొదరు సిబ్బంది ప్రణాలికలు తయారు చేస్తున్నారట.అయినవారికి కంచాల్లో..
తన ఉద్యోగుల జీతాల పెంపు విషయంలో సన్ వర్గాలను ఒప్పించడంలో విఫలమైన జెమిని ఎం.డి. కిరణ్ తన వారు అనుకున్న వారికి మాత్రం వ్యక్తిగతంగా నగదు ఇస్తున్నారని వినికిడి. ఇలా కొందరు ఉద్యోగులకు మాత్రమే ఇవ్వడం వివాదాస్పదంగా మారింది. ఈ ధోరణి ఉద్యోగుల మధ్య మనస్పర్ధలకు దారి తీస్తోంది. కొందరికి మాత్రమే ఇలా చెల్లించడంలోని ఆంతర్యం ఏమిటి? మిగతావారేం పాపం చేశారు? విభజించి పాలించడం అంటే ఇదేనా?
maaరింది.. బాగుంది..
ఇటీవలే మారిన మాటీవీ లోగో విషయంలో సర్వత్రా చర్చ జరుగుతోంది. నాగార్జున, చిరంజీవిల నిర్వహణలో మాటీవీ కొత్త పుంతలు తొక్కగలదని మీడియా వర్గాలు భావిస్తున్నాయి. లోగో మార్చుకున్న మాటీవీ ఇప్పుడు వినూత్న కార్యక్రమాలు అందించటంపై దృష్టి పెట్టింది. మాటీవి త్వరలోనే జెమిని, ఈటీవీ ఛానెళ్ళకు గట్టి పోటీ ఇచ్చే అవకాశం ఉంది. మారిన మాటీవీ లోగొ బానే ఉంది కానీ రంగులే మబ్బుగా ఉన్నాయి. వార్తా సేకరణకు వచ్చే రిపోర్టర్లు పట్టుకునే మైకుల లోగోలు మరీ పెద్దగా ఉండి ఎబ్బెట్టుగా ఉన్నాయి. ఇవి చిన్నగా మారిస్తే బాగుంటుంది.
Subscribe to:
Posts (Atom)