Saturday, November 20, 2010

కసాయి పాలన.. దుర్మార్గం..

సన్ సంస్థ ఎలా నమ్మి వెంకట సత్యనారాయణ అలియాస్ సాయిని జెమిని న్యూస్ ప్రిన్సిపల్ ఎడిటర్గా పెట్టుకుందో దేవుడెరుగు.. అతడి ఆగడాలు భరించలేని స్థితిలో ఉన్నాయి. ఈ మిడిమిడి మేధావి తనకు తోడు మరో మహా మేధావిని తెచ్చి పెట్టుకున్నాడు. మార్గం లక్ష్మీ నారాయణ అనే ఇతగాడు జర్నలిజంలో చాల జూనియర్.. ఒక సాధారణ సబ్ ఎడిటర్ ను పట్టుకొచ్చి అవుట్ పుట్ ఎడిటర్ను చేసేసారు. నిజమే.. జెమినిలో ఏదైనా సాధ్యమే. ఆఫ్ట్రాల్ రిపోర్టర్ సాయి ఏకంగా న్యూస్ హెడ్ కాగా లేనిది.. మార్గం అవుట్ పుట్ ఎడిటర్ కావడంలో ఆశ్చర్యం ఏముంది బ్రదర్. సాయి లాగే ఆముదం తాగిన ముఖంతో కనిపించే మార్గం, సీనియర్, జూనియర్ అనే తేడ లేకుండా తోటి ఉద్యోగులతో చాల అమర్యాదకరంగా ప్రవర్తిస్తున్నాడని జెమిని వర్గాలు వాపోతున్నాయి. చిటికెలు వేస్తూ ఏకవచనంతో తోటి జర్నలిస్టులపై రంకెలు వేస్తూ అరిచే ఇతగాడికి ' దుర్మార్గం ' అనే పేరు స్థిర పడిపోయింది.
ఇక మన కసాయి గారి విషయానికొద్దాం.. సీనియర్లను వెళ్ళగొట్టి తన బ్రాండ్ జర్నలిస్టులను తెచ్చుకోవడానికి సాయి తెగ కష్ట పడుతున్నాడు. ఇటీవల ఫెర్ఫార్మెన్స్ అప్రైసల్ పేరిట పెద్ద ప్రహసనమే జరిగింది. తన వర్గానికి మంచి మార్కులు వేసి, అంతకన్నా మంచిగా పని చేసే వారికీ నామ మాత్రం మార్కులు వేసి యాజమాన్యానికి పంపాడు. ఫలితంగా దీపావళి బోనస్లో చాలా మందికి అన్యాయం జరిగి పోయింది. జెమిని టీవీలో నడుస్తున్న గుడ్డి దర్బారుకు ఈ ఫెర్ఫోర్మన్స్ అప్రైసల్ చక్కని ఉదాహరణ. ఇక యాంకర్ల విషయంలో సాయి ప్రవర్తనపై చాలా పిర్యాదులు ఉన్నాయి. సునితమైన ఈ అంశంపై ఎక్కువగా రాయడం బాగుండదని ఇంతటితో వదిలేస్తున్నాం..
తాజా వార్త .. టి.టి.డి. సేవ కుంభకోణంలో ఉన్న సాయి.. ఈ కేసు నుండి బయట పడేందుకు పెద్ద ఎత్తున ప్రయత్నాలను ప్రారంభించాడు. ఇందులో భాగంగా తన పరపతితో విజిలెన్స్ నివేదికను ప్రభావితం చేసే ప్రయత్నాల్లో ఉన్నాడని సమాచారం. మరిన్ని కసాయి వార్తలు త్వరలో..