Saturday, November 20, 2010

మీకిది తగునా బాబు..

ఒకప్పుడు మీడియాను నియంత్రించిన చందబాబు నాయుడు, జర్నలిస్టులను పురుగుల్ల చూసే వారని చెబుతుంటారు. ప్రెస్ మీట్లో తనను వేలెత్తి ప్రశ్నించిన రిపోర్టర్ల ఉద్యోగాలు ఊడగొట్టిమ్చిన సందర్బాలు గతంలో చాల ఉన్నాయి. అందుకే ఆయనకు జర్నలిస్తులంటే చులకన భావం సహజం తాజాగా తన కుమారునితో పెట్టించిన టీవీ ఛానల్ ' స్టూడియో ఎన్ ' లో జర్నలిస్టులను అన్యాయంగా ఉద్యోగంలో నుండి తీసేసినా పట్టించుకోవడం లేదు. స్టూడియో -ఎన్ లో ఉద్యోగాలుఊడిపోయి రోడ్డున పడ్డ జర్నలిస్టు పరిస్థితి చాల దీంగా ఉంది. నిన్నటి దాక అయ్యో.. అని సానుభూతి వ్యక్తం చేసిన వారు ఇప్పుడు కూడా ఏమి చేయలేక మిన్నకుండి పోయారు. ప్రతి నిత్యం అందోళన చేయటం అంటే ఖర్చుతో కూడిన వ్యవహారం. ఫలితంగా చేసేదేమీ లేక ఉద్యోగాలు పోయిన స్టూడియో ఎన్ జర్నలిస్టులు పస్తులతో, అప్పులతో భారంగా జీవితం వెల్ల దీస్తున్నారు. బయట అవకాశాలు అంతంత మాత్రంగానే ఉన్నాయి. ఉద్యోగం కోల్పోయిన స్టూడియో ఎన్ ఉద్యోగుల విషయంలో జర్నలిస్టు సంఘాలు అంతంత మాత్రం ఉద్యమాలు చేసి చేతులు దులుపుకున్నాయి. అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కూడా వీరిని పెద్దగా పట్టించుకోలేదు. ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు గారు పెద్ద మనసు చేసుకొని వారికి తిరిగి ఉద్యోగాలు ఇప్పిస్తే ఆయన ప్రతిష్ట మరింత ఇనుమడిస్తుంది.