చానెళ్ళు ప్రారంభించడం.. ప్రారంభించగానే లేదా ప్రారంభానికి ముందే తప్పుకోవడం శివరామకృష్ణకు బాగా తెలుసు. సీనియర్ జర్నలిస్టు శివరామకృష్ణ అధ్వర్యంలో.. కొందరు పెద్ద పారిశ్రామిక, రాజకీయ నాయకుల సహకారంతో ప్రారంభం కానున్న చానెల్ 4 గురించి జర్నలిస్ట్ వర్గాలు ఆసక్తిగా చర్చించు కుంటున్నాయి. జర్నలిస్టులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితిలో మూతపడ్డ హెచ్.వై. టీవిని కొనుగోలు చేసి చానెల్ 4 గా మారుస్తున్నారు. ఇప్పటికే రిక్యుట్మెంట్లు పూర్తీ అయ్యాయి. దసరాకు చానెల్ 4 ప్రారంభం అయ్యే అవకాశం ఉంది. అయితే చానెల్ 4 లో జీతాలు పెద్దాగా ఇవ్వట్లేదని వినికిడి. అసలు చానెల్ 4 కు ఈ పేరు ఎందుకు పెట్టినట్లో?.. ఇప్పటికే ఈ చానెల్ 4 పేరుతో బ్రిటన్లో ఒక టీవీ చానెల్ నడుస్తోంది. అదే పేరును ఎక్కడ వాడటం వల్ల ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. గతంలో టీవీ 5 విషయంలోనూ ఇదే గందర గోళం ఉందని ఎబౌట్ తెలుగు మీడియా హెచ్చరించడం.. అది నిజం కావడం ఈ సందర్భంగా గుర్తుకు తెచ్చుకోవలసిన అవసరం ఉంది.
ఎనీ హవ్.. విష్ యు అల్ ది బెస్ట్ చానెల్ 4 ..