Thursday, September 23, 2010
ఉద్యోగులను సాగనంపుతున్న చానెళ్ళు
న్యాయం చేయడంలో విఫలం అయ్యారు. అసలు ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టుల సంఘం అధ్యక్షుడు ఎవరు? హరి ప్రసాదా? జనార్ధనా? ప్రస్తుతం ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులు గడ్డు రోజుల్ని ఎదుర్కొంటున్నారు. టీవీ చానెల్స్ ఉద్యోగాల్లో కోత విధించే పనిలో పడ్డాయి. ఖర్చులు తగ్గించు కోవడంలో భాగంగా సీనియర్లను సాగనంపి, వారి స్థానంలో కొత్తవారిని తక్కువ జీతాలకు తీసుకుంటున్నాయి. ఎక్కడా కార్మిక చట్టాలు అమలు కావడం లేదు. జర్నలిస్టు సంఘాలు నిద్ర నటిస్తూ వీరిని పట్టించు కోవడం లేదు. ముఖ్యంగా ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టుల సంఘం నాయకులు అంతర్గత కుమ్ములాటలతో పైరవీలు చేసుకోవడానికే పరిమితం అవుతూ.. ఉద్యోగాలు పోయిన జర్నలిస్టులకు న్యాయం చేయడం లేదు. అసలు ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్ట్ సందం అధ్యక్షుడు ఎవరు? హరిప్రసాదా? జనార్ధనా? వారికే సరిగ్గా తెలియదు.