Sunday, January 27, 2008

ఏమిటీ రాతలు?..

ఇటీవల 'ఎబౌట్ తెలుగు మీడియా' లోని కామెంట్ బాక్సుల్లో వస్తున్న రాతలు ఆశ్చర్యాన్నీ, ఇబ్బందినీ కలిగిస్తున్నాయి. మేమేదో ఎవరికో వత్తాసు పలుకుతున్నట్లు, వారు అందించే సమాచారాన్ని ప్రచురించటం లేదని రాస్తున్నారు? మాకు వస్తున్న సమాచారాన్ని నిర్ధారించుకోకుండా ఎలా ప్రచురించగలం? 'ఎబౌట్ తెలుగు మీడియా' ఎవరికీ వత్తాసు పలకదు. మేం అనవసరంగా ఎవరిపైనా బురద చల్లబోం, అవినీతిపరుల్ని, తోటి జర్నలిటులకు ఇబ్బంది కలిగించే వారిని మాత్రమే ఉతికి ఆరేస్తాం అని గతంలోనే స్పష్టంగా ప్రకటించిన విషయాన్ని ఒకసారి గుర్తుతెచ్చుకోండి. మా వైఖరి అప్పటికీ, ఇప్పటికీ, ఎప్పటికీ మారబోదు. మరో విషయం.. 'ఎబౌట్ తెలుగు మీడియా' కామెంట్ బాక్సుల్లో స్వేచ్చా భావ ప్రకటన ఉండాలని మేం కోరుకుంటున్నాం. అందుకే సాధ్యమైనంత వరకు మేం వాటిని ఎడిట్ చేయటం లేదు. ఈ సదుపాయాన్ని ఆసరాగా తీసుకొని కొందరు అశ్లీల రాతలు, మహిళలను కించపరిచే రాతలు చొప్పిస్తున్నారు. ఈ రాతలకు మేం ఎంతమాత్రం బాధ్యులం కాదు, కామెంట్ బాక్సుల్లో వచ్చేవి వారి వ్యక్తిగతం. 'ఎబౌట్ తెలుగు మీడియా' వాటితో ఏకీభవించాల్సిన అవసరం లేదని స్పష్టం చేస్తున్నాం.

దూసుకొస్తున్న ' సాక్షి '

తెలుగు నాట మరో సంచలన దిన పత్రికగా ఆవిర్భవిస్తున్న ' సాక్షి ' పై సర్వత్రా చర్చ జరుగుతోంది. రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖర రెడ్డి కుమారుడైన జగన్ మోహన్ రెడ్డి దిన పత్రికను ప్రారంభించడమే ఈ చర్చకు కారణం. జగన్ సారధ్యంలో, పతంజలి ప్రధాన సంపాదకుడుగా 19 ఎడిషన్లతో వస్తున్న ' సాక్షి ' ఫిబ్రవరి నెలాఖరులో ప్రధానమంత్రి చేతుల మీదుగా విడుదలవుతున్నట్లు సమాచారం. జర్నలిస్టులకు భారీ జీతాలు ఆఫర్ చేసిన సాక్షి, ప్రధాన దిన పత్రికలను వణుకు పుట్టిస్తోంది. తమ జర్నలిస్టులు చేజారకుండా కాపాడుకోవడానికి ఈనాడు, ఆంధ్రజ్యోతి దినపత్రికలు ఇప్పటికే రెండు మూడు సార్లు జీతాలు పెంచక తప్పలేదు. ఎలక్ట్రానిక్ మీడియాలో టీవీ-9 లాగే ప్రింట్ మీడియాలో సాక్షి జర్నలిస్టుల విలువ పెంచింది. కొత్త ఛానెళ్ళు, దినపత్రికల రాకతో తెలుగు మీడియా సిబ్బంది సైతం ఐటి ఉద్యోగుల్లా మంచి జీతాలు పొందే రోజులొచ్చాయి. అన్ని పేజీలు రంగుల్లో రానున్న ' సాక్షి ' బాటలోనే ఇతర దినపత్రికలు వెళ్ళక తప్పదు. సాక్షి గురి ప్రధానంగా ఈనాడు, ఆంధ్రజ్యోతిల పైనే అని ప్రతేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ' ఆ ' రెండు పత్రికలపై గుర్రుగా ఉన్న ముఖ్యమంత్రికి సొంత దినపత్రిక ' సాక్షి ' రావడం అన్నివిధాలా సరికొత్త బలాన్ని తెచ్చి పెడుతుంది.

Sunday, January 20, 2008

కేబుల్ ఆపరేటర్లను భయపెడుతున్న ' సన్ డైరెక్ట్ '

వినియోగదారులు ఎప్పటి నుండో ఎదురు చూస్తున్న సన్ నెట్ వర్క్ వారి డిటిహెచ్ సర్వీస్ 'సన్ డైరెక్ట్' చాలా సైలెంట్ గా రాష్ట్రంలోకి ప్రవేశించింది. తమిళ నాడులో ఏకచత్రాధి పత్యంగా నడుస్తున్న తమ సుమంగళి కేబుల్ విజన్ కు ఎనాటికైనా ముప్పుతప్పదని భావించిన మారన్ బ్రదర్స్ డిటిహెచ్ సర్వీసులు ప్రారంభించాలని మూడేళ్ళ క్రితమే ప్రణాళికలు తయారు చేసుకున్నారు. ఈలోగా దినకరన్ వివాదంతో కరుణానిధికి మారన్ సొదరులు దూరమయ్యారు. ఇదే అదనుగా కరుణానిధి కేబుల్ సర్వీసులను ప్రభుత్వం స్వాధీనం చేసుకునేలా జయలలిత ప్రభుత్వం తెచ్చిన ఆర్డినెన్స్ ను చట్టబద్దం చేసేశారు. మారన్ సోదరులు యుద్ద ప్రాతిపదికన 'సన్ డైరెక్ట్' డిటిహెచ్ సర్వీసులను నాలుగు దక్షిణాది రాష్ట్రాల్లో ప్రారంభించారు.
డిష్ రూ.1999/- + నెల అద్దె రూ 75/- ( ఏడాది పాటు ఫ్రీ)

'సన్ డైరెక్ట్' కేవలం 1999 రూ.లకే వినియోగదారులకు అందిస్తున్నారు. నేలు 75 రూ.లకే 75 టీవీ ఛానెళ్ళు, 15 రేడియో చానెళ్ళు ఇవ్వడం సన్ డైరెక్త్ ప్రత్యేకత. పైగా ఏడాది పాటు నెలవారి బిల్స్ ఉండవు. రాష్ట్ర మార్కెట్లో ఇప్పటికే అందుబాటులో ఉన్న టాటా స్కై, డిష్ టీవీ, డిడి డైరెక్ట్ డిటిహెచ్ సర్వీసులకన్నా 'సన్ డిరెక్ట్' చాలా చౌక.

ఆందోళనలో కేబుల్ ఆపరేటర్లు

తమ ఉపాధికి ముప్పుగా మారిన సన్ డైరెక్ట్ సర్వీసులపై కేబుల్ ఆపరేటర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ఒకసారి హైదరాబాద్ లోని జెమిని టీవీ ఆఫీస్ ముందు ఒక రోజంతా ధర్నా జరిపారు. జెమిని, జెమిని న్యూస్, జెమిని మ్యూజిక్, తేజ ఛానెళ్ళను పే ఛానెళ్ళుగా మార్చి తమ నుండి కోట్లాది రూపాయలు ముక్కు పిండి వసూలు చేస్తున్న సన్ గ్రూప్, సొంతంగా ప్రారంభించిన డిటిహెచ్ సర్వీస్ ను చౌకగా ఇవ్వడంలోని ఆంతర్యాన్ని వారు ప్రశ్నిస్తున్నారు.

మరో ఈస్టిండియా కంపనీ 'సన్ గ్రూప్'

ఆంగ్లేయులు మన దేశంలోకి ఈస్టిండియా కంపనీ ముసుగులో వచ్చి ఇక్కడి వ్యాపారాలన్నింటినీ దివాళా తీయించి సంపదను తమ దేశానికి తరలించుకు పోయిన వైనాన్ని మనం చరిత్రలో చదువుకున్నాం. టీవీ ఛానెళ్ళు, కేబుల్ - డిటిహెచ్ వ్యాపారాల విషయంలో సన్ గ్రూప్ మన రాష్ట్రంలో ఇదే విధానాన్ని అవలంభిస్తోందనే విమర్శలున్నాయి. తమిళనాడులో తమ ఛానెళ్ళను ఉచితంగా అందిస్తున్న సన్ నెట్ వర్క్, ఆంధ్ర ప్రదెశ్ లో మాత్రం పే ఛానెళ్ళ పేరిట ఆపరేటర్ల వద్ద కోట్లాది రూపాయల్ని జబర్దస్తీగా వసూలు చేస్తోంది. ఇప్పుడు 'సన్ డైరెక్ట్' పేరిట ఏకంగా కేబుల్ ఆపరేటల ఉపాధినే దెబ్బ తీస్తోంది. తమ తమిళ ఛానెళ్ళ సిబ్బందికి భారీగా జీతాలు ఇచ్చే సన్ గ్రూప్ తెలుగు ఛానెళ్ళ ఉద్యోగులకు మాత్రం ముష్టి జీతాలు విదులుస్తోంది. ఇతర తెలుగు ఛానెళ్ళతో పోలిస్తే ' జెమిని ' ఉద్యోగుల వేతనాలు నీచాతి నీచం. ఇదేమి వివక్షత? ఆంధ్రా మార్కెట్ నుండి కొల్లగొట్టుకు పోతున్న సంపదతో మారన్ సోదరులు విమానయాణ, హోటల్ వ్యాపారాలను పెద్దగా విస్తరిస్తున్నారు. కాని జెమిని ఉద్యోగుల జీతాలను మాత్రం పెంచటక పోవడం ఏం న్యాయం?

Wednesday, January 9, 2008

సిబిసి ఇక రాదా?

ఇదిగో వస్తుంది.. అదిగో వస్తుంది.. అంటూఅ చెప్పుకున్న సిబిసి చానెల్ ఇక రాదని రూడీ అయింది. కొద్ది నెలలుగా ప్రెస్ మీట్లు, ప్రోగ్రాం లకు మైకులు పట్టుకొని వచ్చి హంగామా చేసిన సిబిసి జర్నలిస్టులకు ఇక తమ చానెల్ వచ్చే అవకాశం లేదని తెలిసి ఇతర చానెళ్ళలో ఉద్యోగాలు వెతుక్కుంటున్నారు. తెలుగుగులో పెద్ద ఎత్తున పెట్టుబడులతో రానున్న న్యూస్ చానెళ్ళ ముందు పోటీ పడలేమని తెలిసే సదరు యాజమాన్యం చానెల్ ప్రతిపాదన విరమించుకున్నాట్లు బోగట్టా.

సిబిసి ఇక రాదా?

ఇదిగో వస్తుంది.. అదిగో వస్తుంది.. అంటూఅ చెప్పుకున్న సిబిసి చానెల్ ఇక రాదని రూడీ అయింది. కొద్ది నెలలుగా ప్రెస్ మీట్లు, ప్రోగ్రాం లకు మైకులు పట్టుకొని వచ్చి హంగామా చేసిన సిబిసి జర్నలిస్టులకు ఇక తమ చానెల్ వచ్చే అవకాశం లేదని తెలిసి ఇతర చానెళ్ళలో ఉద్యోగాలు వెతుక్కుంటున్నారు. తెలుగుగులో పెద్ద ఎత్తున పెట్టుబడులతో రానున్న న్యూస్ చానెళ్ళ ముందు పోటీ పడలేమని తెలిసే సదరు యాజమాన్యం చానెల్ ప్రతిపాదన విరమించుకున్నాట్లు బోగట్టా.

సిబిసి ఇక రాదా?

ఇదిగో వస్తుంది.. అదిగో వస్తుంది.. అంటూఅ చెప్పుకున్న సిబిసి చానెల్ ఇక రాదని రూడీ అయింది. కొద్ది నెలలుగా ప్రెస్ మీట్లు, ప్రోగ్రాం లకు మైకులు పట్టుకొని వచ్చి హంగామా చేసిన సిబిసి జర్నలిస్టులకు ఇక తమ చానెల్ వచ్చే అవకాశం లేదని తెలిసి ఇతర చానెళ్ళలో ఉద్యోగాలు వెతుక్కుంటున్నారు. తెలుగుగులో పెద్ద ఎత్తున పెట్టుబడులతో రానున్న న్యూస్ చానెళ్ళ ముందు పోటీ పడలేమని తెలిసే సదరు యాజమాన్యం చానెల్ ప్రతిపాదన విరమించుకున్నాట్లు బోగట్టా.

Tuesday, January 8, 2008

ఎలక్ట్రానిక్ మీడియా హౌసింగ్ సొసైటీ గూడు పుఠాని

ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టుల హౌసింగ్ సొసైటీలో జరుగుతున్నదేమిటో ఎవరికీ అంతుచిక్కడం లేదు. ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులకు జూబ్లీహిల్స్ హౌసింగ్ సొసైటీ సభ్యత్వం ఇవ్వడానికి నిరాకరించడంతో ఏర్పాటైన ఈ సొసైటీ తన ప్రాథమిక లక్ష్యాలకే వ్యతిరేకంగా పని చేస్తోంది. పేరుకు ఎలక్ట్రానిక్ మీడియా హౌసింగ్ సొసైటీ అయినా ఇందులో ప్రింట్ మీడియా నుండి ఎలక్ట్రానిక్ మీడియాలోకి కొత్తగా వచ్చిన వారి పెత్తనమే కొనసాగుతోంది. ఇళ్ళ స్థలాల కోసం దరఖాస్తు చేసుకున్న జర్నలిస్టులలో అర్హులను గుర్తించేందుకు ఈ సొసైటీ ఇటీవల భారీ కసరత్తే చేసింది. హౌసింగ్ సొసైటీ సభ్యత్వం కోసం కనీసం మూడేళ్ళు ఎలక్ట్రానిక్ మీడియాలో పనిచేసి ఉండాలనే నిబంధన పెట్టారు. ఇళ్ళ స్థలాల కోసం సీనియారిటీని నిర్ణయించే జాబితాను తయారు చేసే క్రమంలో ప్రింట్ మీడియా నుండి కొత్తగా వచ్చిన వారు అధికంగా లబ్ది పొందే అవకాశం కనిపించడంతో ఎలక్ట్రానిక్ మీడియాలో చాలా కాలంగా పని చేస్తున్నవారి ప్రయోజనాలను కాపాడేందుకు ' పాయింట్ల ' విధానాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఈ పద్దతిలోనే స్క్రూటినీ జరిగింది. కానీ ఇళ్ళ స్థలాల అర్హుల జాబితాను ఇప్పటి వరకూ విడుదల చేయలేదు. హౌసింగ్ సొసైటీ అధ్యక్ష, కార్యదర్శులు పాయింట్ల పద్దతిని పక్కన పెట్టి, ప్రింట్ మీడియా సీనియారిటీ ప్రకారం జాబితా తయారు చేసి ప్రభుత్వానికి సమర్పించారని తెలుస్తోంది. ఎవరు జాబితా అడిగినా సొసైటీ నోరు మెదపక పోవడం పలు అనుమానాలకు ఆస్కారం ఇస్తోంది. హౌసింగ్ సొసైటీ డైరెక్టర్ల సమావేశం కూడా ఇప్పటివరకూ జరపక పోవటంలోని మతలబు ఏమిటి? అసలు స్క్రూటినీ జరిగిన తీరే గందరగోళంగా ఉంది. నిబంధనలకు భిన్నంగా కొందరు యాంకర్లకు సభ్యత్వం ఇవ్వడం వివాదాస్పదంగా మారింది. కొందరు జర్నలిస్టులు సీనియారిటీ కోసం బోగస్ సర్టిఫికెట్లు దాఖలు చేసినా పట్టించు కోలేదు. కొన్ని ఛానెళ్ళ సీఈవోలు,ఎడిటర్లు,బ్యూరోచీఫ్ లు తమకు బాగా కావాల్సిన వారికి ఉదారంగా సర్టిఫికెట్లు ఇచ్చినా వాటిపై దర్యాప్తు జరగలేదు. జాబితా విడుదల చేస్తే ఈ లొసుగులన్నీ బయట పడతాయని ఎలక్ట్రానిక్ మీడియా హౌసింగ్ సొసైటీ అధ్యక్ష, కార్యదర్శులు భయపడుతున్నారా?

టీవీ-5లో కుల రాజకీయాలకు భాస్కర్ బలి

టీవీ-5లో వెర్రి తలలు వేస్తున్న కుల రాజకీయాలకు ఆ ఛానెల్ బ్యూరో చీఫ్ భాస్కర్ బలి అయ్యాడు. ఇది అత్యంత జిగుస్సాకరమని స్వయానా ఆ ఛానెల్ వారే అంటున్నారు. టీవీ-5లో తనకు తాను అపర మేధావినని భావించే సుబ్బారావు అనే టిడిపి బీట్ రిపోర్టర్ ఆడిన క్రూర రాజకీయాలకు చెక్ పెట్టే ప్రయత్నం చేయడమే భాస్కర్ చేసిన నేరం. సుబ్బారావు వ్యవహారాలు తెలిసిన టీవీ-5 యాజమాన్యం ఒక దశలో అతన్ని సస్పెండ్ చేసింది. అయితే కుల లాబీని అడ్డు పెట్టుకొని తిరిగి వచ్చిన సుబ్బారావు ఏకంగా భాస్కర్ కే పొగ పెట్టాడని ఆ ఛానల్ వర్గాల బోగట్టా.. సదరు సుబ్బారవు గారికి 'ఈనాడు టు ఆంధ్రజ్యోతి టు ఎన్-టీవీ టు టీవీ-5'కు వచ్చిన ఓ సీనియర్ జర్నలిస్ట్ సామాజిక మద్దతు పుష్కలంగా ఉందిట. తప్పుడు వార్తలు ఇవ్వడంలో దిట్ట అయిన సుబ్బారావు వ్యవహార శైలిపై టీడీపీ బీట్ రిపోర్టర్లు, ఆ పార్టీ నేతలు కథలు కథలుగా చెప్పుకుంటుంటారు. ఇద్దరు మహిళా జర్నలిస్టులతో క్లోజ్ గా తిరిగే సుబ్బారవు తన ప్రేమను చాటుకునేందుకు అర చేయి కూడా కోసుకున్నాడట(?)

టి-టీవి కి దరఖాస్తు చేసుకోండి..



' టి-టీవి ' గురించి 'ఎబౌట్ తెలుగు మీడియా' రాసిన రెండు రోజులకే ఆ ఛానెల్ యాజమాన్యం పత్రికల్లో ఇచ్చిన ప్రకటన ఇది. టి-టీవి రావడానికి మరో ఆరు నెలలైనా పడుతుందని ఈ ప్రకటనని గమనించిన వారికి అర్థం అవుతుంది. ఆసక్తి గలవారు దరఖాస్తు చేసుకోవచ్చు.