Monday, July 19, 2010

ఆ రెండు కోట్ల కథేంటి?

హైదరాబాద్ జర్నలిస్ట్ వర్గాల్లో ఇప్పుడు హాట్ టాపిక్ ఇదే. ఒక చానెల్ కు చెందిన ఘరానా రిపోర్టర్ ఒక భూమి వివాదం సెటిల్ చేయించడానికి రెండు కోట్ల రూపాయల ఒప్పందం కుదుర్చుకున్నాడట. ఈ వ్యవహారం ఎక్కడో బెడిసి సదరు చానెల్ యాజమాన్యానికి తెలిసిపోయింది. ఎవరో వీడియో తీసి సీడీలు వారికీ పంపారట. సదరు యాజమాన్యం వారు వెంటనే ఈ రిపోర్టర్ చేత రిజైన్ చేయించారు. వారం రోజుల్లో ఈ కారణ జన్ముడికి మరో చానెల్లో ఏకంగా చీఫ్ ఎడిటర్ ఉద్యోగం దొరికింది. ఈ వాస్తవ కథలో పాత్రల పేర్లు సాయి, టీవీ-9 , జెమిని.. మరో మూడు మీడియా సంస్థల రిపోర్టర్ ల పేర్లు కూడా ఈ వ్యవహారంలో వినిపించినా, వారికి ఏ పాపం తెలియదని అందరు నమ్ముతున్నారు (?) జెమిని సంస్థ ఇంత సచ్చీలుడికి అంత పెద్ద ఉద్యోగం ఇవ్వడం లోని మతలబు ఏమిటో? అసలు జెమిని యాజమాన్యం ఇతగాడి గత చరిత్ర తెలుసుకొనే ఉద్యోగం ఇచ్చింద?
టీవీ 9 కు మాధవ్ రాజీనామా
టీవీ - 9 కు మరో షాక్. సీనియర్ జర్నలిస్ట్ మాధవ్ ఆ చానెల్కు రాజీనామా ఇచ్చేశాడు. జెమినిలో చేరడానికే రాజీనామా చేశాడని తెలిసింది. రవిప్రకాష్ నమ్మిన బంటు మాధవ్ రాజీనామాకు కారణం ఏమిటి? గతంలో రెండు సార్లు జెమినిలో పని చేసి అవమానకర పద్దతిలో రాజీనామా చేసిన మాధవ్ మళ్ళీ ఆ చానెల్లో ఎందుకు? చేరుతున్నాడు? నిజం నిలకడ మీదే తెలియాలి. మరో వైపు ఇటీవలే టీవీ 9 నుండి బయటకు వచ్చిన ఆలపాటి సురేష్, రవిప్రకాష్ మరో నమ్మిన బంటు గంగాధర్ కూడా జెమినిలో చేరుతున్నట్లు ప్రచారం జరుగుతోంది?

భారీ పెట్టుబడితో మరో కొత్త న్యూస్ ఛానల్

తెలుగులో మరో కొత్త న్యూస్ ఛానల్ రాబోతోంది. ఉత్తరాదికి చెందిన ఒక రియల్ ఎస్టేట్ సంస్థ తెలుగులో ఛానల్ పెట్టాలని ప్రయత్నిస్తోంది. వారికి బెంగలూరు, ఢిల్లీ, ముంబై, హైదరాబాద్ లలో రియల్ ఎస్టేట్ వ్యాపారాలు ఉన్నాయి. తెలుగుతో పాటు ఇంగ్లీష్, హిందీ, కన్నడ భాషల్లో వార్త, వినోద టీవీ చానెళ్ళు తీసుకురావాలని ఈ సంస్థ భావిస్తోందని ఢిల్లీ జర్నలిస్టులు చెబుతున్నారు. ఇప్పటికే వారు తెలుగులో కొందరు సీనియర్లను సంప్రదించారని వినికిడి. జీతాలు కూడా భారీగానే ఇస్తారట. ఇప్పటికే తెలుగులో పలు ఛానళ్ళు నష్టాలతో నడుస్తుంటే వీరు ఏ ధైర్యంతో వస్తున్నారో మరి. బెస్టాఫ్ లాక్ దట్ ఛానల్.

దక్కన్ క్రానికల్ 19 - 07 - 2010


Sunday, July 11, 2010

' ఎబౌట్ తెలుగు మీడియా ' త్వరలో సొంత పోర్టల్ ద్వారా మీ ముందుకు రాబోతోంది. ప్రింట్, ఇ-ఎడిషన్లను త్వరలోనే వస్తున్నాయి. ఆసక్తి గల జర్నలిస్టులు abouttelugumedia@gmail.com. కి దరఖాస్తులు పంపవచ్చు.

జెమినిలో ఆర్.పి. ఏజెంట్-2

టీవీ-9 సాయి అలియాస్ విజయవాడ సాయి ఆ చానెల్ కు రిజైన్ చేసాడని తాజా వార్త. ఇది నమ్మలేని వార్తే.. రవి ప్రకాష్ కు నమ్మిన బంటు సాయి టీవీ-9 కు రాజీనామా చేయాల్సిన అవసరం ఏమిటి ? ఇందులో ఏదో తిరకాసు లేదా? సాయి ' జెమిని న్యూస్ ' లో చేరుతున్నట్లు సమాచారం. విజయవాడలో ఉండే సాయిని హైదరాబాద్ తెచ్చి సి.ఎం. బీట్ ఇవ్వడం ఏమిటి? ఇప్పుడు ఆయన రిజైన్ చేయడం ఏమిటి? ఇది డ్రామా కాదా? సాయికి, రవి ప్రకాష్ కు మనస్పర్ధలు వచ్చి రిజైన్ చేసాడంటే నమ్మే వెర్రి వాళ్ళు ఉన్నారా? అసలే ఇబ్బందుల్లో ఉన్న జెమిని న్యూస్ కు సాయి వెళ్ళడంలో గుడార్ధం ఏమిటి? రవి ప్రకాష్ ఆశిస్సులతోనే సాయి జెమినికి వెల్లుతున్నట్లు సమాచారం. ఇప్పటికే జెమినిలో ఒక ఆర్.పి. ఏజెంట్ పని చేస్తూ ఆ చానెల్ నషణలో ప్రధాన పాత్ర పోషించాడు. ఇప్పుడు సాయి వంతా? సాయి ని జెమినికి తేవడంలో అక్కడ పని చేయకుండానే జీతం తీసుకునే కృష్ణా జిల్లా / విజయవాడ వ్యక్తి కీలక పాత్ర వహించినట్లు సమాచారం. ఇలాంటి వ్యక్తులను నమ్ముకునే జెమిని దెబ్బ తిన్నది. ప్రస్తుత సిబ్బందికే సరైన జీతాలు ఇవ్వలేని జెమిని, సాయికి టీవీ-9 లో తీసుకుంటున్న జీతం కన్నా అధికంగా ఇవ్వగాలదా? ఇప్పటికే జెమినిలో పని చేసున్న జర్నలిస్టులు చేసిన పాపం ఏమిటి? మంచి జీతాలు ఇస్తే ఇంతకన్నా బాగా వారు పని చేయలేరా? పొరిగింటి పుల్ల కూర రుచి అంటే ఇదేనేమో? అన్నట్లు సాయి పని చేసిన విజయవాడ, తిరుపతి, విశాఖపట్నం నగరాల జర్నలిస్టులను విచారిస్తే అతడి అవినీతి బాగోతాలను కథలు కథలు గా చెబుతున్నారు. ఇతగాడికి ' కసాయి ' అనే నిక్ నేం కూడా ఉంది సుమండీ..

ఉప ఎన్నికల్లో పెయిడ్ ఆర్టికల్స్ పై ఇ.సి. నిఘా

రాష్ట్రంలోని 10 అసెంబ్లీ నియోజక వర్గాలకు జరుగుతున్న ఉప ఎన్నికల సందర్భంగా ఎన్నికల కమిషన్ పెయిడ్ ఆర్టికల్స్ పై ప్రత్యేక నిఘా పెట్టినట్లు సమాచారం. గత పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికల సమయంలో పలు పత్రికలూ, చానెళ్ళు అభ్యర్థుల దగ్గర డబ్బు తీసుకొని ప్రత్యేక వార్తలు, స్టోరీలు ఇచ్చాయి. డబ్బు ఇవ్వలేని అభ్యర్థులకు మీడియాలో సరైన ప్రచారం జరగలేదు. ఈ అమ్ధంపై దేశ వ్యాప్తంగా చర్చ జరిగింది. ప్రెస్ కౌన్సిల్ కూడా ఈ వ్యవహారంపై విచారం వ్యక్తం చేసింది. ప్రస్తుతం ఎన్నికల కమిషన్ పెయిడ్ వార్తలను అరికట్టడం పై దృష్టి సారించినట్లు తెలిసింది.

రేటింగ్ లలో నిజమెంత?

టీవీ చానళ్ళ రేటింగ్ మయాజాలానికి అంతు లోకుండా పోతోంది. మన మీడియా సర్కిల్స్ లో ప్రతివారం చానెల్ రేటింగ్ పేరిట వస్తున్నఎస్.ఎం.ఎస్.ల మతలబు ఏమిటో అర్థం చేసుకోవచ్చు. ఛానల్ రేటింగ్ల వెనుక ఏదో కుట్ర ఉందని పలువురు జర్నలిస్ట్ మిత్రులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా తెలుగు న్యూస్ చానెల్ రేటింగ్లు పలు సందేహాలకు తావిస్తున్నాయి. ఈ రేటింగ్ లలో నిజమెంత? కొన్ని ఛానల్ లను ఆర్థికంగా నైతికంగా, మానసికంగా దెబ్బ తీయడమే ఈ రేటింగ్ల మాటలబా? ముఖ్యంగా ఒక చానెల్ టీవీ -9 తర్వాత స్థానంలో కనిపించడం లోని అర్థం ఏమిటి? నిజంగా ఆ చానెల్ కు అంత ప్రజాదరణ ఉందా అన్నది అనుమానమే? ఈ టీవీ - 2 ను రేటింగ్ లో 3 , 4 లేదా 5 స్థానానికి నెట్టడం లోని అంతర్యం ఏమిటి? ఇ.వి.ఎం. వోటింగ్ పైనే పలు సందేహాలు ఉన్న ఈ రోజుల్లో చానెల్ రేటింగ్ లను నమ్మడం ఎంత వరకు సమంజసం ? అసలు చానెల్ రేటింగ్లు ఏ ప్రాతిపదికన జరుగుతున్నాయి? చూసే వారెవరు? రేటింగ్ సెంటర్లు ఎక్కడెక్కడ ఉన్నాయి? ఈ రేటింగ్ లెక్కల విశ్వసనీయత , చట్టబద్దత ఎంత? చాన్నాళ్ళ యాజమాన్యాలతో వీరికి ఉండే రహస్య సంబందాలు ఏమిటి?.. రేటింగ్లను అడ్డం పెట్టుకొని యాడ్లను తెచ్చుకుంటున్న చానెళ్ళు , తప్పుడు రేటింగ్ల కారణంగా యాడ్లు రాని ఛానళ్ళు .. ఈ రహస్య వ్యవహారాలపై ' ఎబౌట్ తెలుగు మీడియా ' నిఘా పెట్టింది. త్వరలో బండారం బయట పడనుంది.