పైరవీ కొద్దీ ఉద్యోగం..
తెలుగులో ఎన్నడూ లేని విధంగా కొత్త కొత్త చానళ్ళు రాబోతున్నాయి.
జర్నలిస్టులకు ఉద్యోగ అవకాశాలకు కొదవ లేదు.
ఇది బాగానే ఉంది.
కానీ కొత్తగా వచ్చే చానెళ్ళన్నీ ప్రతిభను చూసి ఉద్యోగాలు ఇస్తున్నాయా?
కొత్త చానెళ్ళు పత్రికల్లో ఇచ్చిన ప్రకటనలు చూసి చాలా మంది ప్రస్తుత జర్నలిస్టులు,
కొత్తవారు దరఖాస్తు చేసుకున్నారు.
అయితే వీరిలో చాలా మందికి పిలుపు రావడం లేదు.
కారణం..
పైరవీలే.
కొత్త చానెళ్ళలో చెరిన పెద్ద తలకాయలు కీలక ఉద్యోగాల్లో తమ వారినే పెట్టుకుంటూ వర్గ ప్రాభల్యానికి ప్రాధాన్యత ఇస్తున్నారు.
ఇంటర్వ్యూలు నామ మాత్రంగానే జరుగుతున్నాయి.
కొన్ని చానెళ్ళలో పైరవీ లేనిదే ఉద్యోగం దొరకడం దుర్లభం.
భారీ పెట్టుబడులతో వస్తున్న ఒక చానెల్లో ఉద్యోగాలన్నీ పైరవీలతోనే భర్తీ అయ్యాయని స్పష్టంగా తెలుస్తోంది.
ఈ విషయం తెలియక ఉద్యోగం కోసం వెల్లే సీనియర్ జర్నలిస్టులకు సైతం నో వేకెన్సీ అని మొహం పైనే చెప్పి పంపీస్తున్నారు.
లేదా ఉత్తుత్తి ఇంటర్వ్యూ జరిపి మళ్ళీ పిలుస్తాం అని పంపిస్తున్నారు.
సదరు చానెల్లో అక్రమార్కులు,
రాయటం చేత కాని వారు సైతం చేరి పోయారనే విమర్షలున్నాయి.
సో..
బ్రదర్స్ అండ్ సిస్టర్స్ మీకు పెన్ పవర్ ఒక్కటే ఉంటే సరిపోదు.
పైవవీ శక్తి కూడా ఉండాలి.
దరఖాస్తు చేసి పిలుపు కోసం ఎదురు చూస్తు ఉంటే అవతల ఎవడో పైరవీ జర్నలిస్టు ఉద్యోగం తన్ను పోయే ప్రమాదం ఉంది తస్మాత్ జాగ్రత్త!