Thursday, September 23, 2010

భారీ పెట్టుబడులతో కొత్త దిన పత్రిక

తెలుగులో భారీ పెట్టు బడులతో మరో కొత్త దిన పత్రిక రాబోతోంది. ఉత్తరాదికి చెందిన ఒక ప్రముఖ పారిశ్రామిక వేత్త ఈ పత్రికను తేనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే పత్రిక హెడ్లు కూడా నిర్ణయమై పోయారు కూడా.. ప్రస్తుతం ఎలక్ట్రానిక్ మీడియాలో ఉన్న ప్రముఖ జర్నలిస్ట్ ఈ పత్రికకు ఎడిటర్గా నిర్ణయం అయిపోయారు. మల్టీ కలర్తో ఇప్పుడు ఉన్న పత్రికల కన్నా ఎక్కువ పేజీలు , తక్కువ ధరతో రానున్న ఈ పత్రిక మీడియా వర్గాలో చర్చనీయంశం అయింది. కొత్త పత్రికలో జర్నలిస్టులకు జీతాలు కూడా భారీగానే ఉంటాయంటున్నారు. ఈనాడు, సాక్షి పత్రికలకు ఈ కొత్త పత్రిక గట్టి పోటీ ఇచ్చే అవకాశాలు ఇన్నాయి. ప్రింట్ మీడియా జర్నలిస్టులకు ఇది నిజంగా 'శుభ వార్త'

ఉద్యోగులను సాగనంపుతున్న చానెళ్ళు

న్యాయం చేయడంలో విఫలం అయ్యారు. అసలు ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టుల సంఘం అధ్యక్షుడు ఎవరు? హరి ప్రసాదా? జనార్ధనా? ప్రస్తుతం ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులు గడ్డు రోజుల్ని ఎదుర్కొంటున్నారు. టీవీ చానెల్స్ ఉద్యోగాల్లో కోత విధించే పనిలో పడ్డాయి. ఖర్చులు తగ్గించు కోవడంలో భాగంగా సీనియర్లను సాగనంపి, వారి స్థానంలో కొత్తవారిని తక్కువ జీతాలకు తీసుకుంటున్నాయి. ఎక్కడా కార్మిక చట్టాలు అమలు కావడం లేదు. జర్నలిస్టు సంఘాలు నిద్ర నటిస్తూ వీరిని పట్టించు కోవడం లేదు. ముఖ్యంగా ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టుల సంఘం నాయకులు అంతర్గత కుమ్ములాటలతో పైరవీలు చేసుకోవడానికే పరిమితం అవుతూ.. ఉద్యోగాలు పోయిన జర్నలిస్టులకు న్యాయం చేయడం లేదు. అసలు ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్ట్ సందం అధ్యక్షుడు ఎవరు? హరిప్రసాదా? జనార్ధనా? వారికే సరిగ్గా తెలియదు.

జెమినిలో క'సాయి' కతలు

కోతికి కొబ్బరి కాయ దొరికితే ఎలా ఉంటుంది.. కనకపు సింహాసనమున శునకమును కూర్చుండ బెడితే ఎలా ఉంటుంది.. ఎలాంటి అర్హతలు లేని విజయవాడకు చెందిన చుండురి వెంకట సత్యనారాయణ ఉరఫ్ సాయి ఏకంగా జెమిని న్యూస్ ప్రిన్సిపల్ ఎడిటర్ అయిపోయాడు. ఇదంతా కాస్ట్, ఏరియా మహత్యం. అవినీతికి కేరాఫ్ అడ్రస్ గా సాయి ప్రసిద్దుడని మీడియా వర్గాలు ఘోషిస్తున్న అదే పెద్ద అర్హత అన్నట్లుగా జెమిని-సన్ టీవీ యాజమాన్యం అతన్ని తీసుకుంది. ఇతగాడి ఆగడాలకు జెమిని న్యూస్ సిబ్బంది భరించలేక పోతున్నారు. అన్ని తనకే తెలుసు అనే మూర్ఖత్వం ఉన్న సాయి ప్రతి ఒక్కరితో గొడవకు దిగుతూ.. గిట్టని వారికి టెర్మినేషన్ - షోకాజ్ నోటీసులు ఇప్పిస్తున్నాడు. ఇప్పటికే నలుగురి సబ్ ఎడిటర్లు ఇతగాడికి బలయ్యారు. సీనియర్లను సాగనంపి పూర్తిగా తనవారిని రిక్యుట్ చేసే ప్రయత్నంలో ఉన్నాడు. ఇప్పటికే ఉత్తుత్తి ఇంటర్ వ్యూలు పూర్తి చేసి అప్రూవల్ కోసం లిస్టు చెన్నై పంపాడని వినికిడి. తను చెప్పిన పైరవీ పనులు చేసే వారికి, పాద పూజలు చేస్తూ జోకే వారికే ముఖ్యమైన బీట్లు ఇస్తున్నాడు.. సాయి. ప్రస్తుతం మన కసాయి గారు జెమిని న్యూస్ జిల్లా రిపోర్టర్లను తొలగించే పనిలో ఉన్నాడు. తనకు రెగ్యులర్గా మామూళ్ళు పంపే వారిని జిల్లా రిపోర్టర్లుగా పెట్టుకునే ప్రయత్నాలు చేస్తున్నాడని వినికిడి. పీల గొంతు, ఆముదం తాగిన దేబ్యం మొహం కారణంగా టీవీ-9 యాంకరింగ్, డిబేట్లు నిర్వహించే అవకాశం రాని సాయి, జెమిని న్యూస్ లో తన గుల తీర్చు కుంటున్నాడు..పాపం జెమిని న్యూస్ ప్రేక్షకులు.. కోజ్జాలు, సెక్స్ వర్కర్లతో డిబేట్లు పెట్టి ఆనందిస్తున్నాడు. ఇటీవలే ఒక వేశ్య తన భర్తతో గొడవ పడితే.. మన కసాయి గారు జెమిని న్యూస్లో డిబేట్ పెట్టి.. కేస్ లేకుండా రాజి కుదిర్చి, అవతలి వైపు డబ్బు మింగాడు అని తెలిసింది. టీవీ 9 ఉన్నప్పుడు విజయవాడ, తిరుపతి, విశాఖపట్నం ప్రాంతాల్లో అసాంఘిక శక్తులతో కలిసి భారీ ఆస్తులు వేనుకేసుకున్న సాయి.. లీలలు మరికొన్ని బయటకు రానున్నాయి.

ఛానల్ 4 కు కష్టాలు తప్పవా?

చానెళ్ళు ప్రారంభించడం.. ప్రారంభించగానే లేదా ప్రారంభానికి ముందే తప్పుకోవడం శివరామకృష్ణకు బాగా తెలుసు. సీనియర్ జర్నలిస్టు శివరామకృష్ణ అధ్వర్యంలో.. కొందరు పెద్ద పారిశ్రామిక, రాజకీయ నాయకుల సహకారంతో ప్రారంభం కానున్న చానెల్ 4 గురించి జర్నలిస్ట్ వర్గాలు ఆసక్తిగా చర్చించు కుంటున్నాయి. జర్నలిస్టులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితిలో మూతపడ్డ హెచ్.వై. టీవిని కొనుగోలు చేసి చానెల్ 4 గా మారుస్తున్నారు. ఇప్పటికే రిక్యుట్మెంట్లు పూర్తీ అయ్యాయి. దసరాకు చానెల్ 4 ప్రారంభం అయ్యే అవకాశం ఉంది. అయితే చానెల్ 4 లో జీతాలు పెద్దాగా ఇవ్వట్లేదని వినికిడి. అసలు చానెల్ 4 కు ఈ పేరు ఎందుకు పెట్టినట్లో?.. ఇప్పటికే ఈ చానెల్ 4 పేరుతో బ్రిటన్లో ఒక టీవీ చానెల్ నడుస్తోంది. అదే పేరును ఎక్కడ వాడటం వల్ల ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. గతంలో టీవీ 5 విషయంలోనూ ఇదే గందర గోళం ఉందని ఎబౌట్ తెలుగు మీడియా హెచ్చరించడం.. అది నిజం కావడం ఈ సందర్భంగా గుర్తుకు తెచ్చుకోవలసిన అవసరం ఉంది.
ఎనీ హవ్.. విష్ యు అల్ ది బెస్ట్ చానెల్ 4 ..